ఎంటీవీ రష్‌లో ‘గబ్బర్ సింగ్’ హీరోయిన్
గబ్బర్ సింగ్ హీరోయిన్ శృతి హాసన్ త్వరలో బుల్లితెరపై దర్శనం ఇవ్వబోతోంది. ప్రముఖ మ్యూజిక్ ఛానల్ ఎంటీవీ నిర్వహిస్తున్న 'ఎంటీవీ రష్' కార్యక్రమంలో పాటిస్పేట్ చేయబోతోంది. మ్యూజిక్ కాన్సెప్టుతో సరికొత్తగా రూపొందుతున్న ఈ కార్యక్రమానికి బిజయ్ నంబియార్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ విషయం గురించి శృతి హాసన్ స్పందిస్తూ....'బిజయ్ నంబియాన్ నన్ను కలిసి షో కాన్సెప్టు వివరించారు. నాకు చాలా బాగా నచ్చింది. ఎంటీవీ రష్ లో పాలు పంచుకోవడం ఎంతో థ్రిల్లింగా ఉంది. నాకు సంగీతం అంటే ఎంతో ఇష్టం. ఇక్కడ ప్రేక్షకుల ముందు నా టాలెంట్ చూపించే అవకాశం దక్కుతుంది' అని వ్యాఖ్యానించింది.
వాస్తవానికి శృతి ముందు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకుంది. చెన్నయ్‌లో స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లోనే ఇంగ్లీష్ లిరిక్స్ రాయడం మొదలు పెట్టింది. వెస్టర్న్ పాటలను రాస్తూ స్కూల్లో తోటి విద్యార్థులు, ఉపాధ్యాయుల ప్రశంసలు అందుకునేది. సంగీతంలో శిక్షణ కూడా తీసుకుంది. ఆ మధ్య కమల్ హాసన్ హీరోగా వచ్చిన 'ఈనాడు' చిత్రానికి సంగీతం అందించిది కూడా ఆవిడే. పైగా మంచి సింగర్ కూడా. గతంలో శృతి హాసన్ కొత్త అవతారం ఎత్తి వెల్వెట్ రివాల్వర్ అనే ఇంటర్నేషనల్ బ్యాండ్‌కు లిరిక్స్ రాయడమే గా కుండా పాటలు పాడి అంతర్జాతీయ గుర్తింపు సాధించింది. రాక్ స్టార్ డేవిడ్ కుష్నర్‌కు చెందిన వెల్వెట్ రివాల్వర్ బ్యాండ్‌తో కలిసి శృతి పని చేసింది.


Click it and Unblock the Notifications











