బిగ్ బాస్ హోస్ట్‌గా శృతి హాసన్... ఊహించని విధంగా అందాల భామకు ఆఫర్
బిగ్ బాస్ హోస్ట్ గా ఊహించని వ్యక్తి తెరమీదకు రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అది మన తెలుగు బిగ్ బాస్ కాదండోయ్ తమిళ బిగ్ బాస్. అసలు విషయం ఏమిటంటే కమల్ హాసన్ కు కరోన రావడంతో ఆయన కుమార్తె శృతి హాసన్ బిగ్ బాస్ తమిళ్ తాత్కాలిక హోస్ట్ గా వ్యవహరించబడుతుంది అట్లు ప్రచారం జరుగుతోంది. వివరాల్లోకి వెళితే

సూపర్ క్రేజ్
హిందీలో సూపర్ హిట్ అయిన బిగ్ బాస్ షో నీ ఇతర లోకల్ లాంగ్వేజెస్ లో కూడా తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రసారమవుతోంది. బిగ్ బాస్ తెలుగు విషయానికి వస్తే మొదటి సీజన్ ఎన్టీఆర్ హౌస్ వ్యవహరించగా, రెండో సీజన్కు నాని హోస్ట్ గా వ్యవహరించారు. మూడో సీజన్ నుంచి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నారు. మన దగ్గర ముగ్గురు హీరోలు మారితే తమిళంలో మాత్రం కమల్ హాసన్ మొదటి సీజన్ నుంచి ఆయనే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

ఆ ఒక్క రికార్డు ఆయనకే
హిందీలో కూడా గతంలో చాలా మంది హోస్ట్ లు మారారు కానీ ఒక్క తమిళ్ లో మాత్రమే ముందు నుంచి కూడా కమల్ హాసన్ సూపర్ సక్సెస్ అందుకుంటూ వస్తున్నారు. తెలుగు సీజన్ ఫైవ్ లాగానే తమిళంలో కూడా ప్రస్తుతం సీజన్ ఫైవ్ నడుస్తోంది. అయితే అనూహ్యంగా కమలహాసన్ కరోనా బారిన పడి హాస్పిటల్ పాలు కావడంతో ఆయన ప్రతి వారంలాగా వీకెండ్ ఎపిసోడ్స్ కి హాజరు కాలేని పరిస్థితి. గతంలో కూడా తెలుగులో అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నాగార్జున స్థానంలో అప్పటి ఆయన కోడలు సమంత హోస్ట్ గా వ్యవహరించింది.

కమల్ ప్లేస్ లో
ఇప్పుడు కమల్ హాసన్ ప్లేస్ లో ఆయన కుమార్తె శృతి హాసన్ ను తీసుకువచ్చేందుకు తమిళ్ బిగ్ బాస్ మేకర్స్ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. కమల్ హాసన్ మొదటి భార్యకు సంతానంగా ఉన్న శ్రుతి హాసన్ కమల్ హాసన్ నట వారసురాలిగా సినీ రంగంలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గతంలో ఒక బ్యాడ్ బ్రేకప్ చూసిన ఈ భామ ప్రస్తుతానికి మరో ఆర్టిస్ట్ తో ప్రేమలో ఉంది. తెలుగులో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి హిట్ సినిమాలు అందుకున్న ఈ భామ ఇప్పుడు తండ్రి స్థానంలో హోస్ట్ గా వ్యవహరింకానుంది అనే అంశం ఆసక్తికరంగా మారింది.

ప్రతిపాదనలు ఉంచారు కానీ
అయితే నిర్వాహకులు ఆమె ముందు ప్రతిపాదనలయితే ఉంచారు కానీ ఆమె ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. తండ్రి ఆరోగ్యం బాగోలేదు కాబట్టే ఆమె తండ్రి స్థానంలో నిలబడి నిర్వహిస్తుందా? లేక తనకు ఎందుకు తలనొప్పి అనుకుంటుందో? అనేది చూడాల్సి ఉంది. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న కమల్ హాసన్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని సహచర నటుడు రజనీకాంత్ ఫోన్ ద్వారా తెలుసుకున్నట్లు సమాచారం.
Recommended Video

సాన్నిహిత్య సంబంధాలు
కమల హాసన్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి రజినీకాంత్ ఫోన్ చేసి అక్కడి డాక్టర్లతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకున్నారు అని ప్రచారం జరుగుతోంది. తమిళంలో ఒకప్పుడు పోటాపోటీగా సినిమాలు తీసిన కమలహాసన్ రజినీకాంత్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో ఇద్దరూ ఒకే పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరిగింది. కానీ కమల్ హాసన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు రజినీకాంత్ పార్టీ పెట్టి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు.


Click it and Unblock the Notifications











