Bigg Boss Elimination: షో నుంచి బ్యూటీ ఔట్.. ఇలా జరగడం ఇదే తొలిసారి.. టిష్యూ పేపర్ సీక్రెట్ లీక్
గతంలో ఎన్నడూ చూడని కాన్సెప్టుతో ప్రసారం అవుతోన్నా.. ఎప్పటికప్పుడు సరికొత్త టాస్కులను తీసుకొస్తూ ప్రేక్షకులకు మజాను పంచుతోన్న ఏకైక షో బిగ్ బాస్. హౌస్‌లో ఉండే కంటెస్టెంట్ల మధ్య గొడవలు.. గ్రూపు తగాదాలు.. ప్రేమ కహానీలు.. అప్పుడప్పుడూ రొమాన్స్.. ఎమోషనల్ సీన్స్ ఇలా అన్నింటినీ చూపిస్తూ భారీ స్థాయిలో రేటింగ్‌ను అందుకుంటోంది. అందుకు తగ్గట్లుగానే ఏడో సీజన్ ఎవరూ ఊహించని సర్‌ప్రైజ్‌లతో, ట్విస్టులతో సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో షో నుంచి బ్యూటీ ఎలిమినేట్ అయింది. ఆ సంగతులను మీరే చూడండి!
ఏడో సీజన్‌లోకి షకీలా, కొరియోగ్రాఫర్ సందీప్, శోభా శెట్టి, టేస్టీ తేజ, నటి రతికా రోజ్, ప్రియాంక జైన్, శివాజి, సింగర్ దామిని, నటుడు ప్రిన్స్ యావర్, శుభ శ్రీ, నటుడు గౌతమ్ కృష్ణ, నటి కిరణ్ రాథోడ్, రైతు పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్‌లు వచ్చారు. వీరి నుంచి తొలి వారంలో కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, మూడో వారంలో దామిని, నాలుగో వారంలో రతికాలు బయటకు వెళ్లారు.

బిగ్ బాస్ ఐదో వారం నామినేషన్‌లో ఉన్న ఏడుగురు కంటెస్టెంట్లు టేస్టీ తేజ, ప్రిన్స్ యావర్, ప్రియాంక, శివాజి, శుభశ్రీ రాయగురు, గౌతమ్ కృష్ణ, అమర్‌దీప్‌లలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది సస్పెన్స్‌గా మారింది. దీనికితోడు బిగ్ బాస్ నుంచి వచ్చిన లీకులు ఎన్నో అనుమానాలను రేకెత్తించాయి. దీంతో ఆదివారం ఎపిసోడ్‌పై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది.
ప్రతి వారం నామినేషన్స్‌లో ఉన్న వారిలో ఒక్కొక్కరినీ సేఫ్ చేసుకుంటూ వస్తుంటారు. కానీ, తాజాగా జరుగుతున్న ఎపిసోడ్‌లో మాత్రం ఎలిమినేషన్‌తో మొదలు పెడుతున్నట్లు నాగార్జున చెప్పాడు. అందుకోసం అందరినీ యాక్టివిటీ ఏరియాలోకి రమ్మని లైట్లు ఆర్పేశారు. అనంతరం ఓ దెయ్యం ఆకారంలో ఉన్న వ్యక్తి వచ్చి శుభశ్రీ రాయగురును బయటకు తీసుకుని వెళ్లారు.
ఎలిమినేట్ అయిన తర్వాత స్టేజ్ మీదకు వచ్చిన శుభశ్రీని హోస్ట్ నాగార్జున 'అమ్మా నీకు టిష్యూ పేపర్ మీద గౌతమ్ ఏమి రాసిచ్చాడో చెప్పు' అని అడిగాడు. దీనికామె 'సుబ్బు థ్యాంక్యూ అండ్ సారీరా అని రాశాడు. అందులో లెటర్ త్యాగం చేసిన దాని గురించి థ్యాంక్స్ అని, దీని గురించే సారీ అని కూడా చెప్పాడు సార్' అని ఆమె వెల్లడించింది.
అనంతరం శుభశ్రీ రాయగురును హౌస్‌లోని ప్రతి కంటెస్టెంట్‌తో ఉన్న బెస్ట్ మూమెంట్, వరస్ట్ మూమెంట్‌ను చెప్పమని అడిగాడు. దీంతో ఆమె అందరితో తనకు జరిగిన అనుభవాలను పంచుకుంది. ఇక, శుభశ్రీ బయటకు వెళ్లిపోయే ముందు ఆమె కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన లెటర్‌ను ఇచ్చి పంపించాడు. ఇలా ఈ క్యూట్ లేడీ ఎలిమినేషన్ ముగిసింది.


Click it and Unblock the Notifications











