Bigg Boss Telugu 7: రాహుల్‌ను అలా యూజ్ చేసుకుంటున్న రతిక.. బట్టబయలు చేసిన శుభ శ్రీ
బిగ్ బాస్ సీజన్ 7 నాలుగో వారం కూడా ఆసక్తిగా సాగింది. ఇక ఈ వారం నామినేషన్లు గొడవల మధ్య సాగాయి. గత వారం నామినేషన్లతో పోలిస్తే... ఈ వారం హీట్ బాగానే పెరిగింది. కంటెస్టెంట్లు ఒకరిమీద ఒకరు కంప్లైంట్స్ చేసుకుంటూ... రెచ్చిపోయారు. అసలు హౌస్‌లో కొత్త గొడవలు సృష్టించడానికి కంటెస్టెంట్ల మధ్య చిచ్చు పెట్టడానికి రతిక అయితే బాగానే ప్రయత్నించింది. ఇక నామినేషన్ ప్రక్రియ మొదలుకాగానే ఒక్కొక్కరు రెచ్చిపోయి గొడవలోకి దిగారు. అయితే రాహుల్ ను రతిక బిగ్ బాస్ హౌజ్ లో వాడుకుంటుందని శుభశ్రీ ఆరోపించింది. అసలు దాని కథేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం అయి మూడు వారాలు పూర్తి అయింది. ఇక నాలుగో వారం నామినేషన్స్ ప్రక్రియ సైతం పూర్తైంది. ఇక నామినేషన్స్ ప్రక్రియలో కంటెస్టెంట్స్ ఒకరిని మించి ఒకరు కొట్టుకునేలా బిహేవ్ చేశారు. అయితే నామినేషన్స్ ప్రక్రియకు ముందు శుభ శ్రీ... రతిక గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ రాహుల్ పేరును యూజ్ చేసుకుంటుందని చెప్పుకువచ్చింది.

అసలు ఏం జరగిందంటే.. యావర్.. ప్రియాంకను నామినేట్ చేస్తా అంటూ శుభశ్రీతో చెప్పుకువచ్చాడు. ఇక శుభశ్రీ మాత్రం రతికను నామినేట్ చేస్తానని వెల్లడించింది. రతిక తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ పేరు వాడుతూ... సింపతీ గెయిన్ చేసుకుంటుందని చెప్పింది. నిజంగా ప్రేమిస్తే.. ఆయన పేరును వాడి ఇలా చేస్తారా... జస్ట్ వాడుకుంటుంది అంటూ శుభశ్రీ.. రతక గురించి యవర్ కు చెప్పుకువచ్చింది.
ఇక అన్నట్లుగానే... నామినేషన్స్ ప్రక్రియలో శుభశ్రీ.. రతిక, అమర్ దీప్‌లను నామినేట్ చేసింది. నువ్వు నీ ఎక్స్ బాయ్ ఫ్రెండుని మిస్ అయితే అమర్‌ని ఫాలో అయి మమ్మల్ని నామినేట్ చేయడమేంటని ప్రశ్నించింది. అసలు బిగ్‌బాస్ హౌస్ రూల్స్ ప్రకారం బయట ఉన్న సెలబ్రెటీ గురించి బ్యాడ్‌గా మాట్లాడకూడదు కానీ నువ్వు మాట్లాడుతున్నావ్ అంటూ రతికతో శుభశ్రీ వాదించింది. దీంతో రతిక కూడా తగ్గేదేలా అన్న రేంజులో రెచ్చిపోయింది.

నీ లెక్క నేను మైక్ తీసేసి ఎవరితోనూ గుసగుసలాడలేదు.. (గౌతమ్ తో గతంలో శుభశ్రీ మాట్లాడిన ఉద్దేశంలో) అయినా నేను ప్రియాంకతో నా ఎక్స్ గురించి గుర్తొచ్చి బాధ పడుతుంటే ఆ మాటలు నువ్వు విని ఇక్కడ చెబుతున్నావ్.. నీ క్యారెక్టర్ ఏంటి అంటూ రతిక ఫైర్ అయింది. దీంతో నోరు అదుపులో పెట్టుకో అంటూ శుభశ్రీ కూడా ఫైర్ అయింది.

మొత్తానికి ఇలా ఇద్దరూ కాసేపు గొడవ పడ్డారు. ఆ తర్వాత కంటెండర్‌గా అవకాశం వచ్చినా వదిలేశాడు.. అందుకే అమర్‌ని నామినేట్ చేస్తున్నట్లు శుభశ్రీ రీజన్ చెప్పుకొచ్చింది. ఇక ఈ వారం రతిక నామినేట్ లిస్టులో ఉంది. మొత్తానికి నామినేషన్స్ ప్రక్రియ అయితే హీట్ ఎక్కించేలా జరిగాయి.


Click it and Unblock the Notifications











