»   » శ్వేతబసు ఉన్న ఈ వీడియో చూస్తే మీరు షాక్ అవటం ఖాయం...(వీడియో,ఫొటోలు)

శ్వేతబసు ఉన్న ఈ వీడియో చూస్తే మీరు షాక్ అవటం ఖాయం...(వీడియో,ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై:శ్వేతాబసు ప్రసాద్.. అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ లో ఓ మెరుపు మెరిసిన నటి. బాలనటిగా బాలీవుడ్ సినిమాల ద్వారా జాతీయ పురస్కారం అందుకొంది. 'కొత్త బంగారు లోకం'తో తెలుగు సినీ లోకానికి పరిచయమైంది. ఆ. తర్వాత వ్యభిచార కేసులో ఇరుక్కొని హాట్ టాపిక్ గా నిలిచింది.

కేసులో నుంచి బయటపడిన తర్వాత ఓ చిత్రంలో ఐటమ్ సాంగ్ లో మెరిసినా.. అవకాశాలు మాత్రం రాలేదు. "డర్ సబ్కో లగ్తా హై" అనే ఓ హారర్ సీరియల్ చేస్తూ కాలం గడుపుతోంది ఈ హాట్ బ్యూటీ. అయితే రీసెంట్ గా ఆమె ఏక్తాకపూర్ షో చంద్ర నందిని ఒప్పుకుని చేస్తోంది. ఈ షో స్టార్ ప్లస్ లో రీసెంట్ గా ప్రోమోలు మొదలయ్యాయి.

ఈ షోకు సంభందించిన ఓ ట్రైలర్ వదిలారు. నందిని అనే యువరాణిగా ఈమె ఈ టీవీ సీరియల్ లో కనిపించనుంది. జుట్టు ముడిలో కత్తితో ఆమె ఈ సీరియల్ లో కనిపించనుంది . ఈ ప్రోమో చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. టీవీ సీరియల్స్ కు మహారాణిగా పిలవబడే ఏక్తా కపూర్ ని రాబోతున్న సీరియల్ కావటంతో ఈ సీరియల్ పై మంచి అంచనాలే ఉన్నాయి. మీరూ ఆ ట్రైలర్ ని ఇక్కడ చూడవచ్చు.

స్లైడ్ షోలో మరిన్ని విశేషాలు...

ఈ సీరియల్ లో ...

ఈ సీరియల్ లో ...

ఏక్తాకపూర్ ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్న ఈ సీరియల్ లో జోధా అక్బర్ ఫేమ్ రజత్ తోకాస్ కీలకమైన పాత్ర చేస్తున్నారు. ఆయన రాజా చంద్రగుప్త మౌర్యగా కనిపించి అలరించనున్నారు. మౌర్య సామ్రాజ్యాన్ని స్దాపించిన రాజా చంద్రగుప్తుని కథతో ఈసీరియల్ సాగుతుంది. ఈ సీరియల్ లో శ్వేతాబసుది కీ రోల్ అని తెలుస్తోంది

ఏక్తాకపూర నమ్మకంతో

ఏక్తాకపూర నమ్మకంతో

ఈ సీరియల్ పై ఏక్తాకపూర్ బాగా నమ్మకం పెట్టుకుంది. ఈ సీరియల్ సూపర్ హిట్ అవుతుందని ఆమె నమ్ముతోంది. అందుకే బడ్జెట్ ఎంతైనా ఆమె వెనకాడటంలేదు. ఇది ఒక ఎపిక్ అని ఆమె చెప్తోంది. ఛానెల్ వారు కూడా ప్రైమ్ టైమ్ లో ఈ సీరియల్ ని ప్రసారం చేసి టీఆర్పీలు కుమ్మాలనుకుంటున్నారు. శ్వేతాబసు సైతం ఈ సీరియల్ తనకు లైఫ్ ఇస్తుందనే నమ్మకంతో ఉంది

మేం నమ్మం అంటున్న సినిమా జనం

మేం నమ్మం అంటున్న సినిమా జనం

ఈ సీరియల్ ని సినిమాలాగే అవే ప్రమాణాలతో తీయబోతున్నాం అంటోంది ఏక్తాకపూర్. అయితే అంత సీన్ లేదంటున్నారు సినిమా జనం. సినిమాకు ఖర్చు పెట్టినట్లు టీవి సీరియల్ కు ఖర్చుపెడతారా అంటున్నారు. అయితే టీవి సీరియల్ మొత్తం పూర్తయ్యే సరకి ఆ ఖర్చు తడసిమోపడవుతుంది. అది సినిమా బడ్జెట్ ని దాటుతుంది లెక్క వేస్తే అని చెప్తున్నారు. అయితే ఒకే సారి పెట్టే పెట్టుబడి కాదు కాబట్టి ప్లాబ్లం ఉండదు.

ఎంత పబ్లిసిటీ చేస్తే అంత టీఆర్పీ

ఎంత పబ్లిసిటీ చేస్తే అంత టీఆర్పీ

ఈ టీవి సీరియల్ ని రియల్ లొకేషన్స్ లో తీస్తామని, అంతేకాని టీవి స్టూడియోస్ లో వేసే సెట్స్ లతో తీయమని ఏక్తా చెప్తోంది. అక్టోబర్ నుంచి ఈ సీరియల్ ప్రసారం మొదలవుతుంది. ఈ సీరియల్ ప్రమోషన్ ను కూడా భారీ ఎత్తున చేబడుతున్నారు. సినిమాలాగే ఎంత పబ్లిసిటి చేస్తే అంత టీఆర్పీ, అంత ఎక్కువ యాడ్స్ వస్తాయు. అప్పుడు మాత్రమే డబ్బులు గిట్టుబాటు అవుతాయనే నమ్మకంతో ముందుకు వెళ్తున్నారు.

చాలా హోప్స్ పెట్టుకుంది శ్వేతా...

చాలా హోప్స్ పెట్టుకుంది శ్వేతా...

ఎన్నడూ లేనంత యాక్టివ్ గా సోషల్ మీడియాలో శ్వేతబసు ఉంటోంది. ఆమె జోధాపూర్ లో జరిగే ఈ షూటింగ్ లొకేషన్ ఫొటోలను ఎప్పటికప్పుడు తమ సోషల్ మీడియా ఎక్కౌంట్ ద్వారా షేర్ చేస్తూ పబ్లిసిటీ చేస్తోంది. తనకు సినిమాకన్నా ఎక్కువే ఈ టీవి సీరియల్ అని చెప్తోంది. ఈ సీరియల్ పై తనకు చాలా హోప్స్ ఉన్నాయని, తనకు వస్తున్న ఆఫర్స్ ని సైతం వదులుకుని చేస్తున్నా అంటోంది.

టీవి బాహుబలి మరి

టీవి బాహుబలి మరి

ఈ సీరియల్ లో శ్వేతబసు పాత్ర పేరు నందిని. ఆమె చంద్రగుప్త మౌర్యని ప్రియురాలి పాత్ర లో కనిపించనుంది. ఇదొక టీవి బాహుబలి గా అందరూ అభివర్ణిస్తున్నారు. ఇందులో యుద్దాలు, ప్రేమలు , కుట్రలు ఉంటాయంటున్నారు. శ్వేతాబసు ఈ ప్రోమోలో చాలా ఉందని అంతటా వినిపిస్తోంది. ఆమెకు ఈ సీరియల్ అనంతరం పూర్తి స్దాయి బిజి అయ్యిపోయినా ఆశ్చర్యం లేదని చెప్తున్నారు.

సెక్స్ రాకెట్ లో బయిటపడి

సెక్స్ రాకెట్ లో బయిటపడి

వరుణ్ సందేశ్ తో నటించిన కొత్త బంగారు లోకం శ్వేతబసుకి ఎంతో పేరు తీసుకు వచ్చింది. ఆ తర్వాత సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోవడంతో శ్వేతా బసు మరో కోణంలోకి వెళ్లింది..అయితే అది ముళ్ల బాట అని తర్వాత తెలిసింది. సెక్స్ రాకెట్ లో అడ్డంగా దొరికిపోయిన ఈ అమ్మడు కొంత కాలం రిస్క్యూహోమ్ లో గడిపి వచ్చింది. తర్వాత బెయిల్ పై విడుదలైన తాను నిర్దోషిని అంటూ మొరపెట్టుకుంది. మొత్తానికి శ్వేతా కోర్టు లో నిర్దోషిగా బయటపడింది.

స్క్రిప్టు కన్సల్టెంట్ గా చేస్తోంది

స్క్రిప్టు కన్సల్టెంట్ గా చేస్తోంది

ఇలా ఇండస్ట్రీలో చిన్న నాటి నుంచి ఎంతో పేరు తెచ్చుకున్న శ్వేతాబసు తన కెరీర్ లో ఎన్నో కష్టాలు పడుతూ ముందుకు సాగుతుంది.ఈ సమయంలో ఆమెకు చాలా మంది బాసటగా నిలుస్తామని హామీ ఇచ్చారు..కానీ సమయానికి ఎవ్వరూ ఆదుకోలేక పోయారు. దీంతో చేసేది ఏమీలేక ఈ అమ్మడు అనురాగ్ కశ్యప్ దగ్గర స్క్రిప్ట్ కన్సల్టెంట్ గా పని చేస్తోంది.

లవ్ ఫస్ట్ సైట్ లాగ

లవ్ ఫస్ట్ సైట్ లాగ

స్క్రిప్ట్ కన్సల్టెంట్ గా పని చేస్తున్న సమయంలో అనురాగ్ కశ్యప్ దగ్గరకు తరుచూ వస్తున్న రోహిత్ మిట్టల్ పరిచయం ఏర్పడటం ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఈ ఇద్దరూ ఇష్టపడి డేటింగ్ చేస్తూ చెట్టూ పుట్టా పట్టుకొని తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి వారి ప్రేమ కథ ఎక్కడివరకూ చేరుతుందో చూడాల్సి ఉంది.

ఇవీ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి

ఇవీ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి

శ్వేతబసు ప్రేమకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఏది ఏమైనా శ్వేతా బసు మరో కొత్త జీవితం ప్రారంభించిన పాత జ్ఞాపకాలన్నీ మర్చిపోయిందని అనుకుంటున్నారు ఆమె సన్నిహితులు. త్వరలో విరిద్దరు శుభలేఖ పంపించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ప్రస్తుతం శ్వేతా బసుప్రసాద్ - రోహిత్ లు సన్నిహితంగా ఉన్న స్టిల్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి .

పెళ్ళి ఎప్పుడు...

పెళ్ళి ఎప్పుడు...

ఏళ్ళ ప్రాయంలోనే హిందీ సినిమా మక్డీ ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్‌గా వచ్చిన శ్వేతా నేషనల్ అవార్డును అందుకుంది. ఇటు నటిగా అలరించిన ఈ భామ వేరే రంగంలోను రాణిస్తుండడం హర్షించ దగ్గ విషయం. అయితే ప్రస్తుతం లవ్ మేటర్ తో వార్తలలోకి ఎక్కిన శ్వేతా త్వరలో మూడు ముళ్ళు వేయించుకుంటుందా అనేది తెలియాల్సి ఉంది.

అప్పట్లోనూ శ్వేత అదే దారిలో..

అప్పట్లోనూ శ్వేత అదే దారిలో..

శ్వేతా బసు బాలనటిగా టీవీ సీరియల్స్ ద్వారానే కెరీర్ మొదలు పెట్టింది. హిందీలో పెద్ద హిట్టయిన టీవీ సీరియల్ ‘కహానీ ఘర్ ఘర్ కి'లో శ్వేతా బసు అప్పట్లో శృతి అనే పాత్ర పోషించింది. ఈ సీరియల్ లో శ్వేతా బసు నటనను చూసిన దర్శకుడు ‘మక్డీ' అనే చిత్రంలో అవకాశం ఇచ్చారు. కాబట్టి ఆమెకు టీవి సీరియల్స్ మాత్రం కొత్తేమీ కాదు.

English summary
The first look of Ekta Kapoor's show Chandra Nandini is out. The show that will be aired on Star Plus recently, released a trailer which features Shweta Basu. Shweta, who plays the role of Princess Nandini, will be seen hiding a knife in her hair braid.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu