కోట్లు గుంజే భార్యలకు గుణపాఠం.. భర్తకు భరణం చెల్లించిన సీరియల్ నటి, ఎన్ని కోట్లో తెలుసా?

ప్రస్తుతం ఇండియాలో బుల్లితెర నటుల నుంచి స్టార్స్ వరకు విడాకుల వ్యవహారాలతో బిజీగా ఉన్నారు. ఎప్పుడు ఎవరు? ఏ క్షణంలో బాంబు పేలుస్తారో తెలియక అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు టెన్షన్ పడుతున్నారు. సెలబ్రెటీల విడాకుల వ్యవహారాలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. మరీ ముఖ్యంగా భరణం అత్యంత కీలకం. స్టార్స్ తమ భార్యలకు భరణం కింద ఎన్ని కోట్లు చెల్లిస్తున్నారే దానిపై ప్రజల్లో ఉత్కంఠ ఉంటుంది. దీనిపై మీడియాలో రకరకాల కథనాలు వస్తుంటాయి.

హాట్ టాపిక్‌గా చాహల్ - ధనశ్రీల విడాకులు

కొద్దిరోజుల క్రితం టీమిండియా స్టార్ క్రికెటర్ యజువేంద్ర చాహల్, బాలీవుడ్ నటి ధనశ్రీ వర్మల విడాకుల వ్యవహారం సినీ, క్రికెట్ వర్గాలను కుదిపేసింది. విడాకుల డీల్‌లో భాగంగా భరణం కింద ధనశ్రీ వర్మ రూ.60 కోట్లు డిమాండ్ చేసినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే అదంతా నిజం కాదని తర్వాత తేలింది. రూ.5 కోట్ల మేర సెటిల్ చేసుకున్నట్లు కోర్టుకు తెలియజేశారు. తాజాగా కోలీవుడ్‌లో జయం రవి ఆయన భార్య ఆర్తి రవి మధ్య విడాకుల పంచాయతీ నడుస్తోంది.

Shweta Tiwari hand over Rs 93 lakh property to Her First Husband Raja Chaudhary as a divorce settlement

నెలకు 40 లక్షలు భరణం కోరిన ఆర్తి రవి

ఆర్తి రవితో విడాకులు తీసుకుంటున్నట్లు రవి గతేడాది అధికారికంగా ప్రకటించడంతో అప్పటి నుంచి ఈ వ్యవహారం కోర్టు పరిధిలోనే ఉంది. ఇటీవల సింగర్ కెనీషా ఫ్రాన్సిస్‌తో జయం రవి పబ్లిక్‌గా మీడియాకు దొరకడంతో ఈ విడాకుల వ్యవహారం తెరపైకి వచ్చింది. తమ విడాకులపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే జయం రవి మూడో వ్యక్తితో బంధాన్ని బయటపెట్టారంటూ ఆర్తి రవి మండిపడ్డారు. విడాకుల కేసు విచారణలో భాగంగా ఇటీవలే వీరిద్దరూ చెన్నై ఫ్యామిలీ కోర్టుకు రవి దంపతులు హాజరయ్యారు. ఆర్తితో వైవాహిక బంధాన్ని కొనసాగించే ఉద్దేశం లేదని, తనకు విడాకులు మంజూరు చేయాలని రవి కోర్టుకు తెలియజేశారు. రవి విడాకులు ఇచ్చే పక్షంలో తనకు భరణం కింద నెలకు రూ.40 లక్షలు చెల్లించాలని ఆర్తి రవి డిమాండ్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

బుల్లితెర క్వీన్‌గా శ్వేత తివారీ

సెలబ్రెటీ జంటల్లో విడాకుల తర్వాత తమ భర్తల నుంచి భార్యలు కోట్లాది రూపాయల నగదు, ఆస్తులు, ఇతర విలువైన వస్తువులను పొందుతుంటారు. అలాంటిది ఏకంగా తన భర్తకే భరణం కింద సెటిల్ చేసింది. ఆవిడ ఎవరో కాదు బాలీవుడ్ నటి శ్వేతా తివారీ. ఈమె పేరు వినగానే వెంటనే గుర్తొచ్చే పేరు కసౌతీ జిందగీ కే. ఈ సీరియల్ సూపర్ హిట్ కావడానికి ప్రధాన కారణం శ్వేత అందం, నటన. 1980 అక్టోబర్ 4న ఉత్తరప్రదేశ్‌లో జన్మించిన శ్వేత.. 2000లో ఆనే వాలా పల్ అనే సీరియల్‌తో బుల్లితెర ప్రస్థానాన్ని ప్రారంభించారు.

18 ఏళ్లకే పెళ్లి చేసుకున్న శ్వేత తివారీ

కెరీర్‌లో స్థిరపడక ముందే 18 ఏళ్ల వయసులో 1998లో రాజా చౌదరిని పెళ్లాడారు శ్వేత. ఈ దంపతులకు పాలక్ అనే కుమార్తె ఉంది. దాదాపు పదేళ్లపాటు వీరి కాపురం సజావుగా సాగినప్పటికీ తర్వాత మనస్పర్ధలు రావడంతో 2007లో రాజా చౌదరి- శ్వేత తివారీలు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. అనంతరం అభినవ్ కోహ్లీని ఆమె పెళ్లాడారు. ఇప్పుడు పాలక్ కూడా తల్లిని మించిన అందంతో సినిమాలలో తన హవా చూపిస్తున్నారు. అయితే అందరు భార్యల మాదిరిగా విడాకుల సమయంలో తన భర్త నుంచి కోట్ల రూపాయల భరణాన్ని శ్వేత తివారీ డిమాండ్ చేయలేదని బాలీవుడ్ టాక్. దీనికి ప్రతిగా ఆమె భర్తకు భరణం చెల్లించారట.

భర్తకే భరణం చెల్లించిన శ్వేత

2007లో విడాకుల సెటిల్‌మెంట్‌లో భాగంగా దాదాపు 93 లక్షల రూపాయల విలువైన ఫ్లాట్‌ను రాజా చౌదరికి రాసిచ్చారట శ్వేత. గృహ హింస, వేధింపులు, మద్యపానం అలవాటును విడాకులకు కారణంగా పేర్కొన్నారు శ్వేత. తొలుత పాలక్‌తో కలిపి ఆ ప్లాట్‌పై ఉమ్మడి యాజమాన్య ప్రతిపాదనను రాజా తిరస్కరించాడు. దీంతో కుమార్తె ముఖ్యమని భావించిన శ్వేత తివారీ.. కూతురి కోసం ఆ ఫ్లాట్‌ను రాజా చౌదరికి వదిలేశారు. అలా భర్తకే భరణం చెల్లించి శ్వేత తివారీ వార్తల్లో నిలిచారు.

More from Filmibeat

Read more about: shweta tiwari raja chaudhary
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X