బిగ్ బాస్ 2: సునైనా కోసం తనీష్ పక్షపాత బుద్ది.. తీవ్రంగా నిందిస్తున్న శ్యామల, కౌశల్ వద్ద పంచాయతీ!

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Episode 66 Highlights...!

బిగ్ బాస్ హౌస్ లో మాటల మంటలు మొదలయ్యాయి. ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ పైచేయి సాధించే ప్రయత్నం చేస్తున్నారు. హౌస్ సభ్యులంతా టైటిల్ వేటలో మునిగిపోయారు. విజేతగా నిలవాలంటే ఎలాంటి స్ట్రాటజీ అవలంభించాలి అనే కోణంలో ఎవరి పెర్ఫామెన్స్ వాళ్ళు చేస్తున్నారు. నిన్న ముగిసిన ఎపిసోడ్ లో తనీష్, శ్యామల మధ్య మనస్పర్థలు ఆసక్తికరంగా మారాయి.

 సునైనా నామినేట్

సునైనా నామినేట్

బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ ప్రక్రియ సోమవారం ముగిసింది. ఇంటి సభ్యులు ఇద్దరిద్దరుగా విడిపోయి టాస్క్ లో పాల్గొన్నారు. ఈ టాస్క్ లో శ్యామల, సునైనా జంటగా పాల్గొన్నారు. సునైనా నామినేట్ అయింది. శ్యామల సేవ్ అయింది.

 దురదృష్టం

దురదృష్టం

నామినేషన్ నుంచి బయటపడ్డ శ్యామలని దురదృష్టం వెంటాడింది. టాస్క్ పూర్తైన తరువాత బిగ్ బాస్ ఆదేశాల మేరకు తనీష్ ఒక సభ్యుడిని నామినేట్ చేయాలి. కఠిన నిర్ణయం అయినప్పటికీ తాను శ్యామలని నామినేట్ చేస్తున్నానని తనీష్ ప్రకటించాడు. దీనితో శ్యామల నామినేట్ కావాల్సి వచ్చింది.

శ్యామల నిందలు

శ్యామల నిందలు

తనని తనీష్ నామినేట్ చేయడంతో శ్యామల తీవ్ర వేదనకు గురవుతోంది. తన కారణంగా అతడి స్నేహితురాలు సునైనా నామినేట్ అయిందనే విషయాన్ని మనసులో పెట్టుకుని తనని కావాలనే ఇరికించాడని శ్యామల తనీష్ పై నిందలు వేస్తోంది. అతడికి ఈ విషయం నేరుగా చెప్పకపోయినా ఇతర సభ్యుల వద్ద ప్రస్తావిస్తోంది.

కాపాడే ప్రయత్నం

కాపాడే ప్రయత్నం

తనీష్ సునైనని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడని శ్యామల ఆరోపిస్తోంది. పక్షపాత బుద్దితో వ్యవహరిస్తున్నట్లు కామెంట్స్ చేసింది. నేను హౌస్ లో సరిగా ఆడడం లేదా, నా పద్ధతి నచ్చలేదా ఇలాంటి కారణాలు ఏం చెప్పినా నాకు ఒకే అని శ్యామల తెలిపింది.

ఫెయిల్ అయ్యాడు

ఫెయిల్ అయ్యాడు

తాను అభిమానుల మద్దత్తుతో తిరిగి వచ్చానని, అందువలనే నామినేట్ చేసానని అతడి చూపిన కారణం నాకు నచ్చలేదు అని శ్యామల గగ్గోలు పడుతోంది. అతడు స్నేహితుడిగా విజయం సాధించి ఉండవచ్చు కానీ కెప్టెన్ గా ఫెయిల్ అయ్యాడని శ్యామల తెలిపింది.

బుజ్జగిస్తున్న సునైనా

బుజ్జగిస్తున్న సునైనా

మరోవైపు శ్యామలని నామినేట్ చేయాల్సి వచ్చినందుకు తనీష్ తెగ ఫీలైపోతున్నాడు. భాదపడుతున్న తనీష్ ని సునైనా బుజ్జగిస్తోంది. శ్యామల మాత్రం ఈ విషయంలో సామ్రాట్, కౌశల్ వద్ద పంచాయతీ పెడుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X