బిగ్‌బాస్‌లోకి వాళ్ళిద్దరిలో ఒకరు రీ ఎంట్రీ.. దూసుకుపోతున్న నూతన్ నాయుడు, శ్యామల!

Recommended Video

Bigg boss Season 2 Telugu:Today Is The Last Day To Vote For Eliminated Contestent's

బిగ్ బాస్ హౌస్ లో అప్పుడే టైటిల్ పోరు మొదలైపోయింది. హౌస్ లో సభ్యుల పెర్ఫామెన్స్ చూస్తుంటే టైటిల్ దక్కించుకోవడం కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వైల్డ్ కార్డు ఎంట్రీ, ఎలిమినేట్ అయిన వారిని తిరిగి ఓటింగ్ ద్వారా హౌస్ లోకి తీసుకుని వచ్చే విధానం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కాగా ఈ ఓటింగ్ ప్రక్రియలో ఎలిమినేట్ అయిన సభ్యులలో ఎవరు తిరిగి హౌస్ లోకి చేరుకుంటారు అనేది ఉత్కంఠగా మారింది.

నూతన్ నాయుడికి అవకాశం

నూతన్ నాయుడికి అవకాశం

ఆడియన్స్ లో ఎక్కువగా నూతన నాయుడు పేరు వినిపిస్తోంది. సామాన్యుడిగా అతడివైపు ఆడియన్స్ మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఆరంభంలోనే నూతన నాయుడు హౌస్ లో కొన్ని వివాదాల్లో చిక్కుకున్నారు. బాగా ఎవరు ఎంటర్ టైన్ చేయగలరు అని ప్రేక్షకుడు ఆలోచిస్తే నూతన్ నాయుడుకి మైనస్ గా మారె అవకాశం ఉంది.

శ్యామల పేరు కూడా

శ్యామల పేరు కూడా

నూతన్ నాయుడు తరహాలోనే శ్యామల పేరు కూడా బాగా వినిపిస్తోంది. శ్యామల ఎలిమినేషన్ నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. కౌశల్, తేజస్వి.. దీప్తి, నందినిని సేవ్ చేయడంతో శ్యామల ఎలిమినేషన్ జరిగింది. గలగలా మాట్లాడుతూ కలుపుగోలుగా ఉండడం ఆమె బలం. కాబట్టి ఆడియన్స్ శ్యామలకు మద్దత్తు తెలిపే అవకాశాలు కూడా ఉన్నాయి.

చివరి రోజు

చివరి రోజు

ఎలిమినేట్ అయిన వారిలో ఒకరిని తిరిగి హౌస్ లోకి పంపించే ఓటింగ్ ప్రక్రియకు నేడు చివరి రోజు. ఎవరు ఎన్నిక అవుతారు అనే విషయంలో ఆడియన్స్ లో తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది.

మిగిలిన వాళ్లలో

మిగిలిన వాళ్లలో

నూతన్ నాయుడు, శ్యామలతో పాటు తేజస్వి, సంజన, కిరీటి, భానుశ్రీ కూడా ఎలిమినేట్ అయినవారిలో ఉన్నారు. అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప వీరిలో ఒకరు హౌస్ లోకి తిరిగి ప్రవేశించే అవకాశాలు కనిపించడం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X