బిగ్ బాస్2: కొత్త పద్దతిలో ఈ వారం నామినేషన్.. ఆయన మాట్లాడడం ఇంతవరకు చూడలేదు!

బిగ్ బాస్ 2 లో చివరి దశ ప్రారంభమైపోయిందని చెప్పొచ్చు. ప్రతి వారం, ప్రతి రోజు ఇక నుంచి కీలకమే. నిన్ననే అల్లరి పిల్ల దీప్తి సునైనా ఎలిమినేషన్ కూడా జరిగిపోయింది. ప్రస్తుతం ఇంట్లో ఉన్న వారిలో ఒకరిద్దరు మినహా మిగిలినవారంతా ఒకరికి ఒకరు గట్టి పోటీ ఇచ్చే వారే కావడం విశేషం. సునైనా వెళ్ళిపోయింది కనుక ప్రస్తుతం హౌస్ లో 11 మంది సభ్యులు ఉన్నారు. సోమవారం నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. తాజాగా విడుదల చేసిన ప్రోమో ప్రకారం నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

 కొత్త పద్ధతి

కొత్త పద్ధతి

విభిన్నమైన టాస్క్ లు ఇస్తూ బిగ్ బాస్ ఇంటి సభ్యుల మధ్య పోటీ పెంచుతున్నారు. నేటి ఎపిసోడ్ లో కూడా నామినేషన్ కోసం బిగ్ బాస్ కొత్త పద్ధతి అవలంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఇంటి సభ్యులంతా బిగ్ బోస్ ముందు ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటున్నారు.

ఇంతవరకు చూడలేదు

ఇంతవరకు చూడలేదు

ప్రతి ఒక్క ఇంటి సభ్యుడు మిగిలిన సభ్యుల గురించి బిగ్ బాస్ కు సీక్రెట్ గా వివరిస్తున్నారు. దానిని బట్టి నామినేషన్స్ నిర్ణయిస్తారేమో చూడాలి/ ప్రోమోలో చూపినదాని ప్రకారం శ్యామల ఎవరిగురించో నెగిటివ్ గా మాట్లాడుతోంది. ఆయన మాట్లాడింది ఇంతవరకు చూడలేదని చెబుతోంది. శ్యామల చెబుతోంది ఎవరి గురించో నేటి ఎపిసోడ్ లో తెలుసుకోవాలి.

గీత మాధురి

గీత మాధురి

గీత మాధురి మాట్లాడుతో ఆయన చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు నాకు నచ్చడం లేదు అని గీత మాధురి చెబుతోంది. దీప్తి, తనీష్, సామ్రాట్ కూడా వారి అభిప్రాయాలు చెబుతున్నారు. వీరంతా దీనిగురించి మాట్లాడుతున్నారనే ఉత్కంఠ నెలకొని ఉంది.

ఒకరిద్దరు

ఒకరిద్దరు

ప్రస్తుతం హౌస్ లో ఉన్న సభ్యులలో ఒకరిద్దరు మినహా మిగిలినవారంతా టైటిల్ గెలిచే సత్తా ఉన్నవారే. దీనితో రాబోవు రోజుల్లో బిగ్ బాస్ 2 మరింత రసవత్తరంగా మారనుంది. విజేతగా నిలవడం కోసం ఎవరు ఎలాంటి వ్యహం అనుసరిస్తారో చూడాల్సి ఉంది.

గణేష్

గణేష్

అదృష్టం కొద్ది గణేష్ గత వారం నామినేషన్ నుంచి బయటపడ్డాడు. ప్రస్తుతం ఉన్న ఇంటిసభ్యులలో కాస్త వెనుకబడ్డట్లు కనిపిస్తోంది గణేషే. పూజ రామచంద్రన్ మధ్యలో హౌస్ లోకి అడుగుపెట్టింది. కానీ ఆమె హౌస్ లో చురుకుగా కనిపిస్తోంది. ఇకపై వీరు ఎలాంటి ప్రదర్శన చేస్తారు అనే దానిబట్టే హౌస్ లో ఎన్నిరోజులు ఉంటారో తేలనుంది.

కౌశల్ గట్టిగా

కౌశల్ గట్టిగా

శనివారం రోజు నాని హౌస్ లో ప్రధమ పోటీదారుడిగా ఆడియన్స్ భావిస్తున్న కౌశల్ కు గట్టిగా క్లాస్ పీకాడు. దీనిద్వారా రాబోవు రోజులు కౌశల్ కు కూడా అంత సులభంగా ఉండవని అంతా అంచనా వేస్తున్నారు. గీత మాధురి, తనీష్, దీప్తి వంటి వారు కౌశల్ కు గట్టి పోటీ ఇస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X