For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  క్యాష్ షోలో సీరియల్ నటుల ముద్దులు: రవికృష్ణతో నవ్య స్వామి కటీఫ్..

  |

  ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు ఇరవై ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై హవాను చూపిస్తూ నెంబర్ వన్ యాంకర్‌గా వెలుగొందుతోంది సుమ కనకాల. పక్క రాష్ట్రానికి చెందిన మహిళే అయినా.. మాటతీరులోనూ.. వ్యవహార శైలిలోనూ అచ్చం తెలుగింటి ఆడపడుచులా కనిపిస్తుంది. అలా సుదీర్ఘ ప్రయాణంలో కొన్ని లక్షల మంది అభిమానాన్ని సంపాదించుకుంది. అదే సమయంలో వరుసగా ఆఫర్ల మీద ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది.

  ఇక, సుమ ప్రస్తుతం హోస్ట్ చేస్తున్న షోలలో 'క్యాష్' చాలా ప్రత్యేకమైనదన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ షో నుంచి వచ్చిన వీడియో షాక్‌కు గురి చేస్తోంది. ఇందులో రెండు జంటలు అందరికీ షాకిచ్చాయి. ఆ సంగతులేంటో మీరూ చూడండి!

  అప్పటికీ ఇప్పటికీ నెంబర్ వన్

  అప్పటికీ ఇప్పటికీ నెంబర్ వన్

  తెలుగు బుల్లితెరపై ఊహించని రీతిలో క్రేజ్‌ను అందుకున్న యాంకర్లలో సుమ కనకాల ఒకరు. చాలా కాలంగా ఇండస్ట్రీలో తన హవాను చూపిస్తోందామె. చాలా మంది అమ్మాయిలు గ్లామర్‌తో అవకాశాలను అందిపుచ్చుకుంటుంటే.. ఈమె మాత్రం అద్భుతమైన టాలెంట్‌తో ఛాన్స్‌లు పట్టేస్తోంది. ఈ క్రమంలోనే వరుస పెట్టి కొత్త కొత్త ప్రోగ్రామ్‌లు చేసుకుంటూ దూసుకుపోతోంది.

  బాడీ పార్టులన్నీ చూపిస్తూ అనన్య నాగళ్ల అరాచకం: తెలుగమ్మాయిని ఇంత హాట్‌గా ఎప్పుడూ చూసుండరు!

  ఎంటర్‌టైన్‌మెంట్‌లో తగ్గేదేలే

  ఎంటర్‌టైన్‌మెంట్‌లో తగ్గేదేలే

  సుమ కనకాల యాంకర్‌గానే కాకుండా ఎంటర్‌టైన్‌మెంట్‌కు చిరునామాగా మారింది. తన షోలను చూసే వారికి వందకు వంద శాతం వినోదాన్ని పంచేందుకు ఆమె ఎంతగానో శ్రమిస్తుంది. ఈ క్రమంలోనే అద్భుతమైన టైమింగ్‌తో గుక్క తిప్పుకోకుండా పంచులు వేస్తూ ఎదుటి వారిపై దండయాత్ర చేస్తోంది. దీంతో టాప్ యాంకర్ కాస్తా బుల్లితెరపై తగ్గేదేలే అంటూ హవా చూపిస్తోంది.

  సుమకు ఈ షో చాలా ప్రత్యేకం

  సుమకు ఈ షో చాలా ప్రత్యేకం

  సుదీర్ఘమైన కెరీర్‌లో యాంకర్ సుమ ఎన్నో వినోదాత్మక కార్యక్రమాలు చేసింది. వీటిలో చాలా వరకు సూపర్ హిట్ అవడంతో పాటు ఆమెకు మంచి పేరును తెచ్చి పెట్టాయి. అందులో 'క్యాష్' కూడా ఒకటని తెలిసిందే. బుల్లితెర, వెండితెరకు చెందిన సెలెబ్రిటీలు హాజరయ్యే ఈ షో విజయవంతంగా ప్రసారం అవుతోంది. దీనికి వచ్చిన వారికి సుమ చుక్కలు చూపిస్తూ ఉంటుంది.

  ప్యాంటు విప్పేసి షాకిచ్చిన ప్రగ్యా జైస్వాల్: పైన కూడా ఓ రేంజ్‌లో.. వామ్మో ఇది మరీ ఘోరం!

  రెండు జంటలతో సుమ రచ్చ

  రెండు జంటలతో సుమ రచ్చ

  వచ్చే వారం ప్రసారం కానున్న 'క్యాష్' ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో సీరియల్ నటులు సిద్దార్థ్ - విష్ణు ప్రియ.. రవికృష్ణ - నవ్య స్వామి జంటలుగా వచ్చారు. వీళ్లతో సుమ చేసిన సందడి అంతా ఇంతా కాదు. వాళ్లు కూడా ఈ టాప్ యాంకరమ్మకు సమానంగానే పంచులు వేశారు. దీంతో ఈ ప్రోమో వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.

  సుమ లిప్‌స్టిక్‌ల లీగ్‌లో కిస్‌లు

  సుమ లిప్‌స్టిక్‌ల లీగ్‌లో కిస్‌లు

  సీరియల్ నటులు సిద్దార్థ్ - విష్ణు ప్రియ.. రవికృష్ణ - నవ్య స్వామి జంటలుగా వచ్చిన వచ్చే వారం ఎపిసోడ్‌లో యాంకర్ 'సుమ లిప్‌స్టిక్‌ల లీగ్' అంటూ ఓ ఆట ఆడించింది. ఇందులో భాగంగా విష్ణు ప్రియ పెదాలకు లిప్‌స్టిక్ వేసి ఆమె భర్త సిద్దార్థ్‌కు ముద్దులు పెట్టాలని చెప్పింది. అచ్చు సరిగా పడితే ఆన్సర్ చెప్పక్కర్లేదని.. పడకపోతే చెప్పాల్సి ఉంటుందని కండీషన్ పెట్టింది సుమ.

  సమంత, నాగ చైతన్య విడాకుల కథలో బిగ్ ట్విస్ట్: ఆ పార్టీ తర్వాతే విభేదాలు.. ముందు అడిగింది తనేనట!

  ముద్దులతో రచ్చ చేసిన జంట

  సుమ ఇచ్చిన టాస్కులో భాగంగా లిప్‌స్టిక్ వేసుకున్న విష్ణు ప్రియ.. తన భర్త సిద్దార్థ్‌కు ముద్దుల మీద ముద్దులు పెట్టింది. అప్పుడు కొన్ని సందర్భాల్లో అచ్చు సరిగా పడడంతో ఆన్సర్ చెప్పే అవసరం లేకుండా తప్పించుకుంది. ఇక, వాళ్లు ముద్దులు పెట్టుకుంటోన్న సమయంలో సుమతో పాటు రవికృష్ణ కూడా అలా చూస్తూ ఉండిపోయారు. దీంతో ఇది చాలా ఫన్నీగా సాగింది.

  రవి, నవ్య కటీఫ్.. ఏడ్చిన సుమ

  రవి, నవ్య కటీఫ్.. ఏడ్చిన సుమ

  ఇక, ఈ ప్రోమో చివర్లో రవికృష్ణ.. నవ్య స్వామి విడిపోతున్న ప్రేమికులుగా నటించారు. తన ఫ్యామిలీ పెళ్లికి ఒప్పుకోవడం లేదని.. అందుకే అతడిని వదిలేస్తున్నానని నవ్య చెబుతుంది. దీనికి రవి కొన్ని ప్రశ్నలు సంధిస్తాడు. అయినప్పటికీ ఆమె వదిలేసి వెళ్లిపోతుంది. ఇదంతా ఎంతో ఎమోషనల్‌గా సాగింది. ఆ సమయంలో యాంకర్ సుమ కూడా కన్నీరు పెట్టుకుని కనిపించింది.

  English summary
  Ravi Krishna, Navya Swamy, Siddharth and Vishnu Priya participated in Anchor Suma Cash Show Upcoming Episode. Kisses Task Will Be Highlight In This Show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X