Don't Miss!
- News ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు నమోదు
- Sports PBKS vs MI: రోహిత్ శర్మ ట్రేడ్ మార్క్ సిక్సర్.. హార్దిక్ రియాక్షన్ వైరల్! వీడియో
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
తప్ప తాగి మూడు కార్లు, కరెంట్ పోల్‌ని గుద్దేశాడు, ఫోటోలు చూస్తే షాకే.. టివి నటుడి అరెస్ట్!
కొందరు సెలెబ్రిటీలు సమాజంలో బాధ్యత రాహిత్యంగా మెలుగుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. తరచుగా యువ నటులు తప్ప తాగి అరెస్ట్ పోలీసులకు చిక్కుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా టివి సీరియల్ నటుడు సిద్దార్థ్ శుక్లా తన కారుతో మూడు వాహనాల్ని, కరెంటు పోల్ ని ధ్వంసం చేసిన ఘటన ముంబై లో చోటు చేసుకుంది.
చిన్నారి పెళ్లి కూతురు
హిందీలో విజయవంతం అయిన చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తెలుగులో కూడా విపరీతమైన ప్రేక్షాదరణ పొందింది. ఈ సీరియల్ లో ప్రధాన పాత్రలో నటించిన సిద్దార్థ్ శుక్లాని తాగి వాహనం నడపడం, మూడు వాహనాల్ని ప్రమాదానికి గురి చేసిన కేసులో అరెస్ట్ చేశారు.
అతివేగం
పోలిసుల సమాచారం ప్రకారం సిద్ధార్థ్ శుక్లా ముంబై లోని ఓషివారా ప్రాంతంలో అతివేగంతో వాహనాన్ని నడుపుతున్న సమయంలో కారు అదుపు తప్పింది. వేగంగా మూడు కార్లని ధ్వంసం చేసిన అనంతరం కారు పక్కనే ఉన్న కరెంట్ పోల్ ని ఢీ కొట్టినట్లు పేర్కొన్నారు.
ఇంత ప్రమాదం జరిగినా
ఇంత పెద్ద ప్రమాదం జరిగినా కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోలేదు. పైగా సిద్దార్థ్ కు ఎటువంటి గాయాలు కాలేదు. ప్రమాదానికి గురైన ఓ కారులో వ్యక్తికీ మాత్రం స్వల్ప గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు.
నాలుగు సెక్షన్ల కింద
సిద్దార్థ్ శుక్లాని 229, 336, 337, 427 సెక్షన్ల కింద అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అరెస్టు అనంతరం అతడు బెయిల్ పై విడుదలైనట్లు తెలుస్తోంది. 2014 లో కూడా ఈతరహా ప్రమాదంలో అతడు ఇన్వాల్వ్ అయినట్లు తెలుస్తోంది.