Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 నుంచి షాకింగ్ న్యూస్.. ఈసారి మెగాస్టార్ కూడా!

తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఏడాది ఇంటిల్లిపాదిని అలరించే ఈ షో... ఇప్పటికే ఆరు సీజన్స్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. ఇక తాజాగా ఏడో సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రోజుకో అప్డేట్ సోషల్ మీడియాలో లీక్ అవుతూ వస్తోంది. ఇప్పుడు ఈ సీజన్ నుంచి మరో అప్టేట్ వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే...

బిగ్ బాస్ షో హిందీలో బాగా క్లిక్ అవడంతో.. రీజినల్ లాంగ్వేజస్ లో కూడా తీసుకువచ్చారు. ఇక తెలుగులో మొదట జూనియర్ ఎన్టీఆర్ తో ఈ షో ప్రారంభం అయింది. ఇక అందులో చాలా వరకు సినీ యాక్టర్స్, తెలిసిన వారే ఉండటంతో బాగా సక్సెస్ అయింది. ఇక రెండో సీజన్ నాని చేయగా... దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక మూడో షో నుంచి అక్కినేని నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారు. ఆయన ఆరో సీజన్ వరకు హోస్ట్ గా చేసి... ఇప్పుడు మరోసారి ఏడో సీజన్ కు కూడా హోస్ట్ గా చేయనున్నట్లు తెలుస్తోంది.

Silver screen megastar etv prabhakar confirmed For Bigg Boss Telugu 7 ContestantS News Goes Viral

ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ షోలో బుల్లితెర మెగాస్టార్ ఈటీవీ ప్రభాకర్ వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈటీవీలో ప్రోగ్రామ్స్, సీరియల్స్ ద్వారా బాగా ఫేమస్ అయిన ప్రభాకర్ ఆ తర్వాత మా టీవీకి షిఫ్ట్ అయ్యారు. అక్కడ కూడా సీరియల్స్, ప్రోగ్రామ్స్ లో కనిపిస్తూ... ప్రేక్షకులను అలరించారు. ఇక ఇటీవల ఆయన వదినమ్మ సీరియల్ తో అలరించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా.. ప్రభాకర్ త్వరలో రాజుగారి పూలవ్ సినిమాతో కూడా అలరించనున్నారు. ఆయన ఈ సినిమాలో కీలక పాత్రలో పోషించారు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ ఇప్పటికే ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో ప్రభాకర్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ షోకు వస్తున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి. అంతే కాదు ఆయన కుమారుడు సుహాస్ కూడా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్ నడుస్తుంది.

Silver screen megastar etv prabhakar confirmed For Bigg Boss Telugu 7 ContestantS News Goes Viral

సుహాస్ ఇప్పటికే సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్ అయ్యారు. కొడుకును మీడియా ముందు పరిచయం చేద్దామని.. ప్రభాకర్ చేసిన కార్యక్రమంలో.. సుహాస్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ ట్రోలింగ్ కు గురయ్యాయి. ఇక యాటిట్యూడ్ స్టార్ అంటూ సోషల్ మీడియాలో ఆయన వీడియోలు వైరల్ కాగా... ఆ మధ్య సుహాస్ చేసిన వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఆ వీడియో చూసిన చాలా మంచి టాలెంట్ ఉన్న కుర్రాడే అని ఫిక్స్ అయ్యారు. ఇక వీరు ఇద్దరు బిగ్ బాస్ లోకి వస్తున్నట్లు టాక్ వస్తోంది.

అయితే మరోవైపు సుహాస్ హీరోగా చేసిన సినిమాలు ఈ అక్టోబర్ లో రిలీజ్ కు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దానితో పాటు.. ప్రభాకర్ మరో సీరియల్ కమిట్ అయ్యారట. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ కు రాకపోవచ్చు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ వీరు గనుక బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తే.. తండ్రీ కొడుకులు షోలో చేసిన రికార్డు వీరికే దక్కుతుంది. ఇక వస్తారా రారా అనేది.. మున్మందు తెలియాలి. అప్పటివరకు వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X