అమ్మాయిల పర్సనల్ వీడియోను బయటపెట్టిన 'గృహలక్ష్మి' కస్తూరి.. సింగర్‌తోపాటు నెటిజన్లు ఫైర్
ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా వెలుగు వెలిగిన ముద్దుగుమ్మలు ఇప్పుడు తమ ఏజ్ కు తగిన పాత్రలతో సినిమాల్లో, సీరియళ్లలో సందడి చేస్తున్నారు. అలాంటి వారిలో సీనియర్ బ్యూటి కస్తూరి శంకర్ ఒకరు.
చిన్న వయసులోనే మిస్ చెన్నైగా ఎంపికైనా బ్యూటిఫుల్ కస్తూరి శంకర్ అప్పట్లో తెలుగు, తమిళ చిత్రాల్లో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు మరింతగా చేరువైంది. అయితే ఎప్పుడో ఏదో ఒక విషయంపై స్పందించే కస్తూరి శంకర్ తాజాగా వివాదంలో ఇరుక్కుంది.
వీడియో దుమారం: అన్నమయ్య సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరోయిన్ కస్తూరి శంకర్. అప్పట్లో అనేక చిత్రాలతో తన గ్లామర్ తో అలరించిన కస్తూరి ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై సందడి చేస్తోంది. సోషల్ మీడియాలో నిత్యం యమ యాక్టివ్ గా ఉండే కస్తూరి శంకర్ సామాజిక అంశాలపై గట్టిగానే మాట్లాడుతుంది. కానీ, అప్పుడప్పుడు అవి కాంట్రవర్సీ అవుతుంటాయి. తాజాగా కస్తూరి షేర్ చేసిన వీడియో దుమారం రేపుతోంది.

అసహ్యం కాదు: ఇద్దరు అమ్మాయిలకు సంబంధించిన ఓ వీడియోను తాజాగా షేర్ చేసింది కస్తూరి శంకర్. అందులో ఆ అమ్మాయిలు వైన్ షాపుకు వెళ్లి మద్యం బాటిళ్లు కొనుగోలు చేశారు. ఈ వీడియో షేర్ చేస్తూ.. "తాగండి అమ్మాయిలు తాగండి. ఏమాత్రం తగ్గొద్దు. 8 మందిలో ఈమె ఒక్కరే మగరాయుడు. ఇదీ ఏ మాత్రం తప్పు కాదు. అసహ్యమూ కాదు" అని కస్తూరి శంకర్ రాసుకొచ్చింది.
అర్థం కావట్లేదు: కస్తూరి శంకర్ ఇంకా కొనసాగిస్తూ.. "మీరు అలా చేస్తే ఏమవుతుంది. మహా అయితే వాట్సాఫ్ ఫార్వర్డ్ ఆఫ్ ద డే అవుతుంది. మీరు సూపర్. మహిళల హక్కుల గురించి ఆలోచించకుండానే తిరిగి వస్తున్నాయి" అని చెప్పుకొచ్చింది. అయితే ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు 'వాళ్లను పొగుడుతున్నావా? లేదా తప్పుపడుతున్నావా? ఏమాత్రం అర్థం కావట్లేదు' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

దమ్ము ఉందా నీకు: మరికొందరు కస్తూరి శంకర్ పై తీవ్రంగా సీరియస్ అవుతున్నారు. అమ్మాయిల వీడియోను ఇలా ఇంటర్నెట్ లో షేర్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. చిత్ర పరిశ్రమలోని ప్రముఖుల అమ్మాయిలు పబ్ లకు వెళ్తున్నారు. వారి ఫొటోలు కూడా ఇలా షేర్ చేసే దమ్ము ఉందా నీకు, అమ్మాయిలు అయినంతా మాత్రానా మద్యం తీసుకోకుడదా, వారికంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయనేది గుర్తించాలి అని మండిపడుతున్నారు.
ఇది చాలా తప్పు: ఇక కస్తూరి శంకర్ పోస్ట్ చేసిన వీడియోపై ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద కూడా స్పందించింది. "కస్తూరి నువ్వు ఇలా షేర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. నిజాయితీగా చెబుతున్నా. ఇది చాలా తప్పు" అని ట్వీట్ చేసింది సింగర్ చిన్మయి. దీంతో కస్తూరి శంకర్ ను తప్పుబట్టిన నెటిజన్లు చిన్మయిని మెచ్చుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











