Bigg Boss Telugu 7స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ వద్ద శిష్యరికం.. సింగర్ దామినీ గురించి మీకు తెలియని విషయాలివే!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఎట్టకేలకు అట్టహాసంగా ప్రారంభం అయింది. అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహారిస్తున్న ఈ షో కు సంబంధించిన గ్రాండ్ కర్టెన్ రైజర్ ఈవెంట్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇక ఈ నేపథ్యంలో ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి మాకు తెలిసినా వివరాలు.. మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. వారిలో సింగర్ దామినీ గురించి ఇప్పుడు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
సింగర్ దామినీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆమె సింగర్ గా ఎన్నో పాటలు పాడి అలరించింది. రాజమౌళి తెరకెక్కించిన శివుని అనా, పచ్చ బొట్టెసి పాటలు పాడింది ఈమనే. దామిని హైదరాబాదులో పుట్టి పెరిగారు. ఇక ఈమె సంగీత కుటుంబం నుంచి వచ్చింది. దామిని ముత్తాత, ప్రముఖ సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణామూర్తి. ఆయన ప్రభావం వల్లే దామిని సంగీతం నేర్చుకోవాల్సి వచ్చింది.

దామిని భట్ల జూలై 4, 1996న ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో తల్లిదండ్రులు సిహెచ్ రాధా కృష్ణ మరియు శ్రీ ఝాన్సీలకు జన్మించారు. దామిని ప్రారంభ జీవితం ఆమె అక్క మౌనిమా భట్ల వల్ల సంగీతంలో మునిగిపోయింది. ఆమె కూడా సంగీత విద్వాంసురాలు కూడా. దామిని కుటుంబం మొదట కాకినాడలో నివసించింది. అక్కడ ఆమె మొదటగా కర్ణాటక సంగీతం నేర్చుకుంది.
ఇక ఈటీవీలో బాలసుబ్రమణ్యం పాడుతా తీయగా రియాలిటీ సింగింగ్ షోలో పాల్గొన్న దామిణి.. అక్కడి నుంచి ఆమె ప్రస్థానం మొదలు అయింది. ఇక ఇటీవల జీ సరేగమపఎల్ ఛాంపియన్స్ లో కూడా ఆమె పాల్గొని రెండో స్థానంలో నిలిచింది. ఇది ఆమె కెరీర్‌లో ఒక ప్రధాన మలుపు అని చెప్పవచ్చు.
SS రాజమౌళి బ్లాక్‌బస్టర్ "బాహుబలి: ది బిగినింగ్" కోసం దామిని అందమైన "పచ్చ బొట్టేసిన" పాటను పాడి... ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. గాయనిగా దామిని ప్రతిభ ప్లేబ్యాక్‌తో ముగియలేదు. ఆమె తన స్వంత పాటలను రూపొందించడానికి కూడా ప్రయత్నించింది. ఆమె మొదటి రచన, "స్వీట్ నథింగ్స్ / రానే,". ఇక ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో ఎన్నో పాటలు పాడి.. ఆయనను తన గురువుగా చెప్పుకుంటుంది దామినీ.
ఇక ఇటీవల జాతీయ అవార్డు దక్కించుకున్న కొండపొలం సినిమాలోని ధం ధం సాంగ్ ను దామిని అలపించింది. తన పాటలతో ఆలరించే దామిని బిగ్‌బాస్ మనసు దోచుకొన్నారు. దాంతో ఆమెకు బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్‌లో పాల్గొనే ఆఫర్ లభించింది. సెప్టెంబర్ 3వ తేదీన ప్రారంభమయ్యే బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గర కాబోతున్నారు. తెలుగు ఫిల్మి బీట్ నుంచి దామినికి ఆల్ ది బెస్ట్.


Click it and Unblock the Notifications











