Bigg Boss Telugu 7: బిగ్ బాస్ విన్నర్ నేమ్ లీక్... సంచలన విషయాలు బయటకు..!
బిగ్ బాస్ సీజన్ 7 రోజు రోజుకు ఆసక్తిగా కొనసాగుతోంది. అయితే ఈసారి బిగ్ బాస్ సీజన్ విన్నర్ అతనే అంటూ మాజీ కంటెస్టెంట్ సింగర్ దామిని సంచలన విషయాలు బయటపెట్టింది. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. బిగ్ బాస్ విన్నర్ అతనే అంటూ చెప్పింది. అంతే కాకుండా షో గురించి, రతిక రీ ఎంట్రీ గురించి కీలక విషయాలు వెల్లడించింది. మరీ ముఖ్యంగా శివాజీ ఆడుతున్న గేమ్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అసలు ఈ సీజన్ విన్నర్ ఎవరు.. ఆమె ఎందుకు అలా చెప్పిందనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ప్రారంభం అయి 9వారాలు కావొస్తుంది. రోజు రోజుకు ఈ షోకు ప్రేక్షకుల నుంచి ఆదరణ రెట్టింపు అవుతుంది. దానికి కారణం ఇందులో ఉండే ట్విస్టులు ఊహకు అందని షాక్ లు ఇవ్వడం. మొదటి విడుతలో 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇక అందులో ఒకరే సింగర్ దామిని. ఇక ఈమె మూడో వారంలోనే ఎలిమినేట్ అయిపోయింది. మొదటి వారంలో కిరణ్ రాథోడ్ వెళ్లిపోగా.. రెండో వారంలో షకీలా ఎలిమినేట్ అయింది. ఇక మూడో వారంలో దామిని వెళ్లింది.

అయితే దామిని తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముందుగా రతికా రోజ్ రీఎంట్రీ ఎందుకు ద్వారా బిగ్ బాస్ తీసుకోవాలి అనుకున్నారట. అందుకే ఉల్టాపుల్టా పేరుతో ఎక్కువ ఓట్లు వచ్చిన తమను పక్కన పెట్టి రతికను తీసుకున్నారని దామిని ఆ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇక ఈ విషయం తెలియకా... నయని పావని, పూజా, శోభ, ప్రియాంక, అమర్, సందీప్ ఓట్లు వేశారని తెలిపింది.
ఇక శివాజీ గురించి కూడా పలు విషయాలు తెలిపింది దామిని. ఆయనకు వయసు రిత్యా చాలా అనుభముంది. మైండ్ గేమ్ తో ఆడుతున్నాడు.. కానీ సీజన్ విన్నర్ మాత్రం ఆయన కాదు అంటూ ట్విస్టు ఇచ్చింది. ఈసారి సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కావడం గ్యారెంటీ అంటూ సంచలన విషయాన్ని బయటపెట్టింది. ఇక పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడుతూ... కామన్ మ్యాన్ గా గుర్తింపు ఉంది. ఇక అతడు నామినేషన్స్ లో రెచ్చిపోవడం ఒక్కటే తనకు నచ్చలేదంటూ చెప్పుకువచ్చింది.

ప్రశాంత్ ను ఎప్పుడూ ఎవరూ చులకనగా చూడలేదని అసలు విషయం తెలిపింది. వాడు పూర్తిగా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి మొదట్లో అడ్జెస్ట్ కావడానికి కాస్త టైం పట్టిందని తెలిపింది. అలా బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్ అంటూ దామిని చెప్పడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ వారం నామినేషన్స్ లో 8 మంది ఉన్నారు. మరి ఈ వారం డేంజర్ జోన్ లో మాత్రం శోభా శెట్టి, రతికా రోజ్, తేజ ఉన్నారు. ఈ వారం తేజ ఎలిమినేషన్ అంటున్నారు. చూడాలి మరి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











