Bigg Boss Telugu7: బిగ్‌బాస్‌హౌజ్‌లో దామిని ఆ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం..నిర్వాహకులు ఎలిమినేట్ చేస్తారా?
బిగ్ బాస్ సీజన్ 7 అట్టహాసంగా సెప్టెంబర్ 3న ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈసారి ఉల్టా పుల్టా అంటూ 14 మంది కంటెస్టెంట్స్ ఎంటర్ అయ్యారు. ఇక ఇద్దరు ఎలిమినేట్ అవ్వగా... ప్రస్తుతం 12 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అయితే బిగ్ బాస్ హౌజ్ చరిత్రలో మొట్ట మొదటి సారిగా మత కలహాలు జరిగినట్లు ఓ వీడియో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే...
బుల్లితెర రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 7 తెలుగు విజయవంతంగా కొనసాగుతోంది. మొదటి రెండు వారాలు కాస్తా అటు ఇటుగా కొనసాగినా... ఈ గేమ్ షో మూడో వారం నుంచి మాత్రం ఆసక్తిగా మారింది. హౌజ్‌మేట్స్ అందరూ చురుగ్గా టాస్కులు, గేమ్స్‌ల్లో పాల్గొంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

ఇక మూడో పవర్ అస్త్ర కంటెండర్ కోసం హౌజ్ మేట్స్ హోరాహోరీగా పోటీ పడుతున్నాడు. ఇక ఈ సీజన్‌లో మొత్తం 14 మంది కంటెస్టెంట్లు హౌజ్ లోకి అడుగుపెట్టాడు. ఇప్పటికే ఇద్దరు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. మొదటి వారంలో కిరణ్ రాథోడ్ హౌజ్ నుంచి బయటకు పోగా... రెండో వారంలో సీనియర్ నటి షకీలా ఎలిమినేట్ అయ్యారు.
ఇక మూడో వారం కూడా ఎండింగ్ వచ్చేసింది. దీంతో ఈ వారంలో ఎవరు బయటకు వెళ్లనున్నారనేది ఆసక్తిగా మారుతుండగా... బిగ్ బాస్ హౌజ్ చరిత్రలోనే మత కలహాలు జరిగినట్లు తెలుస్తోంది. అసలే ఆమె వీక్ కంటెస్టెంట్. దీనితో ఆమె మతపరంగా మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇక మూడో వారంలో ప్రియాంక జైన్, అమర్‌దీప్, శుభశ్రీ, రతిక, దామిని, గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్.. ఇలా మొత్తం ఏడుగురు కంటెస్టెంట్లు నామినేషన్స్ లో ఉన్నారు. అయితే ఓటింగులో ప్రియాంక జైన్ లీడింగ్‌లో ఉండగా.... ప్రస్తుతం హౌజ్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ప్రియాంక ఒకరు. అమర్ దీప్, రతిక, గౌతమ్ కృష్ణ, ప్రిన్స్‌లకు కూడా భారీగానే ఓట్లు వచ్చాయని తెలుస్తోంది.
ప్రస్తుతం ఓటింగ్ గమనిస్తే... సింగర్ దామిని, నటి శుభశ్రీ డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇక వినాయక చవితి రోజు సింగర్ దామిని చేసిన కొన్ని వ్యాఖ్యలు హౌజ్ లో ఆమె ప్లేస్ కు చేటు తెచ్చినట్లు సమాచారం. 'ఈ రోజు వినాయక చవితికి తను కూడా వచ్చి అక్షింతలు వేశాడు' అని దామిని సందీప్‌తో చెబుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోలో దామిని ప్రిన్స్ యావర్‌ను ఉద్దేశించే దామిని కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది.

బిగ్‌బాస్ నియమ, నిబంధనల ప్రకారం హౌజ్‌లో కుల మతాల ప్రస్థావన అసలు తీసుకురాకూడదని తెలుస్తోంది. కాబట్టి ఒకవేళ దామిని నిజంగా ఆ కామెంట్స్ చేసి ఉంటే మాత్రం ఈ వారం ఆమెనే ఎలిమినేట్ కానుందని తెలుస్తోంది. ఇక ముగ్గురు కంటెస్టెంట్స్ వెళ్లిపోవడంతో 11 మంది ఉంటారు. ఇక 11 మందితో హౌజ్ లో షో నడపడం కష్టం. సో వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయని అంటున్నారు.


Click it and Unblock the Notifications











