ప్రిన్స్.. నన్ను గట్టిగా కౌగిలించుకొంటావా? దామిని కలిసి స్నానం చేద్దామా? ప్రిన్స్ యావర్ బంపర్
బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షో రెండోవారం ముగింపు దశకు చేరుకొన్నది. షోలో కంటెస్టెంట్ల పట్టువిడుపులు, విభేదాలు, వైరుధ్యాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ల మధ్య భారీగానే వాగ్వాదాలు జరిగాయి. ముఖ్యంగా డాక్టర్ గౌతమ్, ప్రిన్స్ యావర్ మధ్య పెద్ద ఎత్తున్న గొడవ జరిగింది. ఆ గొడవల మధ్య ఓ చిలిపి సంఘటన చోటుచేసుకొని ఇంటి సభ్యులకు ఊరట లభించినట్టయింది. ఆ సంఘటన వివరాల్లోకి వెళితే..
పవర్ ఆస్త్రకు సంబంధించిన టాస్క్ సందర్భంగా డాక్టర్ గౌతమ్, ప్రిన్స్ యావర్‌కు మధ్య గొడవ భారీగానే జరిగింది. తనను కావాలనే తక్కువ చేసి చూపిస్తున్నాడనే కారణంతో గౌతమ్‌పై యావర్ మండిపడ్డాడు. దాంతో వారి మధ్య మాట మాట పెరిగింది. ఒకరిపై మరొకరు అరుచుకొన్నారు. ఆ తర్వాత ప్రిన్స్ యావర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

ఓ దశలో తాను ఇంటిలో ఉండలేనని వస్తువులను విసిరికొట్టాడు. తన మైక్ తీసేసి ఇంటి నుంచి వెళ్లిపోతానని గట్టి గట్టిగా అరిచాడు. భోజనం చేయనని మొండికేశాడు. అయితే ఇంటి సభ్యులు నచ్చ చెప్పినా వినల్లేదు. చివరకు ప్రిన్స్ యావర్‌ను బిగ్‌బాస్ కన్ఫెషన్ రూమ్‌కు పిలిచి మాట్లాడాడు. దాంతో గౌతమ్ పద్దతి, ఇతర కంటెంస్టెంట్ల తీరు బాగాలేదు అని కంప్లయింట్ చేశాడు.

అయితే ప్రిన్స్ యావర్‌కు నచ్చజెబుతూ.. ఇంటిలో ఒక్కక్కరికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. వారి వారి గేమ్‌ను అడుతూ ఉంటారు. అలాంటి సమయంలో మీకు నచ్చకపోవచ్చు. కాబట్టి నీ గేమ్, నీవు వచ్చిన లక్ష్యాన్ని గుర్తు పెట్టుకొని ఆటను కొనసాగించు అని హితబోధ చేశాడు. తనకు గౌతమ్ చేత క్షమాపణ చెప్పించాలని అడిగితే.. ఆ ప్రశ్నను దాటవేసి యావర్‌ను అక్కడి నుంచి పంపించివేశాడు. ఆ తర్వాత యావర్‌ను రిలీఫ్ చేసేందుకు దామిని చేసిన డ్రామా విశేషంగా ఆకట్టుకొన్నది.

హాయ్ యావర్, ఐ గాట్ ఫీవర్ (నాకు జ్వరం వచ్చింది) అని సింగర్ దామిని అంటే.. జ్వరమా? ఎందుకు వచ్చింది? అని యావర్ అడిగాడు. అయితే ఐ నీడ్ యువర్ కవర్ (నీవు నన్ను కప్పేసుకొంటావా) అంటూ దామిని మరో మాట చెప్పింది. దాంతో ప్రిన్స్ యావర్ నవ్వుల్లో మునిగిపోయాడు. వెంటనే నన్ను నీ లవర్‌గా చేసుకోంటావా? అని దామిని అనగానే.. ఐతే నాతో కలిసి స్నానానికి వస్తావా? అంటూ వెంటనే ప్రిన్స్ యావర్ రైమింగ్‌తో ఆమె వ్యాఖ్యలకు జత కలిశాడు. దాంతో దిండుతో ప్రేమగా కొట్టబోయింది. ఫన్నీగా సాగిన ఈ సంభాషణ అందర్నీ ఆకట్టుకొన్నది.

సింగర్ దామిని, ప్రిన్స్ యావర్ మధ్య జరిగిన సంభాషణ, సన్నివేశాన్ని బట్టి.. యావర్‌పై మనసు ఆమె మనసు పారేసుకొన్నదా? అనే అనుమానాన్ని కొందరు నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే ప్రిన్స్ యావర్ కండలు, దేహధారుఢ్యాన్ని చూసి ఇంటిలో అమ్మాయిలు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఆ జాబితాలో సింగర్ దామిని కూడా చేరిపోయిందా అనే మాట వినిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











