Bigg Boss Telugu 7: తెరపైకి రతికా, రాహుల్ డేటింగ్ వ్యవహారం.. సెన్సేషనల్ కామెంట్స్ చేసిన మాజీ కంటెస్టెంట్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా పుల్టాగా సాగుతోంది. ప్రస్తుతం 12వ వారాని చేరింది ఈ రియాలిటీ షో. ప్రస్తుతం హౌస్ లో పది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అయితే అందులో రతికా రోజ్ ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే.. ఆమె ఎలిమినేట్ అయి.. మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. అయితే రతికా రోజ్, రాహుల్ డేటింగ్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. వీరి గురించి ఓ మాజీ కంటెస్టెంట్ సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 సెప్టెంబర్ 3వ తేదీన ప్రారంభం అయింది. ఆ రోజున 14 మంది కంటెస్టెంట్స్ వచ్చారు. ఇక ఐదవ వారంలో మరో ఐదుగురు వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఇక మొత్తానికి హౌస్ లో ప్రస్తుతం పది మంది ఉన్నారు. అయితే పది మంది ఎలిమినేట్ అయిపోయారు. ఒకరు రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక హౌస్ నుంచి ఇప్పటి వరకు కిరణ్ రాథోడ్, సింగర్ దామిని, షకీలా,శుభ శ్రీ రాయగురు, రతికా రోజ్, నయని పవని, పూజా పూర్తి, ఆట సందీప్, టేస్టీ తేజ, బోలే షవాలి వెళ్లిపోయారు.

Singer Damini Sensational Comments on Rahul Sipligunj Rathika Rose Dating: Bigg Boss Telugu 7 Show Full Details Here

ఇక రతికా రోజ్ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే హౌస్ లో ఎంటర్ అయిన రతికా మొదటి మూడు వారాలు రాహుల్ తో ప్రేమాయణం గురించి చెప్పుకుని సింపతి క్రియేట్ చేసుకుంది. ఆ తర్వాత ప్రశాంత్ తో లవ్ ట్రాక్.. ఆ తర్వాత గొడవలు.. మళ్లీ యావర్ తో ప్రేమాయణం.. ఇలా చేసి నెగిటివిటీని మూటగట్టుకుంది. ఇక రతికా రాహుల్ ఫోటోలు బయటకు రావడం.. మరో సింపతీ గెయిన్ ప్లాన్ చేయడం.. జరిగింది. అయితే రాహుల్ ఇన్ డైరెక్టుగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్పందించాడు.

Singer Damini Sensational Comments on Rahul Sipligunj Rathika Rose Dating: Bigg Boss Telugu 7 Show Full Details Here

తన పర్సనల్ ఫోటోలు ఎవరో కావాలని లీక్ చేశారని.. ఇదంతా గేమ్ ప్లాన్ అంటూ రతికాకు కౌంటర్ ఇచ్చాడు. ఇక సోషల్ మీడియాలో రతికాకు ఫుల్ నెగిటివిటీ వచ్చేసింది. ఇక నాలుగోవారంలో రతికారోజ్ ఎలిమినేట్ అయిపోయింది. ఇదంతా తెలిసినవిషయమే. అయితే మూడో వారంలో ఎలిమినేట్ అయిన దామిని.. ఇటీవల మళ్లీ రాహుల్, రతికా ప్రేమయాణం గురించి మాట్లాడింది. తాను ఎలిమినేట్ కావాల్సిన అవసరం లేకున్నా... బిగ్ బాస్ ఎలిమినేట్ చేశారంటూ సంచలన కామెంట్స్ చేసింది.

బిగ్ బాస్ నుంచి ఇంటికి రాగానే రాహుల్ ఫోన్ చేశాడని.. అలా రాహుల్ ను ఇంటికి రమ్మని మేం మాట్లాడుకున్నాం అంటూ అసలు విషయం బయటపెట్టింది దామిని. రాహుల్, రతికా లవ్ మ్యాటర్ గురించి మాట్లాడుకున్నామంటూ వెల్లడించింది. రాహుల్, రతికా నిజంగానే అప్పట్లో డేట్ చేశారని... కానీ పర్సనల్ కారణాల వల్ల విడిపోయారని చెప్పుకువచ్చింది. రాహుల్ ఎప్పుడు తన పర్సనల్ విషయాలు చెప్పుకోడు.. కానీ రతికా సింపతి గెయిన్ కోసం.. అలా చేయడంతో.. అసలు విషయం చెప్పాడంటూ కుండ బద్దలు కొట్టింది.

Singer Damini Sensational Comments on Rahul Sipligunj Rathika Rose Dating: Bigg Boss Telugu 7 Show Full Details Here

ఇక రతికా ఇంట్లో ఉన్నప్పుడు... ఎప్పుడు రాహు్ల్ గురించి చెప్పేదని.. అదంతా గేమ్ స్ట్రాటజీ అని తెలుసుకోలేకపోయా అంటూ దామిని మాట్లాడింది. ఇక దామిని మూడో వారంలో ఎలిమినేట్ అయింది.. మళ్లీ రీ ఎంట్రీ కోసం.. దామిని, శుభ శ్రీ, రతికా రోజ్.. పోటీ పడ్డారు. ఇంట్లోని చాలా మంది ఓట్లు వేశారు. చాలా మంది తనకే ఓట్లు వేసినా.. బిగ్ బాస్.. ఏరి కోరి.. రతికా రోజ్ ను తెచ్చుకున్నాడు అంటూ వెల్లడించింది.

Singer Damini Sensational Comments on Rahul Sipligunj Rathika Rose Dating: Bigg Boss Telugu 7 Show Full Details Here

రతికాను లోపలికి పంపించాడానికి మమ్మల్ని బిగ్ బాస్ వాడుకున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన సింగర్స్ అందరూ విన్ అయి వచ్చారు.. తాను మాత్రం మూడో వారంలో రావడం బాధకారం అంటూ తెలిపింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారా

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X