నేను సీరియల్ కిల్లర్‌నా? శివాజీ వెరీ వెరీ కన్నింగ్.. బిగ్‌బాస్ ఎలిమినేషన్ తర్వాత దామిని సంచలన ఆరోపణలు
బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్ నుంచి మూడో వారం ఎలిమినేషన్ జరిగింది. మూడో వారంలో కూడా లేడీ కంటెస్టెంట్‌ను ఇంటి నుంచి పంపించారు. తొలివారం కిరణ్ రాథోడ్, రెండో వారం షకీలా, మూడో వారం దామిని ఇంటి నుంచి బయటకు వచ్చారు. మూడో వారం ఎలిమినేషన్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకొన్న దామిని ఇంటి నుంచి బయటకు రావడం కొందరికి దిగ్బ్రాంతి కలిగించింది. దామిని చెప్పిన సంచలన విషయాల వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ ఇంటి నుంచి మూడో కంటెస్టెంట్‌గా బయటకు వచ్చిన దామిని నేరుగా స్టార్ మా నిర్వహించే ఇంటర్వ్యూ కార్యక్రమం బిగ్‌బాస్ బజ్‌లోకి వెళ్లింది. బిగ్‌బాస్ బజ్ హోస్ట్ గీతూ రాయల్‌తో కలిసి హాట్ హాట్‌గా మాట్లాడుతూ సంచలన విషయాలను బయటపెట్టింది. ప్రస్తుతం ప్రోమోలో దామిని పలు కంటెస్టెంట్లపై విరుచుకుపడ్డారు.

బిగ్‌బాస్ తెలుగు షో నుంచి ఎలిమినేట్ అవుతానని అనుకోలేదు. కొంత షాకింగ్‌గా ఉంది అని దామిని అన్నారు. కెమెరా ముందుకు వచ్చి ప్రతీ ఒక్కరు తోపు, తురుమ్ అనుకొంటూ మాట్లాడుతారు. నేను అలా మాట్లాడాలని అనుకోలేదు. అది నాకు పాజిటివ్‌గా అనిపించలేదు అని దామిని చెప్పారు. గీతూ రాయల్ అడిగిన ప్రశ్నలకు ఏ మాత్రం తడబడకుండా జవాబు చెప్పారు.
పవర్ అస్త్ర టాస్క్ సందర్బంగా ప్రిన్స్ యావర్ ముఖానికి పేడ కొట్టడాన్ని ఆమె సమర్ధించుకొన్నారు. పేడగా కంటే.. దూద్ పేడ కంటే.. బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌గా మాత్రమే చూశాను అని అన్నారు. నేను బిగ్‌బాస్ రూల్స్‌కు లోబడి నేను టాస్క్ ఆడాను. కానీ నేను సీరియల్ కిల్లర్‌గా వ్యవహరించలేదు అని దామిని ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు.

ఇంటిలో ఫక్ లాంటి బూతులు మాట్లాడితే తప్పు కాదా? ఇంగ్లీష్‌లో మాట్లాడితే నీతులు? తెలుగులో మాట్లాడితే బూతులా? అని గీతూ అడిగిన ప్రశ్నకు గట్టిగానే సమాధానం ఇచ్చినట్టు చెప్పింది. ఇక ఇంటి సభ్యుల గురించి మాట్లాడుతూ.. రతిక ఎవరైనా చెబితే సరిగా వినదు.. సగమే వింటుంది అని చెప్పింది. శుభశ్రీ బార్బీ డాల్‌గా తయారై.. గేమ్ ఆడటం లేదు అని చెప్పింది. తేజ వెటకారం తగ్గించుకోవాలి.. శోభకు చెంచాగా ఉండటం మానేయాలి అని అన్నారు.
పల్లవి ప్రశాంత్ గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అని దామిని చెప్పింది. శివాజీ చాలా కన్నింగ్ గేమ్ ఆడుతున్నాడు అని చెప్పింది. ఇక గౌతమ్ తనకే అన్నీ తెలుసు అనే విషయాన్ని తగ్గించుకోవాలి అంటూ ఇంటి సభ్యులపై విరుచుకుపడింది. ఇంకా దామిని ఫుల్ వీడియో చూస్తే చాలా విషయాలు వెల్లడి అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











