twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలా ఎందుకు చేస్తుందో అర్థం కావడం లేదు.. యాంకర్ లాస్యపై గీతా మాధురి కామెంట్

    |

    బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 2లో టాప్ 5 కంటెస్టెంట్‌ జాబితాలో స్థానం సంపాదించుకొన్న సింగర్ గీతా మాధురీ ప్రస్తుతం జరుగుతున్న సీజన్ 4 గురించి తన అభిప్రాయాలను వెల్లడించింది. కొద్దికాలంగా షోను ఫాలో అవుతున్న గాయని ఇంటి సభ్యుల గురించి తన అభిప్రాయాలను వెల్లడించింది. ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ ఏం చెప్పారంటే..

    మెహబూబ్ దిల్ గురించి

    మెహబూబ్ దిల్ గురించి

    మెహబూబ్ దిల్ సే గురించి ముందు ఎలాంటి అభిప్రాయం లేదు. కానీ గేమ్ చూస్తుంటే అతడు ఆడే తీరు నచ్చింది. చిన్న పిల్లవాడు. మంచి వాడు. టాస్క్‌లు ఇస్తే... విజృంభించి ఆడుతాడు. ఇంటిలో గేమ్ ఒక్కటే కాదు... మిగితా విషయాల మీద కూడా ఫోకస్ పెట్టాలి అనేది నా అభిప్రాయం అంటూ గీతా మాధురి అన్నారు.

     సయ్యద్ సోహైల్ ర్యాన్

    సయ్యద్ సోహైల్ ర్యాన్

    ఇక సయ్యద్ సోహైల్ ర్యాన్ గురించి ఆలోచిస్తే.. ఇంటిలో జెన్యూన్ పర్సన్. తనకు నచ్చినట్టు ఉంటాడు. నిజాయితీగా వ్యవహరిస్తాడు. కాకపోతే ఒకరి వల్ల ప్రభావితం చెందుతాడు అనేది నా కంప్లయింట్. ఎవరు ఏదైనా చెబితే నమ్మి వారి సూచనల ప్రకారం వెళ్తుంటాడు. గేమ్‌ను కొనసాగిస్తాడు అంటూ గీతా మాధురి తెలిపారు.

    హారిక, యాంకర్ లాస్య గురించి

    హారిక, యాంకర్ లాస్య గురించి

    హారిక, యాంకర్ లాస్య విషయానికి వస్తే.. వాళ్లిద్దరూ హ్యాపీగా ఉంటూ ముందుకెళ్లే మనస్తత్వం. వాళ్లు తొటి కంటెస్టెంట్లతో పోటీ పెట్టుకొని ఆడితే మరో రేంజ్‌కు వెళ్తారు. ఇక హారికకు ఒకసారి కెప్టెన్ అయ్యే అవకాశం దక్కాలని కోరుకొంటాను. ఎందుకంటే మొదటి వారం నుంచి ఇప్పటి వరకు పోటీ పడుతూనే ఉంది అంటూ గీతా మాధురి చెప్పారు.

    లాస్య అలా మాట్లాడకుండా ఉండాల్సింది

    లాస్య అలా మాట్లాడకుండా ఉండాల్సింది

    లాస్య చాలా బ్యాలెన్స్‌గా ఆడుతున్నది. ఇంకా ఆమె పూర్తిస్థాయిలో ఓపెన్ కాలేదు. ఇంకా ఆమె గేమ్ పరంగా, టాస్కుల పరంగా ఓపెన్ అయితే లాస్యకు మరింత మైలేజ్ లభిస్తుంది. కొన్నిసార్లు ఆమె మాట్లాడితే ఇబ్బంది పడ్డాను. ఆమె అలా మాట్లాడకుండా ఉండాల్సిందనే ఫీలింగ్ నాకు కలిగింది అంటూ గీతా మాధూరి పేర్కొన్నారు.

    అవినాష్ ఇమేజ్ గురించి ఆందోళన

    అవినాష్ ఇమేజ్ గురించి ఆందోళన

    ఇంటి సభ్యుల్లో నాకు బాగా నచ్చిన కంటెస్టెంట్లలో అవినాష్ ఒకరు. అతడి కామెడీ బాగా నచ్చుతున్నది. కానీ బయట ప్రపంచం గురించి ఆలోచించడం, అలాగే ఇమేజ్ గురించి అనవసరంగా ఆందోళన చెందుతున్నాడు. లేని పోని విషయాలకు ఎక్కువగా టెన్షన్ పడుతున్నాడేమో అనే ఫీలింగ్ కలుగుతున్నది అని గీతా మాధురి చెప్పారు.

    Recommended Video

    Geetha Madhuri With Her New Born Baby || బ్లాక్ బస్టర్ బేబీ పేరు ఏంటొ తెలుసా?
    అరియానా క్యూట్ గర్ల్

    అరియానా క్యూట్ గర్ల్

    ఇక అరియానా క్యూట్ గర్ల్. స్వచ్ఛమైన మనసు ఆమెది. ఎదుటి వాళ్లకు ఏం చెప్పాలనే విషయం నాకు నచ్చింది. ఆమెను చూస్తే నిజాయితీ స్పష్టంగా కనిపిస్తుంది. గేమ్, టాస్క్‌లలో 100 శాతం ఇస్తుంది. ఆమె ప్యూర్ హార్ట్ అంటూ గీతా మాధురి పేర్కొన్నారు.

    English summary
    Bigg Boss Telugu 4 show is going to enter into 11th week. As part for show, Singer Geeta Madhuri comments on Anchor Lasya about Bigg Boss Telugu 4. Earier Geeta Madhuri was contestant in Bigg Boss Telugu 2.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X