గొడవలు జరిగింది నిజమే, కానీ బయట పరిస్థితి వేరు: సింగర్ గీతా మాధురి

Recommended Video

Bigg Boss Telugu 3 : Singer Geetha Madhuri About Bigg Boss Show || Filmibeat Telugu

బిగ్‍బాస్ సీజన్ 1తో పోలిస్తే... గతేడాది ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 2లో చాలా వివాదాలు, గొడవలు చోటు చేసుకున్నాయి. కొందరు కంటెస్టెంట్ల మధ్య విద్వేషాలు సైతం చోటు చేసుకున్నాయి. దీనికి తోడు బిగ్ బాస్ షో బయట నుంచి కౌశల్ ఆర్మీతో పాటు ఇతర కంటెస్టెంట్ల ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేసిన రచ్చ కూడా అప్పట్లో ఈ షోను మరింత హైలెట్ చేశాయి.

త్వరలో బిగ్ బాస్ సీజన్ 3 మొదలు కాబోతున్న నేపథ్యంలో సింగర్ గీతా మాధురి సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ షేర్ చేశారు. చాలా మంది నన్ను 'బిగ్ బాస్' షోకు సంబంధించిన విషయాలు అడుగుతున్నారు. వారికి చెప్పేది ఒకటే... బిగ్ బాస్ షో చూసి, అందులో వారి బిహేవియర్ చూసి వారిని జడ్జ్ చేయూకడదు.' అని గీతా మాధురి తెలిపారు.

గేమ్ స్ట్రాటజీస్ ఉంటాయి కాబట్టే అలా ప్రవర్తించారు, బయట వేరు

గేమ్ స్ట్రాటజీస్ ఉంటాయి కాబట్టే అలా ప్రవర్తించారు, బయట వేరు

బిగ్ బాస్ షోలో ఒకరి బిహేవియర్ బట్టి అది వాళ్ల నిజమైన ప్రవర్తన అని నేను జడ్జ్ చేయను. అక్కడ గేమ్ స్ట్రాటజీస్ ఉంటాయి. షోలో వారు ఎదుర్కొనే పరిస్థితులను బట్టి బిహేవియర్ ఉంటుంది. మేము చేసిన బిగ్ బాస్ సీజన్ 2 ముగిసి సంవత్సరం గడిచిపోయింది. ఆ షోలో ఉన్నట్లుగా రియల్ లైఫ్‌లో ఎవరూ కఠినంగా లేరు. బయటకు వచ్చిన తర్వాత అందరూ చాలా నైస్ పర్సన్స్ అనిపించారు. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు... అని గీతా మాధురి తెలిపారు.

గొడవలు జరిగింది నిజమే

గొడవలు జరిగింది నిజమే

బిగ్ బాస్ షోలో జరిగిన కొన్ని వివాదాస్పద విషయాలను పట్టుకుని ఇంకా లాగడం సరైంది కాదు. అది గేమ్ మాత్రమే. మేము షోలో కొన్ని సందర్భాల్లో కొట్టుకున్నప్పటికీ అదంతా షో కోసం మాత్రమే. షో నుంచి బయటకు వచ్చిన తర్వాత మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. అక్కడ జరిగిన కొన్ని స్వీట్ మెమొరీస్ మాత్రమే గుర్తు పెట్టుకున్నాం. త్వరలో బిగ్ బాస్ 3 షో కూడా ప్రారంభం కాబోతోంది. ఆ గొడవల గురించి ఇంకా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు... అని గీతా మాధురి స్పష్టం చేశారు.

నాగార్జున హోస్ట్‌గా

నాగార్జున హోస్ట్‌గా

ఈ సారి బిగ్ బాస్ షో టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున హోస్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే నాగార్జునకు సంబంధించిన అఫీషియల్ ప్రోమో కూడా షో నిర్వాహకులు విడుదల చేశారు. ఫ్యామిలీ ప్రేక్షకులను ఈ షో వైపు ఆకర్షించడం కోసమే నిర్వాహకులు ఈసారి నాగార్జునను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

14 మంది, 100 రోజులు

14 మంది, 100 రోజులు

మొత్తం 14 మంది కంటెస్టెంట్లతో 100 రోజుల పాటు ‘బిగ్ బాస్ సీజన్ 3' సాగబోతోంది. అయితే ఈ సారి షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్లు ఎవరనే విషయాలు ఇంకా బయటకు రాలేదు. యాంకర్ శ్రీముఖి, వరుణ్ సందేశ్, వితిక దంపతులతో పాటు మరికొందరి పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఇంకా అఫీషియల్‌గా ఖరారు కాలేదు. జూలై 21న ఈ షో ప్రారంభం అవుతుందని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X