Bigg Boss 6: బిగ్ బాస్‌లోకి ఫేమస్ సింగర్.. హయ్యెస్ట్ రెమ్యూనరేషన్.. టైటిల్ ఫేవరెట్‌గా ఎంట్రీ
కొంత మంది సెలెబ్రిటీలను ఓ ఇంట్లో ఉంచడం.. వాళ్లకు రకరకాల టాస్కులు ఇవ్వడం.. అన్ని రకాల పనులు చేయించడం.. తద్వారా వాళ్ల ఒరిజినల్ క్యారెక్టర్లను బయటకు తీయడం.. మొత్తంగా ఇలా సాగే ఏకైక షోనే బిగ్ బాస్. చాలా భాషల్లో ఎప్పుడో పరిచయం అయినా.. తెలుగులోకి మాత్రం కొంత ఆలస్యంగా వచ్చింది. అయినప్పటికీ తక్కువ సమయంలోనే విశేషమైన ఆదరణను సొంతం చేసుకుంది. ఫలితంగా అత్యధిక రేటింగ్‌ను దక్కించుకుని టాప్ షోగా ఎదిగిపోయింది. ఇలా ఇప్పటికే కొన్ని సీజన్లను కూడా పూర్తి చేసుకుంది. ఇక, త్వరలోనే నిర్వహకులు ఆరో దానిని మొదలు పెట్టబోతున్నారు. తాజాగా ఇందులో పాల్గొనే ఓ కంటెస్టెంట్ వివరాలు బయటకు వచ్చాయి. ఆ సంగతులేంటో మీరే చూడండి!

ఆరో సీజన్‌కు ముహూర్తం ఫిక్స్
ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చి.. బిగ్ బాస్ తెలుగులో టాప్ షోగా ఎదిగిపోయింది. ఈ క్రమంలోనే ఏకంగా ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్‌ను పూర్తి చేసుకుని రికార్డుల మీద రికార్డులను క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో దాన్ని కూడా మొదలు పెట్టేందుకు నిర్వహకులు సన్నాహాలు చేస్తున్నారు. నాగార్జున హోస్ట్ చేసే ఈ సీజన్ సెప్టెంబర్ 4 నుంచి స్టార్ట్ అవుతుంది.

వాటితో అంచనాలు రెట్టింపుగా
తెలుగులో ప్రసారం అయిన బిగ్ బాస్ సీజన్లు అన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దీంతో త్వరలోనే ప్రారంభం కాబోతున్న ఆరో సీజన్‌పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే దీని నుంచి లోగో, సీజన్ ప్రోమోలు విడుదల అయ్యాయి. వీటికి అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ స్పందన దక్కింది. ఫలితంగా ఈ సీజన్‌పై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి.

పనులన్నీ పూర్తి.. ప్రీమియర్‌పై
సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఆరో సీజన్ పనులు మొత్తం పూర్తైనట్లు బుల్లితెర వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే షోను నడిపించే హౌస్ సెట్ వర్కును నిర్వహకులు పూర్తి చేసేశారట. అలాగే, స్టేజ్‌ను కూడా సుందరంగా తీర్చిదిద్దారని అంటున్నారు. దీంతో ఇప్పుడు నిర్వహకులు ప్రీమియర్ ఎపిసోడ్‌ను సక్సెస్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని టాక్.

15 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ
అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఆరో సీజన్‌కు సంబంధించిన కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియను నిర్వహకులు ఎప్పుడో మొదలు పెట్టారు. ప్రారంభంలో ఆన్‌లైన్ ద్వారా ఇంటర్వ్యూలు చేశారు. తర్వాత నేరుగా మాట్లాడి డీల్స్ చేసుకున్నారు. ఇలా ఈ సీజన్ కోసం 15 మంది కంటెస్టెంట్లను ఎంపిక చేసుకున్నారు. ఇందులో ఇద్దరు కామనర్స్ కూడా ఉన్నారట.

ఒక్కొక్కటిగా లీక్.. ఫుల్ లిస్ట్‌నే
బిగ్ బాస్ షో జరిగే ప్రాసెస్ మొత్తం ఎంతో రహస్యంగా సాగుతూ ఉంటుంది. కానీ, నిర్వహకుల దురదృష్టం వల్ల ఇందులో అన్నీ ముందే లీక్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా త్వరలో మొదలయ్యే ఆరో సీజన్ గురించి కూడా చాలా వార్తలు బయటకు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్ల వివరాలతో పాటు ఫుల్ లిస్ట్ కూడా లీక్ అయిపోయింది.

బిగ్ బాస్‌లోకి ఫేమస్ సింగర్
భారీ అంచనాల నడుమ ప్రారంభం కాబోతున్న ఆరో సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్ల విషయంలో నిర్వహకులు ఎన్నో వ్యూహాలను అమలు చేస్తున్నారట. ముఖ్యంగా ప్రజాదరణ ఉన్న వాళ్లను ఎక్కువగా తీసుకుంటున్నారని తెలిసింది. ఇందులో భాగంగానే ఈ సీజన్ కోసం ప్రముఖ సింగర్, ఇండియన్ ఐడల్ విన్నర్ రేవంత్‌ను కంటెస్టెంట్‌గా తీసుకు వస్తున్నారని సమాచారం.

ఎక్కువ రెమ్యూనరేషన్‌తో రాక
ఫేమస్ సింగర్ రేవంత్ తెలుగులో వరుసగా ఆఫర్లను అందుకుంటూ కెరీర్ పరంగా దూసుకెళ్తోన్నాడు. అదే సమయంలో ఇండియన్ ఐడల్ ద్వారా ఉత్తరాది వాళ్లకూ చేరువ అయ్యాడు. దీంతో అతడు ఈ సీజన్‌లో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడని అంటున్నారు. ఇక, ఈ సీజన్‌లో అత్యధిక రెమ్యూనరేషన్ కూడా రేవంత్‌కే ఇస్తున్నారని ఓ న్యూస్ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











