twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్ బాస్ జాబితా నుంచి మరో పేరు లీక్.. సీజన్-4 కంటెస్టెంట్‌గా తెలంగాణ పాపులర్ సింగర్.!

    By Manoj Kumar P
    |

    తొలిసారి ఆ తరహా ప్రయోగం.. ఏమాత్రం అంచనాలు లేవు.. పైగా ఎన్నో అనుమానాలు.. వీటన్నీంటి నడుమ తెలుగులో ప్రారంభం అయింది బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. ఉత్తరాదిలో ఎప్పటి నుంచో పరిచయం ఉన్న ఈ షో.. అక్కడ భారీ స్థాయిలో స్పందనను దక్కించుకుంది. మన బుల్లితెరపై ఏకంగా మూడు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో... నాలుగో దానిని కూడా లైన్‌లో పెట్టేసింది. త్వరలోనే ఆ సీజన్‌ను మొదలెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో హౌస్‌లోకి ఎంటర్ అయ్యే కంటెస్టెంట్ల జాబితా నుంచి ఓ పేరు లీక్ అయింది. ఇంతకీ ఎవరా సెలెబ్రిటీ.? వివరాల్లోకి వెళితే...

    విశేషాల కంటే.. షో వల్ల వివాదాలే ఎక్కువ

    విశేషాల కంటే.. షో వల్ల వివాదాలే ఎక్కువ

    బిగ్ బాస్ షో తెలుగులో భారీ స్థాయిలో స్పందనను దక్కించుకున్న సంగతి విధితమే. ఈ షోకు అంత హైప్ రావడానికి.. దాని చుట్టూ అల్లుకున్న వివాదాలూ కారణమే. బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య జరిగే గొడవలతో ఎన్నో వివాదాలు చెలరేగాయి. అలాగే, కాస్టింగ్ కౌచ్ గురించి ఆరోపిస్తూ బయట కూడా చాలా మంది ఈ షోను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు.

    మూడు సీజన్లు.. గెలిచిన ముగ్గురూ వాళ్లే

    మూడు సీజన్లు.. గెలిచిన ముగ్గురూ వాళ్లే

    తెలుగులో బిగ్ బాస్‌ సూపర్ సక్సెస్ అయింది. కొత్త తరహా కార్యక్రమం అయినా ఇక్కడి ప్రేక్షకులు షోను బాగా ఆదరించడంతో అది సాధ్యమైంది. షోను కంటిన్యూగా ఫాలో అవడం.. తమకు నచ్చిన కంటెస్టెంట్లకు ఓట్లు వేయడం వంటివి చేస్తున్నారు ప్రేక్షకులు. ఇప్పటి వరకు జరిగిన మూడు సీజన్లలో శివ బాలాజీ, కౌశల్ మండా, రాహుల్ సిప్లీగంజ్ విజయం సాధించిన విషయం తెలిసిందే.

    బిగ్ బాస్ విజయం వెనుక ఆ ముగ్గురి పాత్ర

    బిగ్ బాస్ విజయం వెనుక ఆ ముగ్గురి పాత్ర

    బిగ్ బాస్‌ షోకు తెలుగులో ఇంత పాపులారిటీ రావడానికి దీనిని హోస్ట్ చేసిన స్టార్ హీరోలు ప్రధాన కారణం. ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రారంభం అయిన మొదటి సీజన్‌కు జూనియర్ ఎన్టీఆర్.. అద్భుతమైన హోస్టింగ్‌తో పైకి లేపాడు. ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని, అక్కినేని నాగార్జున కూడా తమ వంతు కృషి చేసి ఈ రియాలిటీ షోను సక్సెస్‌ఫుల్‌గా నడిపించారు.

    నాలుగో సీజన్ హోస్ట్ ఈ స్టార్ హీరోనేనట

    నాలుగో సీజన్ హోస్ట్ ఈ స్టార్ హీరోనేనట

    ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుంది బిగ్ బాస్ షో. గత సీజన్ ముగిసి ఎన్నో రోజులు కాకముందే నాలుగో సీజన్ గురించి చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తదుపరి సీజన్‌ను హోస్ట్ చేసేది ఎవరన్న దానిపై ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది హీరోల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, దీన్ని కూడా ఎన్టీఆర్ హోస్ట్ చేస్తాడనే టాక్ వినిపిస్తోంది.

    బిగ్ బాస్ - 4 జాబితా నుంచి మరో పేరు లీక్

    బిగ్ బాస్ - 4 జాబితా నుంచి మరో పేరు లీక్

    ఇంకా నాలుగో సీజన్‌కు సంబంధించిన ఎటువంటి అధికారిక ప్రకటన రాకముందే.. అందులో పాల్గొనబోయే కంటెస్టెంట్ల గురించి ఎన్నో వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగానే కొందరు సెలెబ్రిటీల పేర్లు కూడా బయటకు వచ్చాయి. వారిలో అల్లరి నరేష్, హేమచంద్ర, తాగుబోతు రమేష్, యాంకర్ వర్షిణి సహా మరికొన్ని పేర్లు ఉన్నాయి. తాజాగా మరో పేరు లీక్ అయింది.

    ఎంట్రీ ఇవ్వనున్న తెలంగాణ పాపులర్ సింగర్.!

    ఎంట్రీ ఇవ్వనున్న తెలంగాణ పాపులర్ సింగర్.!

    తాజా సమాచారం ప్రకారం... వచ్చే సీజన్‌లో తెలంగాణకు చెందిన పాపులర్ సింగర్ మంగ్లీ అలియాస్ సత్యవతీ రాథోడ్ పాల్గొనబోతుందట. ఇటీవలే దీనికి సంబంధించిన అగ్రిమెంట్‌పై ఆమె సంతకం చేసిందని సమాచారం. ఈ వార్త గతంలో వచ్చిన వాటి మాదిరిగా గాసిప్ కాదని, నాలుగో సీజన్‌లో మంగ్లీ కంటెస్టెంట్‌గా వెళ్లబోతుందని ఆమె సన్నిహిత వర్గాలు కూడా చెబుతున్నాయి.

    Recommended Video

    Miheeka Bajaj Revealed The Actual Meaning Behind The Special Tattoo
    రికార్డు సృష్టించిన పాట కోసం గొంతు కలిపింది

    రికార్డు సృష్టించిన పాట కోసం గొంతు కలిపింది

    మంగ్లీ... కొన్ని న్యూస్ ఛానెళ్లలో తెలంగాణ యాసతో వార్తలు చెబుతూ కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత ప్రైవేట్ సాంగ్స్ పాడుతూ ఎంతగానో పాపులర్ అయింది. ఈ క్రమంలోనే సినిమాల్లో అవకాశాలు సైతం దక్కించుకుంది. ఆమె రీసెంట్‌గా ‘జార్జ్‌రెడ్డి' సినిమాలోని ‘బుల్లెట్టు బండి', ‘అల.. వైకుంఠపురములో'లోని ‘రాములో రాములా' వంటి హిట్ సాంగ్స్ ఆలపించింది.

    English summary
    Satyavathi Rathod popularly known by her TV screen name as Mangli chinmai is an Indian singer, television anchor and actress. She is popular for her traditional banjara attire. Her popularity on YouTube for her Telangana songs and performs at festival events in India and abroad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X