బిగ్ బాస్‌లోకి తెలంగాణ పిల్ల: ఎంట్రీ లేట్ అవొచ్చేమో.. మరో యాంకర్‌పై కన్నేసిన..

By Manoj

తెలుగులో అత్యంత భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను పొందిన షోలలో బిగ్ బాస్ ఒకటి. గతంలో ఎన్నడూ చూడని సరికొత్త ప్రయోగాలతో ప్రసారమయ్యే ఈ షోకు.. చాలా తక్కువ సమయంలోనే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలా ఏకంగా మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని, నాలుగో దానిని సైతం మొదలెట్టింది యూనిట్. ఈ మధ్యనే ప్రారంభమైన ఫోర్త్ సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పుడిప్పుడే మరింత రెస్పాన్స్ అందుకుంటూ ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్‌లోకి మరో అమ్మాయిని పంపించబోతున్నారట షో నిర్వహకులు. పూర్తి వివరాలు మీకోసం.!

 రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్‌తో దూకుడు

రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్‌తో దూకుడు

బిగ్ బాస్ షో తెలుగులో ఎంతో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దిగ్విజయంగా మూడు సీజన్లను పూర్తి చేసుకుని, నాలుగో దానిని సైతం మొదలెట్టారు షో నిర్వహకులు. సెప్టెంబర్ 6న అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఈ సీజన్‌ను కూడా నాగార్జున హోస్ట్ చేశారు. ఈ ప్రీమియర్ ఎపిసోడ్‌కు రికార్డు స్టాయిలో రేటింగ్ వచ్చింది. ఫలితంగా ఇండియాలోనే టాప్‌ ప్లేస్‌లో నిలిచిందీ షో.

షో మాత్రం సోసోగా.. యూనిట్ షాక్

షో మాత్రం సోసోగా.. యూనిట్ షాక్

ప్రీమియర్ ఎపిసోడ్‌కు ఊహించని స్థాయిలో స్పందన వచ్చినప్పటికీ... మొదటి రెండు మూడు వారాలు షోకు మాత్రం అంతగా రెస్పాన్స్ రాలేదు. పెద్దగా పేరున్న కంటెస్టెంట్లు లేకపోవడమో.. టాస్కుల్లో కొత్తదనం కనిపించకపోవడమో తెలియదు కానీ.. ఆ సమయంలో సీజన్ -4 చప్పగా సాగింది. ఇలాంటి పరిస్థితుల్లో షో నిర్వహకులు తలలు పట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి.

 ఫంథాను మార్చి సక్సెస్ అయ్యారు

ఫంథాను మార్చి సక్సెస్ అయ్యారు

షో ప్రారంభంలో అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రాబట్టుకోలేకపోవడంతో బిగ్ బాస్ నిర్వహకులు పంథాను మార్చుకున్నారు. ఇందులో భాగంగానే మొదటి మూడు వారాలకే ముగ్గురు సెలెబ్రిటీ (కుమార్ సాయి, ముక్కు అవినాష్, స్వాతీ దీక్షిత్)లను వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించారు. ఇక, అప్పటి నుంచి నాలుగో సీజన్ కొంత ఆసక్తికరంగా సాగుతూ వచ్చింది.

అనుకున్నదొకటి అయింది మరొకటి

అనుకున్నదొకటి అయింది మరొకటి

వైల్డ్ కార్డ్ విషయంలో బిగ్ బాస్ యూనిట్ అనుకున్న దానికి భిన్నంగా జరిగింది. ముగ్గురు హౌస్‌లోకి ఎంటర్ అయిన తర్వాత... షో ఆరంభంలో ఇంట్లోకి వెళ్లిన కంటెస్టెంట్లు అందరూ ఒకటి.. వీళ్లు ఒకటిలా కనిపించింది పరిస్థితి. దీంతో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లనే హౌస్‌మేట్స్ టార్గెట్ చేస్తుండేవారు. ఫలితంగా కుమార్ సాయి, స్వాతీ దీక్షిత్ షో నుంచి ఎలిమినేట్ అయిపోయారు.

 మరో వైల్డ్ కార్డ్.. ఆమె స్థానంలోనేనా

మరో వైల్డ్ కార్డ్.. ఆమె స్థానంలోనేనా

బిగ్ బాస్ సీజన్ 4 ఈ మధ్య కాలంలో ఆసక్తికరంగా సాగుతోంది. దీనికి ఇప్పుడిప్పుడే అనుకున్నదాని కంటే ఎక్కువ రేటింగ్ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో షో నిర్వహకులు హౌస్‌లోకి మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీని ప్రవేశ పెట్టబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అనారోగ్యం కారణంగా హౌస్‌ నుంచి వెళ్లిపోయిన గంగవ్వ స్థానంలోనే మరొకరిని పంపుతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.

బిగ్ బాస్‌ హౌస్‌లోకి తెలంగాణ పిల్ల

బిగ్ బాస్‌ హౌస్‌లోకి తెలంగాణ పిల్ల

తాజా సమాచారం ప్రకారం.. తెలంగాణ అమ్మాయి, ప్రముఖ సింగర్ మంగ్లీ త్వరలోనే వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్‌ హౌస్‌లోకి అడుగు పెట్టబోతుందట. ఇప్పటికే దానికి సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయని వినికిడి. వాస్తవానికి ఆమె ఈ సీజన్‌లో కంటెస్టెంట్‌గా వస్తుందని ప్రచారం జరిగింది. కానీ, మంగ్లీ ఎంటర్ అవలేదు. అయితే, కొద్ది రోజుల్లో మాత్రం ఆమె రావడం పక్కా అని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X