బిగ్ బాస్‌లోకి మరో కొత్త కంటెస్టెంట్: వాళ్ల ఆట కట్టించేందుకు అక్కడి నుంచే ప్లాన్.!
గత సీజన్లతో పోలిస్తే ఈ సారి బిగ్ బాస్ షో కొంత మేర ఆసక్తికరంగానే సాగుతోంది. మునుపు సీజన్లలో కనిపించని టాస్కులు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, మసాలా సన్నివేశాలు, గొడవలు అన్నింటికీ మించి స్పెషల్ సర్‌ప్రైజ్‌ల వల్ల ఈ సీజన్ విజయవంతంగా ప్రసారం అవుతోంది. ఈ క్రమంలోనే దిగ్విజయంగా సగం రోజులు కూడా పూర్తి చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రియాలిటీ షోను మరింత రక్తి కట్టించేందుకు బిగ్ బాస్ యూనిట్ ఓ కొత్త కంటెస్టెంట్‌ను హౌస్‌లోకి పంపించబోతున్నట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది. అంతేకాదు, స్పెషల్ ప్లాన్ కూడా రెడీ చేసినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే...

షో మాత్రం సక్సెస్.. ప్రయోగాలు విఫలం
మొదటి మూడు సీజన్లు ఎంతటి విజయాన్ని అందుకున్నాయో.. గత నెలలో ప్రారంభమైన నాలుగో సీజన్ వాటికి మించిన ఫలితాన్ని రాబడుతోంది. అత్యధికంగా టీఆర్పీ రేటింగ్ సాధిస్తూ దూసుకుపోతోంది. దీంతో షోపై అంచనాలు క్రమంగా పెరిగిపోతున్నాయి. మరోవైపు, నిర్వహకులు చేస్తున్న కొన్ని ప్రయోగాలు మాత్రం విఫలం అవుతుండడంతో కొత్త ప్లాన్లు రెడీ చేస్తున్నారు.

ఫ్యాన్స్‌ను నిరాశ పరిచిన అంశం అదే.!
తెలుగులో ఇప్పటి వరకు మూడు సీజన్లు పూర్తయ్యాయి. వాటన్నింటిలోనూ ప్రేక్షకులు అంచనా వేసుకున్న వాళ్లే ఎలిమినేట్ అవుతూ వచ్చారు. అయితే, ఈ సీజన్‌లో మాత్రం దానికి భిన్నంగా జరుగుతోంది. టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగిన కొందరు ముందే బయటకు వెళ్లిపోయారు. ఇద్దరు మాత్రం అనారోగ్యంతో హౌస్‌ను విడిచారు. ఈ అంశం ఫ్యాన్స్‌ను బాగా నిరాశ పరిచింది.

వైల్డ్ కార్డ్ ఉందా.? రీఎంట్రీ ఇస్తున్నారా
షో సగం అయిపోయిన తర్వాత మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఎలిమినేట్ అయిన ఒకరిద్దరు కంటెస్టెంట్లు హౌస్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారన్న టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. దీంతో అసలేం జరగబోతుందన్న అయోమయం ప్రేక్షకుల్లో కనిపిస్తోంది. దీంతో షోపై ఆసక్తి రోజురోజుకూ పెరిగిపోతోంది.

బిగ్ బాస్ షోలోకి మరో కొత్త కంటెస్టెంట్
బిగ్ బాస్ షో మొదలై సగం రోజులు పూర్తయిపోయాయి. ఇప్పటికే దాదాపు పది మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయిపోయారు. ఈ నేపథ్యంలో షోను మరింత రక్తి కంట్టించేందుకు నిర్వహకులు మరో ప్రయోగం చేయబోతున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. వచ్చే వారమే ఓ కొత్త కంటెస్టెంట్ వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారట.

వాళ్ల ఆట కట్టించేందుకు స్పెషల్ ప్లాన్
ఆదివారం ఎపిసోడ్ పూర్తయ్యే సమయంలో కానీ, సోమవారం కానీ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. అంతేకాదు, ఈ కంటెస్టెంట్‌ను నేరుగా హౌస్‌లోకి పంపించకుండా.. సీక్రెట్ రూమ్‌లో కొద్ది రోజుల పాటు ఉంచనున్నారని తెలిసింది. అక్కడి నుంచే హౌస్‌మేట్ల ఆట కట్టించేందుకు సదరు కంటెస్టెంట్‌తో ప్లాన్లు అమలు చేయబోతున్నారట బిగ్ బాస్ నిర్వహకులు.

కొత్త కంటెస్టెంట్ ఎవరన్న దానిపై క్లారిటీ
బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్ విషయంలో ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. చాలా రోజుల నుంచి అనుకుంటున్న మంగ్లీనే హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుందట. తెలంగాణ పాటలతో పాటు ఎన్నో సినిమా సాంగ్స్‌తో ఆకట్టుకున్న ఈమె.. ఈ షోలో ఎలా ఆడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











