యాంకర్ ప్రదీప్‌కు పవన్ కల్యాణ్ సర్‌ప్రైజ్: ఒకేసారి నాలుగు ఆఫర్లు.. ఆ సాయం గుర్తుంచుకుని మరీ!
అదిరిపోయే టైమింగ్.. ఆకట్టుకునే శైలి.. స్పాంటీనియస్‌గా పంచులు వేస్తూ టాప్ యాంకర్‌గా బుల్లితెరపై తన హవాను చూపిస్తున్నాడు ప్రదీప్ మాచిరాజు. అందుకే ఒకవైపు లేడీ హోస్టుల నుంచి పోటీ నెలకొని ఉన్న పరిస్థితుల్లోనూ అదరగొడుతూ నెంబర్ వన్ యాంకర్‌గా వెలుగొందుతున్నాడు.
ఈ క్రమంలోనే భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుని సత్తా చాటుతున్నాడు. టెలివిజన్ రంగంలో సత్తా చాటిన అతడు.. వరుస ఆఫర్లతో సందడి చేస్తోన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా యాంకర్ ప్రదీప్ మాచిరాజును పవన్ కల్యాణ్ సర్‌ప్రైజ్ చేశాడు. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

నంది అవార్డుతో యమ హైలైట్‌గా
రేడీయో జాకీగా పని చేస్తున్న సమయంలో ప్రదీప్ మాచిరాజు జీ తెలుగు ఛానెల్‌లో యాంకర్‌గా అవకాశాన్ని అందుకున్నాడు. ఆరంభంలో పలు షోలు చేసిన అతడు.. 'గడసరి అత్త సొగసరి కోడలు' అనే గేమ్ షోతో మంచి గుర్తింపుతో పాటు భారీ స్థాయిలో క్రేజ్ కూడా సంపాదించుకున్నాడు. అదే సమయంలో బెస్ట్ యాంకర్‌గా పలుమార్లు నంది అవార్డును కూడా దక్కించుకున్నాడు.

ఎక్కడ చూసినా ప్రదీప్ సందడే
జీ తెలుగు ద్వారా ఎంటరైన ప్రదీప్ మాచిరాజు.. ఆ తర్వాత చాలా ఛానెళ్లలో వర్క్ చేశాడు. ఇందులో భాగంగానే ఎన్నో షోలను హోస్ట్ చేశాడు. వరుసగా ఆఫర్లు అందుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఇప్పుడతను ఒకే సమయంలో 'ఢీ 15', 'జీ సూపర్ ఫ్యామిలీ', 'లేడీస్ అండ్ జెంటిల్‌మన్' సహా పలు షోలు, ఈవెంట్లు, సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్నాడు.

సినిమాల్లోనూ... హీరోగా విజయం
అద్భుతమైన యాంకరింగ్‌తో బుల్లితెరపై హవాను చూపిస్తోన్న ప్రదీప్ మాచిరాజు.. కొన్నేళ్ల క్రితమే వెండితెరపైకి సైతం ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ సపోర్టింగ్ రోల్స్ చేస్తూ గతంలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. ఈ నేపథ్యంలో '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాతో హీరోగా మారాడు. క్రేజీగా విడుదలైన ఈ మూవీ భారీ కలెక్షన్లతో సూపర్ హిట్ అయింది.

ఇప్పుడు మరో షోతో వస్తున్నాడు
యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఇప్పటికే చేతి నిండా షోలతో ఫుల్ బిజీగా గడుపుతోన్నాడు. ఈ క్రమంలోనే అతడు ఇప్పుడు జీ తెలుగులో ప్రసారం కాబోతున్న 'సరిగమప ఛాంపియన్‌షిప్' అనే సింగింగ్ షోతో రాబోతున్నాడు. ఇది జనవరి 29 నుంచి ప్రారంభం కానుంది. గతంలో జరిగిన సరిగమప సీజన్లలోని కొందరు టాప్ సింగర్లతో దీన్ని నడిపించబోతున్నట్లు తెలిపారు.

ప్రదీప్ మాచిరాజుకు సర్‌ప్రైజ్
వచ్చే ఆదివారం నుంచి ప్రారంభం కాబోతున్న 'సరిగమప ఛాంపియన్‌షిప్' గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను షో నిర్వహకులు తాజాగా విడుదల చేశారు. ఇందులో గతంలో జరిగిన ఓ సీజన్‌లో సింగర్‌గా వచ్చి సత్తా చాటిన పవన్ కల్యాణ్.. యాంకర్ ప్రదీప్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. దీంతో ఇందులో ఇదే బాగా హైలైట్ కాబోతుంది.
ఏకంగా నాలుగు ఆఫర్లతో ఎంట్రీ
తాజాగా విడుదలైన ప్రోమోలో సింగర్ పవన్ కల్యాణ్ 'అన్నా మీకో చిన్న సర్‌ప్రైజ్ ఉందన్నా. అది చెప్పడానికి అమ్మను కూడా తీసుకొచ్చాను' అని చెప్పాడు. ఆ తర్వాత వాళ్ల అమ్మ స్టేజ్ మీదకొచ్చి 'మీ దయ వల్ల పవన్ నాలుగు జాబ్స్ తెచ్చుకున్నాడు. వాడికి కూడా ప్రదీప్ గారిలా ఇద్దరికి సాయం చేయాలన్న ఆశ ఉంది. మీరంతా వాడిని ఆశీర్వదించండి' అని అన్నారు.

అసలేం ఆఫర్స్.. ప్రదీప్ వల్లే
గతంలో జరిగిన ఓ సీజన్‌లో పవన్ కల్యాణ్ ఆర్థిక పరిస్థితి అంతగా బాగోదని తెలుసుకున్న యాంకర్ ప్రదీప్.. అతడి చదువుకు కావాల్సిన ఖర్చును స్వయంగా భరిస్తానని స్టేజ్ మీద నుంచి ప్రామిస్ చేశాడు. అలాగే, అతడు సహాయం చేశాడు. దీంతో పవన్ మంచిగా చదువుకుని నాలుగు జాబ్ ఆఫర్స్ అందుకున్నాడు. ఈ విషయాన్నే ఇప్పుడు అందరికీ తెలియజెప్పారు.


Click it and Unblock the Notifications











