సింగర్ ప్రవస్తి వివాదం.. అసలు సమస్య మొదలైంది ఇక్కడే.. మరో వాయిస్ రికార్డు
పాడుతా తీయగా షోలో సింగర్ ప్రవస్తితో మొదలైన వివాదం ఇంకా కొనసాగుతోంది. సింగర్ ప్రవస్తి ఎలిమినేషన్ తర్వాత తనకు అన్యాయం జరిగిందంటూ ఓ వీడియోను తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్లలో విడుదల చేసింది. దాంతో పెద్ద రచ్చగా మారింది. ఏకంగా స్టార్ సింగర్ సునీత కూడా ప్రవస్తి మాటలను ఖండించడం ఇంకా వివాదానికి దారి తీసింది. తాజాగా ప్రవస్తి అసలు గొడవ ఎక్కడ మొదలైందనే విషయాలను వివరిస్తూ ఓ వాయిస్ రికార్డును కూడా బయట పెట్టింది.
పాడుతా తీయగా సింగింగ్ రియాలిటీ షో..
లెజెండరీ సింగర్, దివంగత బాలసుబ్రహ్మణ్యం 1996లో 'పాడుతా తీయగా' సింగింగ్ రియాలిటీ షోను ప్రారంభించారు. చిన్న పిల్లలు, సంగీతంపై మక్కువ ఉన్న వారిలోని ప్రతిభను వెలికి తీసేందుకు ఈషోను ప్రారంభించారు. ఎంతో మందిని సంగీత గాయకులుగా తీర్చిదిద్దిందీ షో. తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్లోనూ ఎంతో మంచి పేరును సంపాదించుకుంది. ఈ షోను ప్రస్తుతం ఎస్పీ చరణ్ హోస్ట్ చేస్తున్నారు. సునీత, చంద్రబోస్, విజయ్ ప్రకాశ్ వంటి సంగీత ప్రముఖులు జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. పాడుతా తీయగా ఇప్పటి వరకు 22 సీజన్లను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సిల్వర్ జూబ్లీ సీజన్ కొనసాగుతోంది.

సింగర్ ప్రవస్తి గురించి..
సింగర్ ప్రవస్తి పేరు ఇప్పుడు టెలివిజన్ రంగంలో మారుమోగుతున్న సంగతి తెలిసిందే. ఈమె 2006 డిసెంబర్ 9న జన్మించింది. చిన్నప్పటి నుంచే తన సంగీత ప్రయాణాన్ని ప్రారంభించింది. తెలుగు, తమిళంలోని సంగీత పోటీల షోల్లో పాల్గొంది. 2001లో జీతెలుగులో వచ్చిన సరిగమప లిటిల్ ఛాంప్స్ లో పాడింది. 2014లో ఎయిర్ టెల్ సూపర్ సింగర్ జూనియర్ 4లోనూ తన గాత్రాన్ని వినిపించింది. రెడియో మిర్చి మ్యూజిక్ అవార్డు వేదికపైనా పాడే అవకాశాన్ని కూడా అందుకుంది. ప్రస్తుతం ప్రముఖ మ్యూజిషీయన్స్ తో కలిసి వరల్డ్ వైడ్గా స్టేజ్ పెర్ఫామెన్స్ లు ఇస్తూ ఆకట్టుకుంటోంది.
పాడుతా తీయగా వివాదం ఎలా మొదలైంది..
సింగర్ ప్రవస్తి పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ సీజన్ లో తన గాత్రంతో కంటెస్టెంట్ గా ఆకట్టుకుంది. తనదైన శైలిలో విభిన్న జోనర్లలో పాటలు పాడుతూ సంగీత ప్రియులను అలరించింది. అయితే ప్రస్తుత సీజన్ నుంచి సింగ్ ప్రవస్తి ఎలిమినేట్ అయ్యింది. బయటికి వచ్చిన తర్వాత గాయనీ తనకు అన్యాయం జరిగిందంటూ విడుదల చేసిన వీడియోతో వివాదంగా మారింది.
మరో వాయిస్ రికార్డు బయటపెట్టిన ప్రవస్తి..
సింగర్ సునీత తనపై వివక్ష చూపించిందని, జడ్జీగా వచ్చిన ఎంఎం కీరవాణి తనకు నచ్చిన కంటెస్టెంట్లను మాత్రమే సపోర్ట్ చేస్తూ వచ్చారని, వారు పరిధి దాటి ప్రవర్తించిన ఏమనలేదని చెప్పుకొచ్చింది. మరోవైపు చంద్రబోస్ కూడా వివక్ష చూపించారని తన వీడియోలు గతంలో వివరించింది. ఇక తాజాగా మాత్రం లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్ర రావుకు సంబంధించిన వాయిస్ రికార్డును వినిపించింది. ఆ వాయిస్ రికార్డులో మెనేజ్ మెంట్ సైడ్ నుంచి మాట్లాడుతూ.. గెస్ట్ గా రాఘవేంద్ర రావు వస్తున్నారని, ఆ చిత్రాల్లోని ఆధ్యాత్మిక పాటలు కాకుండా రొమాంటిక్ సాంగ్స్ పాడండి అంటూ తనను ఆదేశించారని చెప్పింది. మరోవైపు పోటీలో మాత్రం తోటీ సింగర్స్ కు ఆధ్యాత్మిక పాటలు పాడే అవకాశాన్ని కల్పించారని, అలా తనను పోటీలో నెగ్గకుండా చేశారని మరోసారి చెప్పింది.


Click it and Unblock the Notifications











