Rahul Sipligunj అషురెడ్డితో రాహుల్ సిప్లిగంజ్ రొమాన్స్.. నీవే నా బెస్ట్ లవ్ అంటూ పోస్ట్!
రాహుల్ సిప్లిగంజ్ ఈ పేరు తెలియని తెలుగు సంగీత ప్రియులు దాదాపుగా ఉండక పోవచ్చు. చాలా చోట్ల ఇతడి పాటలు వినిపిస్తుంటాయి. ఎక్కడో దూల్ పేట్ బస్తీలో పుట్టిన ఇతడు ఏకంగా ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ స్టేజీపై పాటను పాడి అవార్డు అందుకునే స్థాయికి చేరుకున్నాడు. అయితే ఇతడి పర్సనల్ లైఫ్ విషయానికొస్తే చాలా మంది ప్రేమయాణం నడిపినట్లు చాలా సార్లు వార్తలు వచ్చాయి. అలాగే చాలానే బ్రేకప్స్ అయినట్లు ప్రచారం సాగింది. తాజాగా ఇతడ మళ్లీ తన పాత లవర్‌కు కనెక్ట్ అయినట్లు ఆ ఒక్క పోస్ట్‌తో కన్ఫామ్ అయింది! ఇంతకీ ఆమె ఎవరు? దాని గురించే ఈ కథనం..
వివరాల్లోకి వెళితే.. జానపద పాటలు రాయడం, పాటలు పాడటం చేస్తూ సోషల్ మీడియాలో మస్త్ పాపులారిటీ సంపాదించుకున్నాడు రాహుల్ సిప్లిగంజ్. ముఖ్యంగా స్పెషల్ వీడియో సాంగ్స్, ఆల్బమ్స్ చేస్తూ క్రేజ్ సంపాదించుకున్నాడు. అలా యూత్‌లో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. హేయ్ పిల్లా, మంగమ్మ, మైసమ్మ, మాక్కికిరికిరీ, పూర్ బాయ్, గల్లీకా గణేష్ ఇలా పలు ఆల్బమమ్స్ చేసి ఆకట్టుకున్నాడు.

తొలిసారి 2009లో విడుదలైన జోష్ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కాలేజ్ బుల్లోడ సాంగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో పాటలు పాడి శ్రోతలను అలరించాడు. ఈగ, దమ్ము, రచ్చ, కమెరామెన్ గంగతో రాంబాబు, లై, ఆర్ఎక్స్ 100, హుషారు, రంగస్థలం, మల్లేశం, మహర్శి, ఇస్మార్ట్ శంకర్, రంగమార్తాండ ఇలా పలు సినిమాల్లో తన పాటలతో అలరించాడు. అలా ఈ జర్నీలో వచ్చిన ఫేమ్తోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లోనూ ఎంట్రీ ఇచ్చి అడుగు పెట్టి అక్కడ కూడా తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకున్నాడు. అచ్చమైన తెలుగు భాషలో, ముఖ్యంగా తెలంగాణ యాసలో మాట్లాడుతూ అందరికీ ఫేవరెట్ అయిపోయాడు.
ఇక అతడి పర్సనల్ లైఫ్ విషయానికొస్తే అతడు పలువురితో ప్రేమాయణం నడిపినట్లు ఎన్నో వార్తలు కూడా వచ్చాయి. బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు సినీ నటి పునర్నవి భూపాలంతో బాగా క్లాజ్‌గా ఉన్నాడు. ఆ తర్వాత వీరిద్దరు మంచి రిలేషన్షిప్ మెయిన్‌టెయిన్ చేసినట్లు రూమర్స్ గుప్పుమన్నాయి. రీసెంట్గా లేటెస్ట్ బిగ్‌బాస్‌లో రతికా.. రాహుల్ తన మాజీ ప్రియుడని తమ సీక్రెట్ రిలేషన్‌షిప్‌ను బయటపెట్టింది. ఈ టాపిక్ అయితే పెద్ద రచ్చే సాగింది. ఇక సోషల్ మీడియాలో జూనియర్ సమంతగా పాపులరై పొట్టి బట్టలతో గ్లామర్ షో చేసిన అషు రెడ్డితోనూ అతడు రిలేషన్షిప్ మెయిన్‌టెయిన్ చేశాడని ప్రచారం సాగింది. అలా ఒకరి తర్వాత ఒకరితో బ్రేకప్ అవుతూనే మరొకరితో బాగానే ఉన్నాడని అంతా అన్నారు.,

అయితే రీసెంట్గా రతికా రచ్చ అయిపోయాక మళ్లీ ఇంతకాలానికి తాను అషురెడ్డితో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశాడు. అషురెడ్డి కూడా ఈ పిక్‌ను పోస్ట్ చేసింది. ఆల్వేస్ మై బెస్ట్ లవ్ అని ఇద్దరు రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్ట్ చూసిన నెటిజ్లు ఇద్దరు మళ్లీ కనెక్ట్ అయిపోయారా అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది నెగటివ్ కామెంట్లు కూడా చేస్తున్నారు. మళ్లీ రాహుల్‌ను అషురెడ్డి టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది అని కూడా అంటున్నారు. మరి నిజంగానే ప్రేమలో ఉన్నారా లేదా అనేది వారికే తెలియాలి.


Click it and Unblock the Notifications











