Rahul Sipligunj on Rathika : రతికకు మాజీ ప్రియుడు రాహుల్ ఆల్ ది బెస్ట్.. బ్రేకప్‌పై రియాక్షన్ ఏంటంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఎంతలా ఆకట్టుకుంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక మొదటి విడుతలో వచ్చిన రతికా రోజ్... బిగ్ బాస్ ప్రేక్షకులకు సుపరిచితమే. ఈ బ్యూటీ రాహుల్ సిప్లిగంజ్ ఎక్స్ లవర్ అంటూ హౌసులో హల్ చల్ చేసింది. ఇక పల్లవిప్రశాంత్ తో ప్రేమాయణం నడిపి.. ఆ తర్వాత మళ్లీ ప్లేటు ఫీరాయించింది. ఇక ఈ బ్యూటీ ఎలిమినేట్ అయి.. మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రీ ఎంట్రీ తర్వాత కాస్త పద్ధతిగా మారిపోయిన రతిక... తాజాగా రాహుల్ సిప్లింగంత్ ఆమెతో బ్రేకప్ విషయంపై మాట్లాడారు. ఆ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే....

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో అడుగుపెట్టిన రతికా రోజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇక హౌసులోకి అడుగుపెడుతూనే అందరినీ ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఇక నాగార్జున కూడా బ్రేకప్ నుంచి బయటపడలేదా అంటూ స్టేజీ మీద అడగటం.. అంతా మీరే చేశారు అనడం.. ఇవన్నీ అప్పట్లో వైరల్ గా మారాయి. ఇక దీని వెనుక ఏం ఉందా అంటూ ఆరా తీశాక.. రాహుల్ సిప్లిగంజ్, రతికా ప్రేమికులు అని తెలిసింది. ఇక వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు అని అర్థం అవుతుంది.

Singer Rahul Sipligunj First Reaction on His Breakup with Rathika Rose News Goes Viral

ఇక రతికా రోజ్.. హౌసులో అడుగుపెట్టిన తర్వాత.. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కు కనెక్ట్ అయింది. ఇక అక్కడ ప్రశాంత్ తో పులిహోర కలడపం.. ఆ తర్వాత అతనికి పెద్ద షాక్ ఇచ్చి.. అందరి ముందు అతడిని దోషిగా నిలబెట్టడం.. ఇదంతా ఆమెకు మైనస్ గా మారింది. ఇక యావర్ తో లవ్ ట్రాక్ మొదలు పెట్టి.. నాలుగో వారంలో రతికా రోజ్ ఎలిమినేట్ అయిపోయింది.

ఇక బిగ్ బాస్ లో ఆమె ప్రవర్తన చూసి ప్రేక్షకులు కూడా దుమ్మెత్తి పోశారు. ఆమెకు సోషల్ మీడియాలో ఫుల్ నెగిటివిటీ వచ్చేసింది. ఇక బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యాక.. కూడా ఆమెకు నెగిటివిటీ పెరిగిపోయింది. ఇక బిగ్‌ బాస్‌ టీమ్‌ ఆమెకు మరోసారి రీఎంట్రీ ఛాన్స్‌ ఇచ్చింది. దాన్ని కూడా సరిగా సద్వినియోగం చేసుకోలేకపోతుంది రతిక రోజ్. మళ్లీ యావర్ తో కలిసి అతని గేమ్ చెడగొడుతూ.. పాత పద్ధతిలోనే వెళ్తోంది.

Singer Rahul Sipligunj First Reaction on His Breakup with Rathika Rose News Goes Viral

ఇక ఆమె హౌసులో ఉండగా రతిక తన మాజీ బాయ్‌ ఫ్రెండ్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ తో దిగిన ఫోటోలు సోషల్‌ మీడియాలో లీక్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై రాహుల్‌ సైతం పరోక్షంగా రతికను ఉద్దేశిస్తూ ఓ పోస్ట్ కూడా పెట్టాడు. ఇక ఆ విషయం పక్కన పెడితే... తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన రాహుల్‌.. రతికతో బ్రేకప్‌ పై ఫస్ట్ టైమ్ రియాక్ట్ అయ్యాడు. సోషల్ మీడియాలో మీరు రతికా రోజ్ ప్రేమించుకుని విడిపోయారు అని వైరల్ అవుతుంది దీనిపై మీ స్పందన ఏంటి అంటూ ఓ రిపోర్టర్ అడగ్గా.... ప్రతి ఒక్కరికీ గతం, వర్తమానం అనేవి రెండూ ఉంటాయి. భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలియదు అంటూ రాహుల్ చెప్పుకువచ్చాడు.

రతిక రోజ్ తో పాటు హౌస్‌ లో ఉన్న ప్రతి కంటెస్టెంట్‌ కు నేను ఆల్‌ ద బెస్ట్‌ చెప్తున్నాను అంటూ వెల్లడించారు. బాగా ఆడి కప్పుతో బయటకు రావాలని కోరుకుంటున్నానని తెలిపారు. విన్నర్‌ ఎవరనేది ఇప్పుడే మనం నిర్ణయించలేమని చెప్పారు. ప్రస్తుతానికైతే భోలె షావళి మంచి వినోదాన్ని అందిస్తున్నారన్నారు. శివాజీ ఇంట్లో పెద్ద వ్యక్తిలా ఉండగా.... పల్లెటూరు నుంచి వచ్చిన పల్లవి ప్రశాంత్‌ ఒకప్పుడు బిగ్‌ బాస్‌ షోను ప్రేక్షకుడిలా చూశాడు. ఇప్పుడు ప్రేక్షకులు ఆయనను బిగ్‌బాస్‌ హౌస్‌లో చూస్తున్నారని చెప్పుకువచ్చాడు రాహుల్ సిప్లిగంజ్. ప్రస్తుతం ఈ మాటలు వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X