Bigg Boss Telugu 6: గర్బవతిగా భార్య.. బిగ్‌బాస్ తెలుగు 6లోకి సింగర్ రేవంత్.. నాగ్‌తో అలా బాధపడుతూ..
టాలీవుడ్లో సింగర్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందాడు రేవంత్. ఎన్నో హిట్ సాంగ్స్ ఆలపించిన రేవంత్ 2017లో ఇండియన్ ఐడల్ 9వ సీజన్ విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అంతేకాకుండా మనోహారి, అంబదరి, తెలిసినే నా నువ్వే వంటి తదితర చార్ట్ బస్టర్స్ అందించాడు. ఇక సింగర్ రేవంత్ తాజాగా 21వ, చివరి కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్ తెలుగు 6 హౌజ్‌లోకి ఎంటర్ అయ్యాడు. ఈ బిగ్‌బాస్ హౌజ్‌లోకి వెళ్లేముందు ఎమోషనల్ అయ్యాడు రేవంత్.

200కుపైగా..
దర్శక ధీరుడు తెరకెక్కించి బాహుబలి ది బిగినింగ్ మూవీలో మనోహరి సాంగ్ పాటతో పాపులర్ అయ్యాడు సింగర్ రేవంత్. అంతకుముందు, ఆ తsర్వాత అనేక హిట్ పాటలను పాడి తెలుగు ప్రేక్షకులను అలరించాడు. అంతేకాకుండా కన్నడ, తెలుగు భాషల్లోని సినిమాలన్నింటిని కలిపి సుమారు 200కుపైగా పాటలు పాడాడు రేవంత్.

గ్రాండ్‌గా ఎంట్రీ..
ఈ పాపులారిటీతోనే అత్యధిక గుర్తింపు సాధించిన తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ ఆరో సీజన్లోకి అడుగుపెట్టాడు. సెప్టెంబర్ 4న గ్రాండ్‌గా ప్రారంభమైన ఈ సీజన్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు రేవంత్. ఈ షోలో రేవంత్ పర్ఫామెన్స్ తర్వాత సింగర్వే కాకుండా ప్లే బాయ్వని ఆట పట్టించాడు కింగ్ నాగార్జున.

తన భార్య కళ్లు గెస్ చేయాలని..
తర్వాత బోర్డ్‌పై కొంతమంది కళ్లను ఉంచి వాటిలో నీకు బాగా తెలిసిన కళ్లను గెస్ చేయమని రేవంత్‌కు టాస్క్ ఇస్తాడు నాగార్జున. దీంతో మొదటి ఆప్షన్‌ను ఎంచుకున్న రేవంత్ అవి తన భార్య అన్విత కళ్లు అని చెబుతాడు. దీంతో రేవంత్ భార్య అన్వితను స్టేజ్‌పైకి పిలుస్తాడు నాగార్జున. అవి అన్విత కళ్లు కాకపోయేసరికి రేవంత్ చేత అన్వితకు సారీ చెప్పిస్తాడు.

టైటిల్‌తో బయటకొస్తా..
కొద్దిసేపటి అన్విత ఆరు నెలల గర్భవతి అని నాగార్జున చెప్పగా.. అవును సార్.. నా బిడ్డ బయటకొచ్చేసరికి, నేను టైటిల్ కొట్టుకోని వస్తానని రేవంత్ నాగార్జునతో అంటాడు. తర్వాత అన్విత వెళ్లిపోగానే.. కాస్త ఎమోషనల్ అవుతాడు రేవంత్. ఇలాంటి సమయంలో తన పక్కన లేకుండా బిగ్‌బాస్‌లోకి వెళ్లడం కొంచెం బాధగా ఉందని స్టేజ్‌పైనే ఎమోషనల్ అవుతాడు. అలాగే తనముందు ఇలా ఎమోషనల్ అయితే తను ధైర్యంగా ఉండలేదని తన ప్రేము చాటుతాడు రేవంత్.

భార్యతో దిగిన ఫొటోలు షేర్..
కాగా ఇటీవలే అన్వితతో రేవంత్‌కు వివాహం అయింది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అన్వితతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేస్తుంటాడు రేవంత్. బిగ్‌బాస్ హౌజ్‌లోకి వెళ్లేముందు తన భార్యను, కుటుంబాన్ని మిస్ అవుతున్నట్లు ఇన్‌స్టా వేదికగా రాసుకొచ్చాడు. అయితే త్వరలో తండ్రి కాబోతున్న రేవంత్‌కు సోషల్ మీడియాలో నెటిజన్లు కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు.


Click it and Unblock the Notifications











