twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6: గర్బవతిగా భార్య.. బిగ్‌బాస్ తెలుగు 6లోకి సింగర్ రేవంత్.. నాగ్‌తో అలా బాధపడుతూ..

    |

    టాలీవుడ్​లో సింగర్​గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందాడు రేవంత్. ఎన్నో హిట్ సాంగ్స్ ఆలపించిన రేవంత్​ 2017లో ఇండియన్​ ఐడల్​ 9వ సీజన్ విన్నర్​గా నిలిచిన విషయం తెలిసిందే. అంతేకాకుండా మనోహారి, అంబదరి, తెలిసినే నా నువ్వే వంటి తదితర చార్ట్​ బస్టర్స్​ అందించాడు. ఇక సింగర్ రేవంత్​ తాజాగా 21వ, చివరి కంటెస్టెంట్​గా బిగ్​బాస్ తెలుగు 6 హౌజ్​లోకి ఎంటర్​ అయ్యాడు. ఈ బిగ్​బాస్ హౌజ్​లోకి వెళ్లేముందు ఎమోషనల్​ అయ్యాడు రేవంత్​.

    200కుపైగా..

    200కుపైగా..

    దర్శక ధీరుడు తెరకెక్కించి బాహుబలి ది బిగినింగ్​ మూవీలో మనోహరి సాంగ్​ పాటతో పాపులర్ అయ్యాడు సింగర్ రేవంత్. అంతకుముందు, ఆ తsర్వాత అనేక హిట్​ పాటలను పాడి తెలుగు ప్రేక్షకులను అలరించాడు. అంతేకాకుండా కన్నడ, తెలుగు భాషల్లోని సినిమాలన్నింటిని కలిపి సుమారు 200కుపైగా పాటలు పాడాడు రేవంత్.

     గ్రాండ్​గా ఎంట్రీ..

    గ్రాండ్​గా ఎంట్రీ..

    ఈ పాపులారిటీతోనే అత్యధిక గుర్తింపు సాధించిన తెలుగు రియాలిటీ షో బిగ్​బాస్​ ఆరో సీజన్​లోకి అడుగుపెట్టాడు. సెప్టెంబర్​ 4న గ్రాండ్​గా ప్రారంభమైన ఈ సీజన్ హౌజ్​లోకి ఎంట్రీ ఇచ్చాడు రేవంత్. ఈ షోలో రేవంత్​ పర్ఫామెన్స్ తర్వాత సింగర్​వే కాకుండా ప్లే బాయ్​వని ఆట పట్టించాడు కింగ్​ నాగార్జున.

    తన భార్య కళ్లు గెస్​ చేయాలని..

    తన భార్య కళ్లు గెస్​ చేయాలని..

    తర్వాత బోర్డ్​పై కొంతమంది కళ్లను ఉంచి వాటిలో నీకు బాగా తెలిసిన కళ్లను గెస్ చేయమని రేవంత్​కు టాస్క్ ఇస్తాడు నాగార్జున. దీంతో మొదటి ఆప్షన్​ను ఎంచుకున్న రేవంత్​ అవి తన భార్య అన్విత కళ్లు అని చెబుతాడు. దీంతో రేవంత్​ భార్య అన్వితను స్టేజ్​పైకి పిలుస్తాడు నాగార్జున. అవి అన్విత కళ్లు కాకపోయేసరికి రేవంత్​ చేత అన్వితకు సారీ చెప్పిస్తాడు.

    టైటిల్​తో బయటకొస్తా..

    టైటిల్​తో బయటకొస్తా..

    కొద్దిసేపటి అన్విత ఆరు నెలల గర్భవతి అని నాగార్జున చెప్పగా.. అవును సార్​.. నా బిడ్డ బయటకొచ్చేసరికి, నేను టైటిల్​ కొట్టుకోని వస్తానని రేవంత్​ నాగార్జునతో అంటాడు. తర్వాత అన్విత వెళ్లిపోగానే.. కాస్త ఎమోషనల్​ అవుతాడు రేవంత్. ఇలాంటి సమయంలో తన పక్కన లేకుండా బిగ్​బాస్​లోకి వెళ్లడం కొంచెం బాధగా ఉందని స్టేజ్​పైనే ఎమోషనల్​ అవుతాడు. అలాగే తనముందు ఇలా ఎమోషనల్​ అయితే తను ధైర్యంగా ఉండలేదని తన ప్రేము చాటుతాడు రేవంత్​.

    భార్యతో దిగిన ఫొటోలు షేర్​..

    భార్యతో దిగిన ఫొటోలు షేర్​..

    కాగా ఇటీవలే అన్వితతో రేవంత్​కు వివాహం అయింది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అన్వితతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేస్తుంటాడు రేవంత్. బిగ్​బాస్ హౌజ్​లోకి వెళ్లేముందు తన భార్యను, కుటుంబాన్ని మిస్​ అవుతున్నట్లు ఇన్​స్టా వేదికగా రాసుకొచ్చాడు. అయితే త్వరలో తండ్రి కాబోతున్న రేవంత్​కు సోషల్ మీడియాలో నెటిజన్లు కంగ్రాట్స్​ తెలియజేస్తున్నారు.

    English summary
    Tollywood Popular Singer Revanth Reveals He Is Going To Be Father On Bigg Boss Telugu 6 Stage With Nagarjuna.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X