Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Bigg Boss Telugu 6: బిగ్‌బాస్ హౌజ్‌లోకి సింగర్ రేవంత్.. టైటిల్ గెలుస్తాడా?
బుల్లితెర చరిత్రలోనే బ్రహ్మాండమైన రీతిలో ప్రేక్షకుల స్పందనను దక్కించుకుని తిరుగులేని షోగా దూసుకుపోతోంది బిగ్ బాస్. ఇండియాలోని మిగిలిన భాషల కంటే ఎక్కువ రెస్పాన్స్‌తో దూసుకుపోతోన్న ఈ తెలుగు రియాలిటీ షో... విజయవంతంగా సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతోంది. తాజాగా సెప్టెంబర్ 4న ఆదివారం బిగ్‌బాస్ ఆరో సీజన్ ప్రారంభమైంది. ఈ సీజన్లో ప్రముఖ టాలీవుడ్ సింగర్ రేవంత్ ఎంట్రీ ఇచ్చాడు. మరి అతని సినీ ప్రయాణంపై ఓ లుక్కేద్దామా!
ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా..
టాలీవుడ్లో మోస్ట్ పాపులర్ సింగర్‌గా పేరొందిన రేవంత్ పూర్తి పేరు లొల్ల వెంకట రేవంత్ కుమార్ శర్మ. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకులానికి చెందిన రేవంత్ 1990 ఫిబ్రవరి 10న జన్మించాడు. అయితే సింగర్‌గా రాణించిన రేవంత్ సంగీతంలో ఎలాంటి శిక్షణ తీసుకోలేదని, అతనికి మ్యూజిక్కు సంబంధించి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేదని టాక్.
200కుపైగా..
ఇప్పటివరకు తెలుగు, కన్నడ చిత్రాలకు కలిపి రేవంత్ 200కుపైగా పాటలు పాడాడు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎం ఎం కీరవాణి, కోటి, మణిశర్మ, తమన్, అలాగే దివంగత డైరెక్టర్ చక్రీ వద్ద పనిచేశాడు. 2017లో సోనీ మ్యూజిక్ ఛానెల్ నిర్వహించిన ఇండియన్ ఐడల్ 9వ సీజన్లో విజేతగా నిలిచాడు.
చిన్నప్పుడే చనిపోయిన తండ్రి..
ఇక రేవంత్ తల్లిదండ్రుల విషయానికొస్తే.. రేవంత్ తల్లిపేరు సీతా సుబ్బలక్ష్మీ. రేవంత్ పుట్టకముందే తండ్రి చనిపోయాడు. విశాఖపట్నంలో పెరిగిన రేవంత్ బ్యాచ్‌లర్ డిగ్రీని పూర్తి చేశాడు. రేవంత్‌కు సంతోష్ కుమార్ అని ఒక అన్నయ్య ఉన్నాడు. ఈటీవీలో ప్రారంభమైన స్వప్త స్వరాలు షోతో పాటలు పాడటం ప్రారంభించాడు. తర్వాత సూపర్ సింగర్ 5, సూపర్ సింగర్ 7లలో పాల్గొన్నాడు. సూపర్ సింగర్ 5, 7లలో రన్నరప్‌గా నిలిచాడు. ఇక సూపర్ సింగర్ 8లో మెంటార్‌గా చేశాడు రేవంత్.
ఇండియన్ ఐడల్ విజేతగా..
సోనీ లైవ్ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్‌లో ప్రసారమైన హిందీ రియాలిటీ సింగింగ్ షో ఇండియన్ ఐడల్ 9వ సీజన్లో రేవంత్ విజేతగా నిలిచి రూ. 25 లక్షల నగదు బహుమతిని అందుకున్నాడు. అలాగే మహీంద్రా కేయూవీ100 కారును గెలుచుకున్నాడు. 2017లో సోనీ టీవీ సబ్సే బడా కళాకార్ రియాలిటీ షో కోసం టైటిల్ ట్రాక్ పాడాడు రేవంత్. ఇదే తన మొదటి హిందీ పాట.
2008లో తెలుగులో..
ఇక 2008లో వచ్చిన మహా యజ్ఞం సినిమాలో జలక్ దిక్లాజా సాంగ్‌తో తెలుగులో తెరంగేట్రం చేశాడు. ఈ పాటను వందేమాతరం శ్రీనివాస్ కంపోజ్ చేశారు. అలాగే ఎంఎం కీరవాణిని తన గురువుగా భావిస్తాడు రేవంత్. 2019లో జీ తెలుగు టీవీ సిరీస్ రాధమ్మ కూతురు సీరియల్ కోసం టైటిల్ ట్రాక్‌ను కంపోజ్ చేశాడు రేవంత్. ఇక రేవంత్ పాడిన చాలా పాటలు పాపులర్ అయ్యాయి. అందులో అర్జున్ రెడ్డి మూవీలోని తెలిసినే నా నువ్వే, ఊపిరి ఆగుతున్నాదేతోపాటు బద్రీనాథ్‌లోని అంబదరి సాంగ్ బాగా పాపులర్ అయ్యాయి.
మనోహరి సాంగ్‌కు నామినేట్
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ది బిగినింగ్ సినిమాలోని మనోహరి పాట పాడినందుకు గాను బెస్ట్ మేల్ సింగర్‌గా ఐఫా అవార్డు, స్టార్ మా మ్యూజిక్ అవార్డులకు నామినేట్ అయ్యాడు. ఇంకా రాక్‌స్టార్, మా టీవీలోని స్పైసీ సింగర్, సౌత్ సూపర్ స్టార్ టైటిల్స్ కూడా గెలుచుకున్నాడు రేవంత్. ఇంతకుముందు సీజన్లో సింగర్ శ్రీరామ్ చంద్ర టైటిల్ గెలుస్తాడని అనుకున్నారంత.. మరి ఈ సింగర్ అయినా విజేతగా నిలుస్తాడో చూడాలి.