For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: బిగ్​బాస్ హౌజ్​​లోకి సింగర్​ రేవంత్​.. టైటిల్​ గెలుస్తాడా?

  |

  బుల్లితెర చరిత్రలోనే బ్రహ్మాండమైన రీతిలో ప్రేక్షకుల స్పందనను దక్కించుకుని తిరుగులేని షోగా దూసుకుపోతోంది బిగ్ బాస్. ఇండియాలోని మిగిలిన భాషల కంటే ఎక్కువ రెస్పాన్స్‌తో దూసుకుపోతోన్న ఈ తెలుగు రియాలిటీ షో... విజయవంతంగా సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతోంది. తాజాగా సెప్టెంబర్​ 4న ఆదివారం బిగ్​బాస్ ఆరో సీజన్ ప్రారంభమైంది. ఈ సీజన్​లో ప్రముఖ టాలీవుడ్ సింగర్​ రేవంత్​ ఎంట్రీ ఇచ్చాడు. మరి అతని సినీ ప్రయాణంపై ఓ లుక్కేద్దామా!

  ఎలాంటి బ్యాక్​గ్రౌండ్​ లేకుండా..

  ఎలాంటి బ్యాక్​గ్రౌండ్​ లేకుండా..

  టాలీవుడ్​లో మోస్ట్​ పాపులర్​ సింగర్​గా పేరొందిన రేవంత్​ పూర్తి పేరు లొల్ల వెంకట రేవంత్​ కుమార్​ శర్మ. ఆంధ్రప్రదేశ్​ శ్రీకాకులానికి చెందిన రేవంత్​ 1990 ఫిబ్రవరి 10న జన్మించాడు. అయితే సింగర్​గా రాణించిన రేవంత్ సంగీతంలో ఎలాంటి శిక్షణ తీసుకోలేదని, అతనికి మ్యూజిక్​కు సంబంధించి ఎలాంటి బ్యాక్​గ్రౌండ్ లేదని టాక్.

   200కుపైగా..

  200కుపైగా..

  ఇప్పటివరకు తెలుగు, కన్నడ చిత్రాలకు కలిపి రేవంత్​ 200కుపైగా పాటలు పాడాడు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎం ఎం కీరవాణి, కోటి, మణిశర్మ, తమన్​, అలాగే దివంగత డైరెక్టర్ చక్రీ వద్ద పనిచేశాడు. 2017లో సోనీ మ్యూజిక్​ ఛానెల్ నిర్వహించిన ఇండియన్​ ఐడల్​ 9వ సీజన్​లో విజేతగా నిలిచాడు.

  చిన్నప్పుడే చనిపోయిన తండ్రి..

  చిన్నప్పుడే చనిపోయిన తండ్రి..

  ఇక రేవంత్ తల్లిదండ్రుల విషయానికొస్తే.. రేవంత్ తల్లిపేరు సీతా సుబ్బలక్ష్మీ. రేవంత్ పుట్టకముందే తండ్రి చనిపోయాడు. విశాఖపట్నంలో పెరిగిన రేవంత్ బ్యాచ్​లర్​ డిగ్రీని పూర్తి చేశాడు. రేవంత్​కు సంతోష్​ కుమార్​ అని ఒక అన్నయ్య ఉన్నాడు. ఈటీవీలో ప్రారంభమైన స్వప్త స్వరాలు షోతో పాటలు పాడటం ప్రారంభించాడు. తర్వాత సూపర్ సింగర్​ 5, సూపర్​ సింగర్​ 7లలో పాల్గొన్నాడు. సూపర్ సింగర్​ 5, 7లలో రన్నరప్​గా నిలిచాడు. ఇక సూపర్ సింగర్​ 8లో మెంటార్​గా చేశాడు రేవంత్.

  ఇండియన్​ ఐడల్ విజేతగా..

  ఇండియన్​ ఐడల్ విజేతగా..

  సోనీ లైవ్​ ఎంటర్​టైన్​మెంట్ టెలివిజన్​లో ప్రసారమైన హిందీ రియాలిటీ సింగింగ్​ షో ఇండియన్​ ఐడల్ 9వ సీజన్​లో రేవంత్ విజేతగా నిలిచి రూ. 25 లక్షల నగదు బహుమతిని అందుకున్నాడు. అలాగే మహీంద్రా కేయూవీ100 కారును గెలుచుకున్నాడు. 2017లో సోనీ టీవీ సబ్సే బడా కళాకార్ రియాలిటీ షో కోసం టైటిల్​ ట్రాక్​ పాడాడు రేవంత్​. ఇదే తన మొదటి హిందీ పాట.

   2008లో తెలుగులో..

  2008లో తెలుగులో..

  ఇక 2008లో వచ్చిన మహా యజ్ఞం సినిమాలో జలక్ దిక్​లాజా సాంగ్​తో తెలుగులో తెరంగేట్రం చేశాడు. ఈ పాటను వందేమాతరం శ్రీనివాస్ కంపోజ్ చేశారు. అలాగే ఎంఎం కీరవాణిని తన గురువుగా భావిస్తాడు రేవంత్. 2019లో జీ తెలుగు టీవీ సిరీస్​ రాధమ్మ కూతురు సీరియల్ కోసం టైటిల్ ట్రాక్​ను కంపోజ్​ చేశాడు రేవంత్​. ఇక రేవంత్​ పాడిన చాలా పాటలు పాపులర్ అయ్యాయి. అందులో అర్జున్​ రెడ్డి మూవీలోని తెలిసినే నా నువ్వే, ఊపిరి ఆగుతున్నాదేతోపాటు బద్రీనాథ్​లోని అంబదరి సాంగ్ బాగా పాపులర్​ అయ్యాయి.

   మనోహరి సాంగ్​కు నామినేట్​

  మనోహరి సాంగ్​కు నామినేట్​

  దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ది బిగినింగ్​ సినిమాలోని మనోహరి పాట పాడినందుకు గాను బెస్ట్​ మేల్ సింగర్​గా ఐఫా అవార్డు, స్టార్ మా మ్యూజిక్ అవార్డులకు నామినేట్​ అయ్యాడు. ఇంకా రాక్​స్టార్​, మా టీవీలోని స్పైసీ సింగర్, సౌత్ సూపర్ స్టార్ టైటిల్స్​ కూడా గెలుచుకున్నాడు రేవంత్​. ఇంతకుముందు సీజన్​లో సింగర్​ శ్రీరామ్ చంద్ర టైటిల్​ గెలుస్తాడని అనుకున్నారంత.. మరి ఈ సింగర్​ అయినా విజేతగా నిలుస్తాడో చూడాలి.

  English summary
  Tollywood Popular Singer Revanth Entered Into Bigg Boss Telugu Season 6 Show. And Nagarjuna Akkineni Welcomes Revanth.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X