Bigg Boss 6: కప్పుతోనే బయటకొస్తా.. ఎమోషనల్‌గా మ్యాటర్ లీక్ చేసిన సింగర్ రేవంత్
బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షో గా దూసుకుపోతోంది బిగ్ బాస్. అయితే ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరొందిన బిగ్ బాస్ తెలుగులో ప్రారంభం అవుతుంది అన్నప్పుడు అనుకున్నంతగా సక్సెస్ కాదేమో అని అంతా అనుకున్నారు. కానీ మొదటగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రారంభమైన ఈ రియాలిటీ షో సూపర్ సక్సెస్ సాధించింది. తర్వాత నాని హోస్ట్‌గా చేయగా 5 సీజన్స్ వరకు నాగార్జునతో విజయవంతంగా కొనసాగింది. ప్రస్తుతం ప్రారంభం కానున్న ఆరో సీజన్‌లో సింగర్ రేవంత్ పార్టిస్పేట్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రేవంత్ కచ్చితంగా బిగ్‌బాస్‌లో పార్టిస్పేట్ చేస్తున్నట్లు ఒక హింట్ ఇచ్చాడు.

ఊహాగానాలు..
బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్‌కు ఇక ఒక్క రోజే మిగిలి ఉంది. అత్యధిక పాపులారిటి తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ హౌజ్‌లోకి ప్రవేశించే పోటీదారుల గురించి సోషల్ మీడియాలో చాలా ఊహాగానాలు ఉన్నాయి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 హౌస్‌లోకి సింగర్ రేవంత్, ఆర్జే సూర్య, ఆది రెడ్డి, శ్రీహాన్, గీతు రాయల్, అభినయశ్రీ, నేహా చౌదరి, వాసంతి, బాలాదిత్య, శ్రీ సత్య వంటి తదితరుల పేర్లు ఖరారు అయినట్లు తెలుస్తోంది.

త్యాగం చేయడం కష్టం..
అయితే తాను బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి కప్పు కొడతాను అంటూ ఓ పోస్ట్ ద్వారా హింట్ ఇచ్చాడు సింగర్ రేవంత్. జీవితంలో కొన్నింటిని త్యాగం చేయడం కష్టంగా ఉంటుంది. నా భార్యతో పాటు నాకు ఇష్టమైన సంగీతాన్ని కూడా మిస్ అవుతున్నాను. కానీ, బయటకు వస్తే ఒక భగీరథుడి సాధనలా గెలిచి మంచి పేరుతోనే వస్తా. మీ ఓట్లతో నన్ను గెలిపించండి. ఎంటర్టైన్మెంట్కి అంతా సిద్ధం. మీ సపోర్ట్‌తో టైటిల్ గెలిచి వస్తా అని ఎమోషనల్‌గా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో స్టేటస్ పెట్టాడు రేవంత్.

గ్రాండ్‌గా ఆరో సీజన్..
దీంతో తాను బిగ్‌బాస్‌లోకి వెళ్తున్నట్లు చెప్పకనే చెప్పాడు సింగర్ రేవంత్. ఇదిలా ఉంటే బిగ్ బాస్ గడిచిన 5 సీజన్స్ కూడా భారీ స్థాయిలో రేటింగ్స్ అందుకుంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మొదటి హోస్ట్‌గా ఆ తర్వాత నాని రెండో హోస్ట్‌గా షోను ఎక్కడికో తీసుకువెళ్లారు. అయితే మూడో సీజన్ నుంచి నాగార్జున విజయవంతంగా బిగ్ బాస్ ను కొనసాగిస్తూ వస్తున్నారు. ఇక ఓటీటిలో కూడా నాన్ స్టాప్ షోగా బిగ్ బాస్ కు మంచి క్రేజ్ అయితే సంపాందించుకుంది. ఇక ఇప్పుడు సెప్టెంబర్ 4న 6వ సీజన్ ఎంతో గ్రాండ్ గా ప్రారంభం కానుంది.

నామినేషన్స్‌లో మార్పు..
ఇక రాబోయే 6వ సీజన్ పై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సీజన్‌లో సరికొత్తగా రూల్స్ తీసుకొచ్చారని టాక్ వినిపిస్తోంది. నామినేషన్ ప్రక్రియ, శిక్షలను విభిన్నంగా ఏర్పాటు చేయనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆరో సీజన్‌లో జరిగే నామినేషన్స్ ప్రక్రియలో పూర్తిగా మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

సరికొత్త వ్యూహాలు..
దీన్ని మరింత జోరుగా మార్చేందుకు సరికొత్త వ్యూహాలను అమలు చేయబోతున్నట్లు బుల్లితెర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. సాధారణంగా బిగ్ బాస్ షోలో నామినేషన్స్ ప్రక్రియ సోమవారం రాత్రి ప్రసారం అయ్యే ఎపిసోడ్‌లో జరుగుతుంది. కానీ, ఈ ఆరో సీజన్‌లో మాత్రం దీన్ని సోమవారం కాకుండా బుధవారం చూపిస్తారని టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











