Bigg Boss: ఆ అమ్మాయిలపై రేవంత్ అసభ్య వ్యాఖ్యలు.. ఏకంగా అంత మాట.. అదే జరిగితే గెలవడం కష్టమే!
రియాలిటీ ఆధారంగా నడుస్తూ.. సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తూ.. ఏ భాషలోనైనా నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. మరీ ముఖ్యంగా తెలుగులో దీనికి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్లను పూర్తి చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో దాన్ని కూడా సరికొత్త అంశాలతో ఆసక్తికరంగా నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో రేవంత్ నోటి నుంచి ఓ ఊహించని మాట వచ్చింది. ఇంతకీ ఏం జరిగింది? ఆ పూర్తి వివరాలు మీకోసం!

ఆ ప్రయత్నం బెడిసికొట్టింది
బిగ్ బాస్ షో నుంచి వచ్చిన సీజన్లు అన్నీ ఒకదానికి మించి ఒకటి హిట్ అయ్యాడు. దీంతో ఆరో దానిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. కానీ, ఆరంభంలో దీనికి రేటింగ్ అంతగా దక్కలేదు. దీంతో నిర్వహకులు రూటు మార్చి సరికొత్త టాస్కులు, రొమాన్స్, ప్రేమ కహానీలు సహా ఎన్నో ఆసక్తికరమైన అంశాలను హైలైట్ చేయడంతో క్రమంగా స్పందన పెరుగుతూ రేటింగ్ కూడా వస్తోంది.

టైటిల్ ఫేవరెట్‌గా వచ్చాడు
ప్రస్తుతం ప్రసారం అవుతోన్న ఆరో సీజన్‌లో ఏకంగా 21 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. వీళ్లంతా తమ తమ విభాగాల్లో గుర్తింపును దక్కించుకున్నారు. అందులో పలువురు మాత్రమే టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగారు. అందులో సింగర్ రేవంత్ ఒకడు. సింగర్‌గా టాలీవుడ్‌లో సత్తా చాటిన అతడు.. ఇండియన్ ఐడల్ కూడా గెలిచాడు. దీంతో బిగ్ బాస్‌లోనూ హైలైట్ అవుతున్నాడు.

కోపంతో చెడ్డపేరు వచ్చింది
బిగ్ బాస్ షోలోకి అడుగు పెట్టినప్పటి నుంచే సింగర్ రేవంత్ తన మార్కు చూపించే ప్రయత్నాలు చేస్తున్నాడు. షోలో ఇచ్చే టాస్కుల్లో ఎంతో యాక్టివ్‌గా పాల్గొంటున్నాడు. వాటిలో తనదైన ఆటతో ఆకట్టుకుంటున్నాడు. కానీ, తరచూ కోపంతో గొడవలు పెట్టుకుంటున్నాడు. దీంతో ఆరంభంలోనే అతడు కోపిస్టి అనే పేరును తెచ్చుకున్నాడు. ఇది అతడికి మైనస్‌గా మారింది.

గొడవలతో రేవంత్‌పై ట్రోల్స్
బిగ్ బాస్ హౌస్‌లో రేవంత్ ఏం చేసినా హైలైట్ అవుతోంది. అంతేకాదు, అతడు తరచూ గొడవల్లో భాగం అవుతున్నాడు. ఒకరితో మాట్లాడిన ఒక మాట.. ఇంకొకరితో వేరేగా చెబుతున్నాడు. ఇలా అతడిపై ఎన్నోసార్లు ట్రోల్స్ వచ్చాయి. కానీ, అతడికి భారీ స్థాయిలో ఓటింగ్ పోల్ అవుతోంది. ఫలితంగా నామినేషన్స్ తప్పించుకోవడంతో పాటు ఇప్పుడు టైటిల్ బరిలోనే నిలుస్తున్నాడు.

టికెట్ టు ఫినాలే టాస్కులో
బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఇప్పుడు పదమూడో వారం నడుస్తోంది. దీంతో కంటెస్టెంట్లకు నిర్వహకులు టికెట్ టు ఫినాలే టాస్కును ఇచ్చారు. ఇందులో పలు రౌండ్లను పెడుతున్నారు. ఇలా బుధవారం ఎపిసోడ్ ముగిసే సమయానికి ఆది రెడ్డి 9 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో ఉండగా.. రేవంత్ 8 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. దీంతో అతడు మరింత కసిగా ఆడుతున్నాడు.

టాస్క్‌లో ఓటమి.. శాడిస్టుగా
టికెట్ టు ఫినాలే టాస్కులో భాగంగా టాప్ ప్లేస్‌లో ఉన్న నలుగురు కంటెస్టెంట్లకు బిగ్ బాస్ ఓ టాస్కును ఇచ్చాడు. ఇందులో భాగంగా కర్రను ఒకవైపు పట్టుకుని.. మరోవైపు కొన్ని వస్తువులను ఒకదానిపై ఒకటి నిలబెట్టాల్సి ఉంటుంది. ఇందులో ముందుగా ఫైమా ఔట్ అయింది. ఆ తర్వాత రేవంత్ కూడా ఎలిమినేట్ అయ్యాడు. దీంతో శ్రీ సత్య, ఇనాయాను శాడిస్ట్ అంటూ తిట్టాడు.

ఆ మాటలు... విమర్శలతో
టాస్కులో ఓడిపోయిన తర్వాత రేవంత్ 'శాడిస్ట్. మీరు ఎందుకు నవ్వారు. ముందు లేటుగా ఆడించి.. ఇప్పుడు త్వరగా అవజేశారు' అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడాడు. దీంతో శ్రీ సత్య కూడా గట్టిగానే సమాధానం ఇచ్చింది. ఆ సమయంలో రేవంత్ వ్యవహరించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఇదే కంటిన్యూ అయితే నువ్వు గెలవలేవు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











