For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: షో చరిత్రలోనే బెస్ట్ సీన్.. అతడికి లక్కీ ఛాన్స్.. ఇది చూస్తే కన్నీళ్లు ఆగవు!

  |

  నిజమైన సంఘటనల ఆధారంగా నడుస్తూ.. ఎన్నో ఊహించని పరిణాలు.. మతిపోగొట్టే ట్విస్టులతో సాగుతోన్న ఏకైక షో బిగ్ బాస్. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌ను తీసుకొస్తూ ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోందీ రియాలిటీ షో. ఈ కారణంగానే తెలుగులో ఇది ఏకంగా ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఆరో సీజన్ కూడా ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఇక, తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఓ ఊహించని పరిణామం జరిగింది. దీంతో చూసే ప్రేక్షకులూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ సంగతులేంటో మీరే చూడండి!

  ఆ సీజన్ల కంటే.. రేటింగ్‌ తక్కువే

  ఆ సీజన్ల కంటే.. రేటింగ్‌ తక్కువే


  గత సీజన్లు సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆరో దానిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఆరంభం నుంచే ఆసక్తికరంగా నడుపుతున్నారు. మరీ ముఖ్యంగా ఇందులో సరికొత్త టాస్కులు, రొమాన్స్, ప్రేమ కహానీలు సహా ఎన్నో ఆసక్తికరమైన అంశాలను హైలైట్ చేస్తున్నారు. కానీ, ఆరో సీజన్‌కు మాత్రం ఆశించిన రీతిలో రేటింగ్ రావడం లేదు.

  Ponniyin Selvan Twitter Review: తమిళ బాహుబలికి అలాంటి టాక్.. అసలైందే మిస్.. సినిమా చూడొచ్చా అంటే!

  టైటిల్ ఫేవరెట్‌గా రేవంత్ రాక

  టైటిల్ ఫేవరెట్‌గా రేవంత్ రాక

  ఆరో సీజన్‌లో ఏకంగా 21 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. వీళ్లంతా తమ తమ విభాగాల్లో గుర్తింపును దక్కించుకున్నారు. అందులో పలువురు మాత్రమే టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగారు. అందులో సింగర్ రేవంత్ ఒకడన్న విషయం తెలిసిందే. సింగర్‌గా టాలీవుడ్‌లో సత్తా చాటిన అతడు.. ఇండియన్ ఐడల్‌తో దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. దీంతో ఫేమస్ అయ్యాడు.

  ఆరంభంలో అలాంటి పేరుతో

  ఆరంభంలో అలాంటి పేరుతో

  బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచే సింగర్ రేవంత్ తన మార్కు చూపించే ప్రయత్నాలు చేస్తున్నాడు. షోలో ఇచ్చే టాస్కుల్లో ఎంతో యాక్టివ్‌గా పాల్గొంటున్నాడు. వాటిలో తనదైన ఆటతో ఆకట్టుకుంటున్నాడు. కానీ, తరచూ కోపంతో గొడవలు పెట్టుకుంటున్నాడు. దీంతో ఆరంభంలోనే అతడు కోపిస్టి అనే పేరును తెచ్చుకున్నాడు. ఇది అతడికి మైనస్‌గా మారిపోయింది.

  పైన ఏమీ లేకుండానే పూజా హెగ్డే: ఫ్రంట్, బ్యాక్ కనిపించేలా హాట్ షో

  సింగర్ రేవంత్‌కు బిగ్ సర్‌ప్రైజ్

  సింగర్ రేవంత్‌కు బిగ్ సర్‌ప్రైజ్

  సింగర్ రేవంత్ బిగ్ బాస్ షోలోకి వచ్చే సమయంలో అతడి భార్య అన్విత ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిందే. నిండు గర్భిణిని వదిలేసి హౌస్‌లోకి అడుగు పెట్టిన అతడు.. తరచూ భార్య గురించే ఆలోచిస్తూ కనిపిస్తున్నాడు. ఇందులో భాగంగానే తన భార్యను తలచుకుంటూ కన్నీరు పెట్టుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా బిగ్ బాస్ అతడికి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చాడు.

  మధుర క్షణాలను చూపిస్తూనే

  మధుర క్షణాలను చూపిస్తూనే

  సింగర్ రేవంత్ భార్య అన్విత సీమంతం గత వారంలో జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో అతడిని గార్డెన్ ఏరియాకు పిలిచిన బిగ్ బాస్.. 'మునుపటి వారం మీ భార్య సీమంతం జరిగింది.. ఆ వేడుకలో మీరు స్వయంగా పాలుపంచుకోలేకపోయిన కారణంగా ఆ మధుర క్షణాలను మీకు చూపించాలని అనుకుంటున్నారు' అంటూ చెప్పుకొచ్చాడు.

  టూ పీస్ బికినీలో చరణ్ హీరోయిన్: ముఖం తప్ప ఆ పార్టులన్నీ కనిపించేలా!

  బిగ్ బాస్ హౌస్‌లో సీమంతం

  బిగ్ బాస్ హౌస్‌లో సీమంతం

  ఆ తర్వాత అన్విత సీమంతం వీడియోను చూపించారు. ఆ సమయంలో సింగర్ రేవంత్ వెక్కి వెక్కి ఏడ్చేశాడు. అతడే కాదు.. ఈ ఎపిసోడ్ చూస్తున్న వారిలో చాలా మంది కన్నీటి పర్యంతం అయ్యారు. అంత ఎమోషనల్‌గా సాగిందిది. ఇక, ఈ వీడియో చూపించిన తర్వాత రేవంత్‌ తన భార్యకు ఎల్‌ఈడీ స్క్రీన్ నుంచే సీమంతం కార్యక్రమాన్ని జరిపించి సంతోషం వ్యక్తం చేశాడు.

  రేవంత్ ఉద్వేగం.. వాళ్లు కూడా

  రేవంత్ ఉద్వేగం.. వాళ్లు కూడా

  భార్యకు బిగ్ బాస్ హౌస్‌ నుంచే సీమంతం చేసిన రేవంత్ 'ఇది చాలు బిగ్ బాస్.. ఇక్కడకొచ్చి గెలిచినంత ఆనందంగా ఉంది. పక్కనుంటే బాగుండేది.. తనకు ఫ్రీ డెలివరీ అవ్వాలి. తల్లీ బిడ్డ క్షేమంగా ఉండాలి. కష్టపడి ఆడి గెలిచి.. ఆ కప్పు తీసుకుని వెళ్లి నా బేబీకి ఇవ్వాలి' అని కోరుకున్నాడు. ఆ సమయంలో చాలా మంది హౌస్‌మేట్స్ కూడా ఎమోషనల్ అయిపోయారు.

  English summary
  Bigg Boss Telugu Telugu 6th Season Running Successfully. Singer Revanth wife Seemantham Episode Gone Be Highlight in This Show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X