అడ్డంగా దొరికిపోయిన శ్రీముఖి: అతడితో మాట్లాడిన ఫోన్ సంభాషణ లీక్.. ఏకంగా ఆ మాట అడగడంతో!

తెలుగు బుల్లితెరపై సుదీర్ఘ కాలంగా హహాను చూపిస్తూ నెంబర్ వన్ యాంకర్‌గా సత్తా చాటుతోంది నిజామాబాద్ ముద్దుబిడ్డ శ్రీముఖి. గ్లామర్, యాక్టింగ్, హోస్టింగ్ ఇలా ఎన్నో రకాలుగా ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ చిన్నది.. వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకుపోతోంది. అదే సమయంలో తరచూ తన వ్యవహార శైలితో వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. ఇందులో భాగంగానే కొంత కాలంగా శ్రీముఖి పెళ్లికి సంబంధించిన వార్తలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఓ సింగర్‌తో మాట్లాడిన ఫోన్ సంభాషణ లీకైంది. ఆ వివరాలేంటో మీరే చూడండి!

సినిమాల్లో ఎంట్రీ.. యాంకర్‌గా

సినిమాల్లో ఎంట్రీ.. యాంకర్‌గా

శ్రీముఖి 'జులాయి' మూవీతో నటిగా కెరీర్‌ను మొదలెట్టి.. ఆ తర్వాత 'నేను శైలజ', 'జెంటిల్‌మెన్' వంటి చిత్రాల్లో అదిరిపోయే పాత్రలు చేసింది. ఆ తర్వాత 'ప్రేమ ఇష్క్ కాదల్', 'బాబు బాగా బిజీ' వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. అలాగే, 'అదుర్స్' షోతో హోస్టుగా మారి.. తర్వాత ఎన్నో హిట్ షోలు చేసింది. దీంతో తెలుగులో టాప్ యాంకర్‌గా మారింది.

శ్రీముఖి హవా.. వరుస షోలతో

శ్రీముఖి హవా.. వరుస షోలతో

కొంత కాలంగా యాంకర్ శ్రీముఖి ఎవరికీ సాధ్యం కాని రీతిలో బుల్లితెరపై హవాను చూపిస్తోంది. మరీ ముఖ్యంగా తెలుగులో ఉన్న ఛానెళ్లు అన్నింట్లోనూ ఆమె హోస్ట్‌గా చేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'జాతి రత్నాలు', 'మిస్టర్ అండ్ మిస్సెస్', 'సారంగ దరియా', 'స్టార్ మా పరివార్' వంటి షోలు చేస్తోంది. అలాగే, సినిమాలు, ఫంక్షన్లు, ఈవెంట్లతో బిజీగా గడుపుతోంది.

శ్రీముఖి ప్రేమ.. పెళ్లి గురించి

శ్రీముఖి ప్రేమ.. పెళ్లి గురించి

వరుసగా షోలు మీద షోలు చేస్తూ హవాను చూపిస్తూ దూసుకుపోతోన్న శ్రీముఖి కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకు వెళ్తోంది. అదే సమయంలో ఆమె పర్సనల్ లైఫ్‌ను కూడా చక్కగా నడుపుకోవాలని డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఆమె ప్రేమ, పెళ్లి అంటూ ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతోన్నాయి. దీంతో శ్రీముఖి తరచూ ట్రెండ్ అవుతోంది.

ఆ షోలో సింగర్‌తో లవ్ ట్రాక్

ఆ షోలో సింగర్‌తో లవ్ ట్రాక్

తెలుగు రాష్ట్రాల్లో చాలా కాలంగా యాంకర్ శ్రీముఖి పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే దీని గురించి చాలా పుకార్లు షికార్లు చేశాయి. ఈ నేపథ్యంలో ఈ బోల్డ్ యాంకర్ 'సరిగమప' అనే షోలో సింగర్‌ సాయి శ్రీ చరణ్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు కలరింగ్ ఇచ్చింది. టీఆర్పీ కోసమే చేసినా.. వీళ్ల జంట బాగా హైలైట్ అయిన విషయం తెలిసిందే.

మరోసారి శ్రీ చరణ్.. ఆ పాట

మరోసారి శ్రీ చరణ్.. ఆ పాట


ప్రస్తుతం జీ తెలుగులో 'సరిగమప చాంపియన్‌షిప్' సీజన్ నడుస్తోంది. ఇందులో పాత కంటెస్టెంట్లు కూడా వచ్చారు. వారిలో సాయి శ్రీ చరణ్ కూడా ఉన్నాడు. ఇక, వచ్చే వారం జరగనున్న ఫేస్ ఆఫ్ ఛాలెంజ్‌లో భాగంగా అతడు 'తాళి కట్టు శుభవేళ' అనే పాటను ఆలపించాడు. ఇందులో రకరకాల జంతువుల సౌండ్స్ చేస్తూ అక్కడున్న వాళ్లందరినీ మంత్రముగ్ధులను చేసేశాడు.

శ్రీముఖి ప్రస్తావన.. ఫోన్ కాల్

శ్రీముఖి ప్రస్తావన.. ఫోన్ కాల్

సాయి శ్రీ చరణ్ పెర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ప్రదీప్ 'ఎగ్జామ్ హాల్‌లో ఆన్సర్ మర్చిపోయిన స్టూడెంట్‌లానే ఉంటాడు' అన్నాడు. దీనికి జడ్జ్ అనంత్ శ్రీరామ్ 'ముందు సీజన్‌లో అయితే తనకు కావాల్సిన వాళ్లు యాంకరింగ్ చేసేవాళ్లు' అని అన్నాడు. దీంతో వెంటనే ప్రదీప్.. శ్రీముఖికి ఫోన్ చేసి చరణ్‌కు ఇచ్చాడు. ఆ వెంటనే అతడు జల జల జలపాతం నువ్వు అని పాడాడు.

రెస్పెక్ట్ ఇస్తున్నావు ఏంటి?

శ్రీ చరణ్ పాడిన తర్వాత శ్రీముఖి 'నాకు పాడాలని ఉంది కానీ.. జలుబు చేసింది' అని చెప్పింది. తర్వాత చరణ్ 'ఎలా ఉన్నారండి' అన్నాడు. దీంతో శ్రీముఖి 'షడన్‌గా రెస్పెక్ట్ ఇస్తున్నావేంటి? మామయ్య గారు వచ్చారా షూటింగ్‌కు' అని మాట్లాడింది. దీంతో అక్కడున్న వాళ్లందరూ షాక్ అయ్యారు. మొత్తానికి ఈ కాల్ ప్రేక్షకుల్లో అనుమానాలను మరింతగా పెంచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X