For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Indian Idol 12: దుమ్మురేపుతున్న షణ్ముఖ ప్రియ.. టైటిల్ రేసులో తెలుగు అమ్మాయి! ఓటింగ్ ఎలా అంటే!

  |

  జాతీయ స్థాయిలో మ్యూజిక్ అండ్ సింగింగ్ టాలెంట్‌ను రాబడుతున్న ఇండియన్ ఐడల్ షో రసవత్తరంగా సాగుతున్నది. ఇందులో కంటెస్టెంట్లు ఒకరికంటే మరొకరు ప్రతిభను చాటుకొంటూ సినీ ప్రముఖులనే కాకుండా సాధారణ ప్రేక్షకుల హృదయాలను దోచుకొంటున్నారు. ప్రస్తుతం నువ్వా నేనా అనే విధంగా 6 గురు కంటెస్టెంట్ల మధ్య జరుగుతున్న పోటీలో తెలుగు అమ్మాయి షణ్ముఖ ప్రియ తన గాన మాధుర్యంతో సెలబ్రిటీలను నివ్వెరపాటుకు గురిచేస్తున్నది. షణ్ముఖ ప్రియ గురించి మరిన్ని వివరాలు...

  వైజాగ్‌లో పుట్టి పెరిగి..

  వైజాగ్‌లో పుట్టి పెరిగి..

  షణ్ముఖ ప్రియ వ్యక్తిగత జీవిత విషయాలకు వస్తే.. సంప్రదాయ తెలుగు కుటుంబంలో 2003లో వైజాగ్‌లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు రమాలత, శ్రీనివాస్ కుమార్ ఇద్దరు కళాకారులే. తల్లి మ్యూజిక్ టీచర్ కాగా, తండ్రి వీణ, మాండలిన్, గిటార్, కీబోర్డ్, వయోలిన్ వాయిద్యకారుడు. దీంతో చిన్నప్పటి నుంచే మ్యూజిక్, సంగీతంపై ఆమెకు మక్కువ పెరిగింది. కర్ణాటక సంగీతం. జాజ్‌లో షణ్ముఖ ప్రావీణ్యం సాధించింది. తేజం సినిమా ద్వారా తెలుగు సినిమా రంగంలో అడుగుపెట్టారు.

  చిన్నతనంలోనే అద్భుతంగా

  చిన్నతనంలోనే అద్భుతంగా

  షణ్ముఖ ప్రియ చిన్నతనంలో పలు పోటీల్లో అద్భుతంగా రాణించింది. పాడుతా తీయగా, సారేగామ లిటిల్ ఛాంపియన్స్ 2017, సూపర్ సింగర్, ది వాయిస్ ఇండియా కిడ్స్ లాంటి పోటీల్లో తన ప్రతిభను చాటుకొన్నది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సోనీ టెలివిజన్‌లో ప్రసారం అయ్యే ఇండియన్ ఐడల్ 2020-2021 పోటీల్లో జాతీయ స్థాయిలో టాలెంట్ ప్రదర్శిస్తూ అందర్నీ ఆకర్షిస్తున్నారు.

  బప్పి లహరి ప్రశంసలు

  బప్పి లహరి ప్రశంసలు

  ఇండియన్ ఐడల్ 12 పోటీల్లో దిగ్గజ సినిమా నటులను, మ్యూజిక్ డైరెక్టర్లను, గాయకులను షణ్ముఖ ప్రియ విశేషంగా ఆకర్షిస్తున్నది. ఈ షోకు ప్రముఖ సంగీత దర్శకుడు బప్పి లహరి ఇటీవల హాజరయ్యారు. ఆయన స్వరపరిచిన జూమ్ జూమ్ జూమ్ బాబా పాటను పాడి అతడిని మైమరిపించింది. షణ్ముఖ గానమాధుర్యానికి కంటెస్టెంట్లు, జడ్జీలు, గెస్టులు ఊర్రూతలూగిపోయారు. సంగీత దర్శకుడు బప్పి లహిరి ప్రశంసల వర్షం కురిపించారు.

  బాలీవుడ్ ఆఫర్ ఇచ్చిన ఒమంగ్ కుమార్

  బాలీవుడ్ ఆఫర్ ఇచ్చిన ఒమంగ్ కుమార్


  ఇండియన్ ఐడల్ 12లో సెమీ ఫైనల్‌గా భావించే ఫైనల్ రౌండ్‌లో షణ్ముఖ ప్రియ టాప్ రేంజ్ ఫెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఇటీవల దర్శకుడు ఒమంగ్ కుమార్ ఈ షోకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. షణ్ముఖ ప్రియ ప్రతిభను చూసి ముచ్చటపడ్డారు. ఆ వేదిక సాక్షిగా ఆమెకు బాలీవుడ్ సినిమా ఆఫర్ కూడా ఇచ్చారు.

  ఆస్కార్ అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అంటూ కవితా కృష్ణమూర్తి

  ఆస్కార్ అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అంటూ కవితా కృష్ణమూర్తి

  ఆదివారం ఆగస్టు 1వ తేదీన ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో ప్రముఖ గాయకులు కవితా కృష్ణమూర్తి, కుమార్ సాను హాజరయ్యారు. తాజాగా విడుదల చేసిన ఎపిసోడ్ ప్రోమోలో షణ్ముఖ ప్రియపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె గాన ప్రతిభను చూసి మైమరిచిపోయారు. మిస్టర్ ఇండియా చిత్రంలో ఆమె పాడిన హవా హవాయి పాటను అద్బుతంగా పడటంతో ఆస్కార్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ మాదిరిగా అనిపిస్తున్నది అంటూ కవిత కృష్ణమూర్తి ప్రశంసల వర్షం కురిపించారు.

  Greatest Indian Classics - Episode 1 | Sagara Sangamam, కమల్ నట విశ్వరూపం || Filmibeat Telugu
  ఆగస్టు 15న గ్రాండ్ ఫినాలే...

  ఆగస్టు 15న గ్రాండ్ ఫినాలే...

  ఇక ఇండియన్ ఐడల్ 12 గ్రాండ్ ఫినాలే ఆగస్టు 15వ తేదీన జరుగనున్నది. ఈ టైటిల్ కోసం ఆరుగురు పోటీ పడుతున్నారు. పవన్‌దీప్ రాజన్, అరుణిత కంజిలాల్, మహ్మద్ డానిష్, సయేలి కాంబ్లే, నిహాల్ టారో పోటీలో ఉన్నారు. తెలుగు తేజం షణ్ముఖ ఈ పోటీలో గెలువాలంటే.. సోనీ లివ్ యాప్‌‌ను డౌన్‌లోడ్ చేసుకొని లేదా ఫస్ట్‌క్రై.కామ్ ద్వారా గానీ ఓటు వేయాలి. ఆమె తనకు ఓటు వేసి గెలిపించమని షణ్ముఖ ప్రియ విన్నవించుకొంటున్నారు.

  English summary
  Singer Shanmukhapriya in the race of Indian Idol 12 title. She is winning top legends fo Indian cinema and National wide audience, Music lovers. Grand finale will be on August 15th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X