Bigg Boss Telugu 6: సెలబ్రిటీలను తన్నుకోమనడం.. టీఆర్పీలను పెంచుకుంటామనడం ఏంటీ?.. సింగర్ స్మిత కామెంట్స్
అసాధారణ రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్. ఇప్పటి వరకు ఐదు సీజన్లను ఎంతో విజయవంతంగా ప్రేక్షకుల మన్ననలు పొందగా.. ఇటీవలే బిగ్‌బాస్ ఆరో సీజన్ ప్రారంభమైంది. ఎప్పటిలానే కంటెస్టెంట్లందరూ తమ గ్రాండ్ ఎంట్రీలతో బిగ్‌బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టారు. ఇదిలా ఉంటే ఈ షోకు ఆదరణ ఎంతుందో.. విమర్శలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఈ షోపై ఇదివరకు చాలా మంది ప్రముఖులు విమర్శలు గుప్పించారు. ప్రతి సీజన్ సమయంలో సీపీఐ నేత నారాయణ తనదైన స్టైల్లో ఏకిపారేస్తాడు. ఈ సీజన్‌కు సైతం అలానే చేశాడు. అయితే తాజాగా ఓ టాలీవుడ్ ప్రముఖ సింగర్ బిగ్‌బాస్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

మరోవైపు..
తెలుగు బుల్లితెర చరిత్రలోనే సూపర్బ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది బిగ్‌బాస్ రియాలిటీ షో. ప్రతి సీజన్‌ను మరింత జోష్‌తో, మరింత ఆదరణతో ముందుకు సాగుతోంది. ఈ ఆదరణ, ఈ మన్ననలు ఒకవైపు మాత్రమే. మరోవైపు బిగ్‌బాస్ షో ఒక కాంట్రవర్సీ షో. ఇదొక బూతు దందా అని పలువురు ఇప్పటికీ చాలా సార్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

అంతకుమించి దారుణంగా..
బిగ్‌బాస్ షో కొంతమందికి సినిమా అవకాశాలు, పాపులారిటీ, ఐడెంటిటీ తెచ్చిపెట్టి అద్భుతమైన అవకాశం. కానీ ఇదే బిగ్‌బాస్ రియాలిటీ కొందరికి బ్రోతల్ హౌజ్‌ల కనిపిస్తుంది. వారు పెట్టే టాస్క్‌లు, కాన్సెప్ట్ పాశ్చాత్య సంస్కృతికి మించి దారుణంగా ఉంటోందని తీవ్ర స్థాయిలో మండిపడిన సందర్భాలున్నాయి. అయితే తాజాగా బిగ్‌బాస్ అవకాశం వస్తే ఏం చేస్తారు అని ఓ ప్రముఖ సింగర్‌ను అడగ్గా.. ఆసక్తికర కామెంట్స్ చేసింది.

స్మిత అసహనం..
టాలీవుడ్ గాయనీగా మంచి పాపులారిటీ సంపాందించుకుంది సింగర్ స్మిత. ఇక ఆమె పాడిన ప్రైవేట్ ఆల్బమ్స్ ఎంత సూపర్ హిట్టో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌తో ముచ్చటించిన సింగర్ స్మిత బిగ్‌బాస్ రియాలిటీ షోపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అసహనం వ్యక్తం చేసింది.

ఆ తప్పు చేయను..
బిగ్‌బాస్ నుంచి ఎప్పుడైనా పిలుపు వచ్చిందా? అని స్మితను ప్రశ్నించగా.. ''బిగ్‌బాస్ నాకు అస్సలు నచ్చని షో. ఒకవేళ బిగ్‌బాస్ ఆఫర్ వస్తే పొరపాటున కూడా ఒప్పుకుని తప్పు చేయను. అన్ని రోజులు కుటుంబాన్ని వదిలి వెళ్లాల్సిన అవసరం అంతగా ఏముంది? నెలల పాటు సెలబ్రిటీలను లాక్ చేసి తన్నుకోండి.. మేం టీఆర్పీలను పెంచుకుంటాం అని అనడం ఎంతవరకు కరెక్ట్.

చచ్చినా వెళ్లను..
అందుకే ఈ షోను నేను అస్సలు చూడను. చూసిన నాకు అది అర్థం కాదు. నేను మాత్రం ఈ షోకి చచ్చినా వెళ్లను. నా సన్నిహితులు, ఫ్రెండ్స్ ఎవరైనా వెళ్తా అన్న కూడా మీకు ఏమోచ్చిందని వారిస్తాను. ఇక వెళ్లిన వారి గురించి నేను ఏం అనను, పట్టించుకోను. అది వారి వ్యక్తిగత విషయం. ఈ సీజన్లో నాకు తెలిసిన వాళ్లు వెళ్లారు. ఇప్పుడు దీని గురించి నేను ఏం మాట్లాడిన అది వారిని విమర్శించినట్లు అవుతుంది.

జడ్జిగా..
అందుకే ఆ షో గురించి పెద్దగా మాట్లాడుకోవాలని అనుకోవడం లేదు'' అని స్మిత తెలిపింది. కాగా ప్రస్తుతం స్మిత జీ తెలుగులో ప్రసారం అవుతున్న సూపర్ సింగర్ ఐకాన్ షోకి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది. ఇదే షోలో కంటెస్టెంట్‌కు మెంటర్‌గా ఉన్న సింగర్ రేవంత్.. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6లోకి చివరి (21వ) కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











