For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: సెలబ్రిటీలను తన్నుకోమనడం.. టీఆర్పీలను పెంచుకుంటామనడం ఏంటీ?.. సింగర్ స్మిత కామెంట్స్​

  |

  అసాధారణ రెస్పాన్స్​తో దూసుకుపోతోంది బుల్లితెర రియాలిటీ షో బిగ్​బాస్​. ఇప్పటి వరకు ఐదు సీజన్లను ఎంతో విజయవంతంగా ప్రేక్షకుల మన్ననలు పొందగా.. ఇటీవలే బిగ్​బాస్​ ఆరో సీజన్​ ప్రారంభమైంది. ఎప్పటిలానే కంటెస్టెంట్లందరూ తమ గ్రాండ్ ఎంట్రీలతో బిగ్​బాస్​ హౌజ్​లోకి అడుగుపెట్టారు. ఇదిలా ఉంటే ఈ షోకు ఆదరణ ఎంతుందో.. విమర్శలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఈ షోపై ఇదివరకు చాలా మంది ప్రముఖులు విమర్శలు గుప్పించారు. ప్రతి సీజన్​ సమయంలో సీపీఐ నేత నారాయణ తనదైన స్టైల్​లో ఏకిపారేస్తాడు. ఈ సీజన్​కు సైతం అలానే చేశాడు. అయితే తాజాగా ఓ టాలీవుడ్​ ప్రముఖ సింగర్​ బిగ్​బాస్​పై షాకింగ్​ కామెంట్స్​ చేసింది.

  మరోవైపు..

  మరోవైపు..

  తెలుగు బుల్లితెర చరిత్రలోనే సూపర్బ్​ రెస్పాన్స్​తో దూసుకుపోతోంది బిగ్​బాస్ రియాలిటీ షో. ప్రతి సీజన్​ను మరింత జోష్​తో, మరింత ఆదరణతో ముందుకు సాగుతోంది. ఈ ఆదరణ, ఈ మన్ననలు ఒకవైపు మాత్రమే. మరోవైపు బిగ్​బాస్ షో ఒక కాంట్రవర్సీ షో. ఇదొక బూతు దందా అని పలువురు ఇప్పటికీ చాలా సార్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

  అంతకుమించి దారుణంగా..

  అంతకుమించి దారుణంగా..

  బిగ్​బాస్​ షో కొంతమందికి సినిమా అవకాశాలు, పాపులారిటీ, ఐడెంటిటీ తెచ్చిపెట్టి అద్భుతమైన అవకాశం. కానీ ఇదే బిగ్​బాస్ రియాలిటీ కొందరికి బ్రోతల్​ హౌజ్​ల కనిపిస్తుంది. వారు పెట్టే టాస్క్​లు, కాన్సెప్ట్​ పాశ్చాత్య సంస్కృతికి మించి దారుణంగా ఉంటోందని తీవ్ర స్థాయిలో మండిపడిన సందర్భాలున్నాయి. అయితే తాజాగా బిగ్​బాస్​ అవకాశం వస్తే ఏం చేస్తారు అని ఓ ప్రముఖ సింగర్​ను అడగ్గా.. ఆసక్తికర కామెంట్స్ చేసింది.

  స్మిత అసహనం..

  స్మిత అసహనం..

  టాలీవుడ్​ గాయనీగా మంచి పాపులారిటీ సంపాందించుకుంది సింగర్ స్మిత. ఇక ఆమె పాడిన ప్రైవేట్ ఆల్బమ్స్​ ఎంత సూపర్ హిట్టో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఓ యూట్యూబ్​ ఛానెల్​తో ముచ్చటించిన సింగర్​ స్మిత బిగ్​బాస్​ రియాలిటీ షోపై ఇంట్రెస్టింగ్​ కామెంట్స్​ చేసింది. అసహనం వ్యక్తం చేసింది.

  ఆ తప్పు చేయను..

  ఆ తప్పు చేయను..


  బిగ్​బాస్​ నుంచి ఎప్పుడైనా పిలుపు వచ్చిందా? అని స్మితను ప్రశ్నించగా.. ''బిగ్​బాస్​ నాకు అస్సలు నచ్చని షో. ఒకవేళ బిగ్​బాస్​ ఆఫర్ వస్తే పొరపాటున కూడా ఒప్పుకుని తప్పు చేయను. అన్ని రోజులు కుటుంబాన్ని వదిలి వెళ్లాల్సిన అవసరం అంతగా ఏముంది? నెలల పాటు సెలబ్రిటీలను లాక్ చేసి తన్నుకోండి.. మేం టీఆర్పీలను పెంచుకుంటాం అని అనడం ఎంతవరకు కరెక్ట్​.

  చచ్చినా వెళ్లను..

  చచ్చినా వెళ్లను..

  అందుకే ఈ షోను నేను అస్సలు చూడను. చూసిన నాకు అది అర్థం కాదు. నేను మాత్రం ఈ షోకి చచ్చినా వెళ్లను. నా సన్నిహితులు, ఫ్రెండ్స్​ ఎవరైనా వెళ్తా అన్న కూడా మీకు ఏమోచ్చిందని వారిస్తాను. ఇక వెళ్లిన వారి గురించి నేను ఏం అనను, పట్టించుకోను. అది వారి వ్యక్తిగత విషయం. ఈ సీజన్​లో నాకు తెలిసిన వాళ్లు వెళ్లారు. ఇప్పుడు దీని గురించి నేను ఏం మాట్లాడిన అది వారిని విమర్శించినట్లు అవుతుంది.

  జడ్జిగా..

  జడ్జిగా..

  అందుకే ఆ షో గురించి పెద్దగా మాట్లాడుకోవాలని అనుకోవడం లేదు'' అని స్మిత తెలిపింది. కాగా ప్రస్తుతం స్మిత జీ తెలుగులో ప్రసారం అవుతున్న సూపర్ సింగర్ ఐకాన్ షోకి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది. ఇదే షోలో కంటెస్టెంట్​కు మెంటర్​గా ఉన్న సింగర్ రేవంత్​.. బిగ్​బాస్​ తెలుగు సీజన్​ 6లోకి చివరి (21వ) కంటెస్టెంట్​గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

  English summary
  Tollywood Popular Singer Smitha Shocking Comments On Bigg Boss Telugu Season 6 And Says She Will Never Go To That Show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X