For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  యాంకర్ ప్రదీప్ కోసం ఏడ్చిన సునీత: ఒక్కసారి కూడా కలవలేకపోయాను.. అలా చూస్తాను అంటూ!

  |

  రేడియో జాకీగా కెరీర్‌ను ఆరంభించి.. ఆ తర్వాత యాంకర్‌గా మారాడు యంగ్ టాలెంటెడ్ గాయ్ ప్రదీప్ మాచిరాజు. కెరీర్ ఆరంభంలోనే తనలోని సత్తాను ప్రపంచానికి పరిచయం చేసిన అతడు.. వరుస అవకాశాలను అందుకుంటూ స్టార్ యాంకర్ అయిపోయాడు. ఒకవైపు లేడీ యాంకర్ల హవా కనిపిస్తున్నా.. తనదైన శైలి హోస్టింగ్‌తో దూసుకుపోతున్నాడు. తద్వారా ఎన్నో షోలను నడిపిస్తున్నాడు. అదే సమయంలో హీరోగానూ సక్సెస్ అయ్యాడీ కుర్రాడు. ఈ నేపథ్యంలో తాజాగా సింగర్ సునీత.. ప్రదీప్ మాచిరాజు కోసం ఏడ్చేశారు. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

  అద్భుతమైన టైమింగ్‌.. అదే కారణంతో

  అద్భుతమైన టైమింగ్‌.. అదే కారణంతో

  యాంకర్‌గా ప్రదీప్ మాచిరాజు సక్సెస్ అవడానికి అతడి టైమింగే ప్రధాన కారణం అని చెప్పొచ్చు. కమెడియన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా పంచులు వేస్తూ ప్రతి కార్యక్రమాన్ని వన్ మ్యాన్ షోగా మార్చుకుంటున్నాడు. తద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు వరుస ఆఫర్లను అందుకుంటున్నాడు. దీంతో మేల్ యాంకర్లలో నెంబర్ వన్ స్థానంలో వెలుగొందుతూ దూసుకెళ్తున్నాడు.

  హీరోగా ఎంటర్.. ఫస్ట్ మూవీతోనే హిట్

  హీరోగా ఎంటర్.. ఫస్ట్ మూవీతోనే హిట్

  ప్రదీప్ మాచిరాజు గతంలో ఎన్నో సినిమాల్లో నటించాడు. అయితే, కొద్ది రోజుల క్రితమే హీరోగా అతడు నటించిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. ఫలితంగా కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. ఈ హిట్ చిత్రంలో ప్రదీప్‌కు హీరోగా ఘనమైన ఆరంభం దక్కిందనే చెప్పాలి.

   బుల్లితెరపై హవా చూపి వరుస షోలతో

  బుల్లితెరపై హవా చూపి వరుస షోలతో

  తెలుగులో ఎంత మంది యాంకర్లు ఉన్నా.. ప్రదీప్ మాత్రం చాలా కాలంగా వరుస షోలతో దూసుకుపోతూనే ఉన్నాడు. ఛానెల్‌తో సంబంధం లేకుండా ఎన్నో కార్యక్రమాలను నడిపిస్తున్నాడు. అన్నింట్లోనూ తనదైన శైలి హోస్టింగ్‌తో అలరిస్తున్నాడు. ప్రస్తుతం అతడు ‘ఢీ 13', ‘డ్రామా జూనియర్స్', ‘సూపర్ సీరియల్ ఛాంపియన్‌షిప్' సహా పలు షోలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తున్నాడు.

  వివాదంలో చిక్కుకుని.. సారీ చెప్పాడు

  వివాదంలో చిక్కుకుని.. సారీ చెప్పాడు

  ఇటీవల ఓ షోలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఉద్దేశించి యాంకర్ ప్రదీప్ ఏవో కామెంట్లు చేశాడని ఆరోపిస్తూ ఏపీ పరిరక్షణ సమితి నేతలు అతడిపై గొడవకు దిగిన విషయం తెలిసిందే. అంతేకాదు, సారీ చెప్పకుంటే ఇంటిని ముట్టడిస్తామని కూడా వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఇది పెద్ద వివాదంగా మారింది. ఆ వెంటనే దీనిపై స్పందించిన ప్రదీప్ ఏపీ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాడు.

  యాంకర్ జీవితంలోనే అతిపెద్ద విషాదం

  యాంకర్ జీవితంలోనే అతిపెద్ద విషాదం

  ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే యాంకర్ ప్రదీప్ ఇంట్లో ఇటీవలే ఓ విషాదం చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం కరోనాతో ఆయన తండ్రి కన్నుమూశారు. దీంతో కొద్ది రోజుల పాటు ఈ యంగ్ యాంకర్ బుల్లితెరపై కనిపించలేదు. ఈ విషయంపై స్పందిస్తూ ఇటీవల ఓ ఎమోషనల్ నోట్‌ను కూడా రిలీజ్ చేశాడతను. ప్రదీప్ మృతిపై సినీ, బుల్లితెర ప్రముఖులంతా సంతాపం తెలిపారు.

  యాంకర్ ప్రదీప్ కోసం ఏడ్చిన సునీత

  జీ తెలుగులో ప్రసారమవుతోన్న ‘డ్రామా జూనియర్స్' షోను యాంకర్ ప్రదీప్ హోస్ట్ చేస్తున్నాడు. దీనికి ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, సింగర్ సునీత, అలీ జడ్జ్‌లుగా చేస్తున్నారు. ఇక, వచ్చే వారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌లో తండ్రి కష్టాలను చూపిస్తూ ఓ టీమ్ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ చేసింది. దీంతో అందరూ ప్రదీప్ తండ్రి గురించి బాధ పడ్డారు. అప్పుడు సునీత ఏడ్చేశారు.

  ఒక్కసారి కూడా కలవలేకపోయానంటూ

  ఒక్కసారి కూడా కలవలేకపోయానంటూ

  ముందుగా ఎస్వీ కృష్ణారెడ్డి స్పందిస్తూ ‘ఈ స్కిట్ చూడగానే ప్రదీపే గుర్తొచ్చాడు. అందర్నీ నవ్వించే అతను తండ్రిని కోల్పోవడం బాధించింది' అని అన్నారు. ఆ తర్వాత సునీత మాట్లాడుతూ ‘అయ్యో ఎప్పుడూ చూడలేకపోయానే.. మాట్లాడలేకపోయానే అని బాధ పడ్డా. పర్లేదు మిమ్మిల్ని చూస్తున్నా కదా. మీలో మీ నాన్నగారిని చూసుకుంటా' అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు సునీత.

  English summary
  Pradeep Machiraju Recently Lost his Father. Now Singer Sunitha Crying on Anchor Pradeep Machiraju Father Death in Drama Juniors – The NEXT Superstar Show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X