మినిమమ్ ఉండాలి.. బరాబర్ ఇచ్చేస్తా.. పంచ్ డైలాగ్స్‌తో సింగర్ సునీత హల్‌చల్
చిన్నారుల్లో ప్రతిభను వెలికి తీసే డ్రామా జూనియర్స్ సీజన్ 5 కార్యక్రమంతో ప్రముఖ తెలుగు టెలివిజన్ ఛానెల్ జీ టెలివిజన్ సిద్ధమైంది. ఈ రియాలిటీ షోకు సంబంధించిన టీజర్‌ను భారీగా ఇటీవల లాంచ్ చేశారు. ఈ టీజర్ ఆవిష్కరణ కార్యక్రమానికి చాలా మంది ప్రతిభావంతులైన చిన్నారుల హాజరయ్యారు. ఈ రియాలిటీ షోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

చిన్నారు షోకు భారీగా టీఆర్పీ
జీ టెలివిజన్‌లో గతంలో ప్రసారమైన డ్రామా జూనియర్స్ నాలుగు సీజన్లు ప్రేక్షకులకు మంచి అనుభూతిని మిగిల్చాయి. ఛానెల్‌కు మంచి టీఆర్పీని తెచ్చిపెడుతున్నాయి. పిల్లలను ప్రోత్సాహిస్తూ వారిలోని ప్రతిభను రాటు దేల్చేలా చేస్తున్న ఈ రియాలిటీ షో 5వ సీజన్‌లోకి ప్రవేశించింది.

రేణు దేశాయ్, ఎస్వీ కృష్ణారెడ్డి, సునీత జడ్జీలుగా
టాప్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హోస్ట్‌గా వ్యవహరించే ఈ రియాలిటీ షోను బ్రహ్మండంగా డిజైన్ చేసినట్టు కనిపిస్తున్నది. ఈ షోలో రేణు దేశాయ్, ఎస్వీ కృష్ణారెడ్డి, సునీత న్యాయమూర్తులుగా వ్యవహరించబోతున్నారు. ఈ టీజర్‌లో ఈ ముగ్గురు న్యాయమూర్తులు గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చినట్టు స్పష్టమైంది.

ప్రదీప్ హంగామా చేస్తూ
టీజర్‌లో రేణు దేశాయ్, సునీత, ఎస్వీ కృష్ణారెడ్డి, యాంకర్ ప్రదీప్ హంగామా చేశారు. రేణుదేశాయ్ చిరునవ్వులు చిందిస్తూ వేదికపైకి రాగా.. సునీత డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకొన్నారు. ఇక దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి హుందాగా నడిచి వచ్చి పోజు ఇచ్చారు. కృష్ణారెడ్డి ఓ రియాలిటీ షోలో జడ్జిగా వ్యవహరించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ సందర్భంగా డ్రామా జూనియర్స్ ఎప్పుడూ సరికొత్త టాలెంట్‌ను బయటకు తీసుకొస్తుంది. ఈ షోలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. నేను మంచి పెర్ఫార్మెన్స్ లతో పాటు ఎంతో గొప్ప నటుల కోసం ఎదురుచూస్తున్నాను.

సునీత పంచ్ డైలాగ్స్
తాజాగా రిలీజైన డ్రామా జూనియర్ సీజన్ 5 టీజర్‌లో సింగర్ సునీత తానేంటో మరోసారి రుజువు చేశారు. ఈ టీజర్‌లో సునీత మాట్లాడుతూ.. నేను ఉన్నానంటే మినిమమ్ ఉండాలి. బరాబర్ ఈ షోలో ఇచ్చేయాల్సిందే అంటూ సునీత చెప్పిన డైలాగ్ వైరల్‌గా మారింది.

ఏప్రిల్ 11వ తేదీన
చిన్నారులు ప్రతిభను ప్రదర్శించే చోటుగా జీ తెలుగు డ్రామా జూనియర్స్ పేరు తెచ్చుకొన్నది. డ్రామా జూనియర్స్ షో మునుపెన్నడు చూడని విధంగా కొత్త హంగులతో డ్రామా జూనియర్స్: ది నెక్ట్స్ సూపర్ స్టార్‌గా ఏప్రిల్ 11 వ తేదీ రాత్రి 8 గంటలకు ప్రసారం కాబోతున్నది.


Click it and Unblock the Notifications











