For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సునీతపై చాలా మందే కర్చీప్‌లు వేశారట..వాడిపై లీగల్ యాక్షన్ తీసుకున్నా.. సింగర్ కామెంట్స్ వైరల్

    |

    ఆ దేవుడు కొందరికి అందం ఇస్తాడు.. ఇంకొందరికి చక్కటి కళలను ప్రదర్శించే నైపుణ్యం ఇస్తాడు.. మరికొందరికి చక్కటి గాత్రాన్ని ఇస్తాడు. అయితే సునీత విషయంలో మాత్రం అందం, చక్కటి మధురమైన గాత్రం రెండూ ఇచ్చాడు. తెలుగు సింగర్స్ అందరిలోనూ సునీతది ప్రత్యేక శైలి. ఆమె కట్టుబొట్టు అన్నీ ప్రత్యేకంగానే ఉంటాయి. పదహారణాల తెలుగు ఆడపడుచులా, బాపుబొమ్మలా ఉండే సునీత వ్యక్తిగత జీవిత విశేషాలు పంచుకునేందుకు అలీ నిర్వహించే ప్రోగ్రాంలో పాల్గొంది. సునీతతో పాటు ఝాన్సీ కూడా విచ్చేసింది. ఈ ప్రోగ్రాంకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

    కర్చీప్‌లు వేశారు..

    కర్చీప్‌లు వేశారు..

    సునీత అనగా ప్రస్తుతం అందరికీ ఓ పాట గుర్తుకు వస్తుంది. నీలి నీలి ఆకాశం అంటూ ఎంతో మధురంగా పాడిన సునీత గాత్రానికి అందరూ ఫిదా అయ్యారు. అందుకే అలీ సైతం మొదటగా అదే ప్రశ్నను సంధించాడు.‘మీ నీలి నీలి ఆకాశం యంగ్ ఏజ్‌లో ఎవరికైనా ఇచ్చారా? మీకు చాలా మంది కర్చీఫ్‌లు వేసి ఉంటారు.. మీరు ఒక్క కర్చీఫ్ కూడా తీసుకోలేదా?' అలీ ఎప్పటిలాగే సెటైర్ వేశాడు. ‘అవును.. వేసేవారు.. నా దగ్గర చాలా కర్చీఫ్‌లు ఉన్నాయి' అంటూ సింగర్ సునీత స్వీట్‌గా సమాధానం ఇచ్చింది.

    చీరకే అందం..

    చీరకే అందం..

    ఆపై ‘సునీత చీరలకు ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా?'.. అని అలీ అనడంతో.. ‘ఆమె కట్టుకుంటే చీరలకే అందం వస్తుంది సార్'.. అని యాంకర్ ఝాన్సీ పొగడ్తలు కురిపించింది. ‘హా.. నేనూ చూశా.. 1999 నుంచి' అంటూ అలీ సెటైర్ వేశాడు. హా అని అంటున్నారేంటి అని సునీత అడగ్గా.. అందులో ఏముందని అలీ తిరిగి ప్రశ్నించాడు. మీరు ఆ.. అనడంలోనే కాదు.. కాలు కదిపినా అందులో అర్థం ఉంటుంది అంటూ సునీత రివర్స్ పంచ్ వేసింది.

    లీగల్ యాక్షన్..

    లీగల్ యాక్షన్..

    రీసెంట్‌గా సింగర్ సునీత్ వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. అదే విషయాన్ని అలీ గుర్తు చేస్తూ.. ఏంటి ఈ మధ్య బాగా రెబల్ అయ్యారంట.. అని అన్నాడు. ట్రూ కాలర్‌లో సింగర్ సునీత, సునీత ఉపద్రష్ట అని వాడెవడో నా పేరు పెట్టుకుని మోసాలు చేస్తున్నాడు. వాడిపై లీగల్ యాక్షన్ తీసుకున్నా అంటూ సునీత అసలు సంగతి చెప్పింది.

    Ilaiyaraaja : Unknown Facts About Ilaiyaraaja
    గత రెండు మూడు రోజులుగా..

    గత రెండు మూడు రోజులుగా..

    సింగర్ సునీత గత రెండు మూడు రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఆమె బంధువునని చెప్పి, మహిళలను మోసం చేస్తున్నాడనే వచ్చిన వార్తలపై సునీత ఫైర్ అయింది. తన పేరు చెప్పుకొని మోసాలు చేస్తున్నవాడు ఎవడో తనకు తెలీదని, వాడు కనిపిస్తే పళ్లు రాలగొడతానని ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అదే విషయమై సునీత మరో సారి క్లారిటీ ఇచ్చింది.

    English summary
    Singer Sunitha Satires On Ali Comments. Singer Sunitha And Anchor Jhansi Participated In ALi Talk Show. In Ali Tho Saradaga Programme Sunitha Gave Counters ToALi Questions.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
    X