ప్రదీప్ లవ్ ఎఫైర్‌పై సునీత సెన్సేషనల్ కామెంట్స్.. ఆమెను చూపించడంతో అనుమానాలు!

తెలుగు బుల్లితెరపై అందమైన అమ్మాయిలు యాంకర్లుగా సత్తా చాటుతోన్న సమయంలో.. మేల్ యాంకర్లు కూడా రాణించగలరు అని నిరూపించాడు ప్రదీప్ మాచిరాజు. రేడియో జాకీగా కెరీర్‌ను ఆరంభించిన అతడు... ఆ తర్వాత యాంకర్ అవతారమెత్తాడు. ఈ క్రమంలోనే అద్భుతమైన టాలెంట్‌తో చాలా తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో గుర్తింపు దక్కించుకున్నాడు. పర్సనల్ విషయాల పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండే ప్రదీప్‌కు సింగర్ సునీత షాకిచ్చింది. ఏకంగా అతడి లవ్ ఎఫైర్‌ను బయట పెడుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.!

అప్పుడే వాళ్ల ఫాలోయింగ్ మొదలైంది

అప్పుడే వాళ్ల ఫాలోయింగ్ మొదలైంది

జీ తెలుగులో ప్రసారం అయిన ‘బిగ్ సెలెబ్రిటీ ఛాలెంజ్' అనే షోతో యాంకర్‌గా పరిచయం అయ్యాడు ప్రదీప్ మాచిరాజు. ఆ తర్వాత అదే ఛానెల్‌లో వచ్చిన ‘గడసరి అత్త సొగసరి కోడలు' షోతో భారీ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ సమయంలోనే అతడికి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. ఈ షోలో అత్యుత్తమ యాంకరింగ్‌తో నంది అవార్డును సైతం అందుకున్నాడు.

ఎన్నో కార్యక్రమాలు.. సొంతంగా ఒకటి

ఎన్నో కార్యక్రమాలు.. సొంతంగా ఒకటి

సుదీర్ఘమైన కెరీర్‌లో ప్రదీప్ ఎన్నో షోలను హోస్ట్ చేశాడు. వీటిలో ‘ప్రదీప్ దర్భార్', ‘ఢీ', ‘సరిగమప' సహా ఎన్నో కార్యక్రమాలు మంచి గుర్తింపును తెచ్చాయి. ఇక, జీ తెలుగులో ప్రసారం అయిన ‘కొంచెం టచ్‌లో ఉంటే చెబుతాను' అనే షో ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రదీప్ స్వయంగా రూపొందించిన ఈ కార్యక్రమానికి అన్ని ఇండస్ట్రీల నటులు వచ్చారు.

అక్కడ కూడా సత్తా చాటిన యాంకర్

అక్కడ కూడా సత్తా చాటిన యాంకర్

బుల్లితెరపై తిరుగులేని యాంకర్‌గా వెలుగొందుతోన్న ప్రదీప్.. వెండితెరపైనా ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఎన్నో సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు. వాటిలో పవన్ కల్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది', అల్లు అర్జున్ సినిమా ‘జులాయి', నాగ చైతన్య హిట్ మూవీ ‘100% లవ్', జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘రామయ్యా వస్తావయ్యా' చిత్రాలు మంచి పేరును తెచ్చి పెట్టాయి.

లవ్ గురూగా కనిపించనున్న ప్రదీప్

లవ్ గురూగా కనిపించనున్న ప్రదీప్

యాంకర్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సత్తా చాటిన ప్రదీప్.. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మున్నా అనే దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ మూవీలో అతడు లవ్ గురూలా కనిపించనున్నాడు. 1947లో జరిగే పీరియాడిక‌ల్ క‌థగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలోని ‘నీలి నీలి ఆకాశం' పాటకు భారీ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

ప్రదీప్ లవ్ ఎఫైర్‌పై సునీత కామెంట్స్

ప్రదీప్ లవ్ ఎఫైర్‌పై సునీత కామెంట్స్

ప్రదీప్ ప్రస్తుతం జీ తెలుగులో ‘సరిగమప ద నెక్ట్స్ సింగింగ్ ఐకాన్' అనే షో చేస్తున్నాడు. ఈ కార్యక్రమానికి సింగర్ సునీత ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో ఆమె యాంకర్ ప్రదీప్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఇక్కడ ఏదో ట్రాక్ నడుస్తున్నట్లు తెలిసింది' అని అతడిపై సెటైర్ వేశారు. దీనికి కారణం గతంలో ఈ యాంకర్ ఓ సింగర్‌పై రొమాంటిక్ కామెంట్స్ చేయడమే.

Recommended Video

Bigg Boss 4 Telugu : ఈ వారం బిగ్ బాస్ నుంచి దివి ఎలిమినేటెడ్!
ఆమెను చూపించడంతో అందరికీ క్లారిటీ!

ఆమెను చూపించడంతో అందరికీ క్లారిటీ!

‘సరిగమప ద నెక్ట్స్ సింగింగ్ ఐకాన్' హారిక నారాయణ్ మెంటర్‌గా చేస్తోంది. ఓ ఎపిసోడ్‌లో ప్రదీప్ ఆమెను ఉద్దేశించి కామెంట్లు చేశాడు. అప్పటి నుంచి ఆమెతో ట్రాక్ నడుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీని గురించి గతంలో యాంకర్ రవి కూడా కామెంట్లు చేశాడు. ఇప్పుడు సునీత్ మాట్లాడిన తర్వాత హారికను చూపించారు. దీంతో ఇది నిజమేనేమోనన్న డౌట్లు పెరిగిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X