Single Box Office: శ్రీవిష్ణు మూవీకి షాకింగ్ కలెక్షన్స్.. అయినా లాభాల్లోనే, ఎన్ని కోట్లంటే?

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్మెంట్ శ్రీవిష్ణు హీరోగా కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించిన చిత్రం సింగిల్. యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కొట్టేసి నిర్మాతలకు కనివినీ ఎరుగని లాభాలను పంచుతోంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కార్తీక్ రాజు దర్శకత్వంలో సింగిల్ తెరకెక్కింది. గీతా ఆర్ట్స్, కళ్యా ఫిల్మ్స్ పతాకాలపై విద్య కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరిలు సంయుక్తంగా సింగిల్ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా 14 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసింది? ఎన్ని కోట్ల లాభాలను అందించింది ? అనే వివరాల్లోకి వెళితే..

సింగిల్ బడ్జెట్, బిజినెస్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్

సింగిల్ చిత్రాన్ని సుమారుగా 15 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించగా, ఈ సినిమాకు దాదాపు 7 కోట్ల రూపాయలు జరిగినట్లుగా ఫిలింనగర్ వర్గాలు తెలిపాయి. సింగిల్ చిత్రం లాభాల్లోకి రావాలంటే రూ.8 కోట్ల షేర్.. రూ.16 కోట్ల గ్రాస్ వసూలు చేయాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. మే 9న సుమారుగా తెలుగు రాష్ట్రాల్లో 400 స్క్రీన్లలో, ప్రపంచవ్యాప్తంగా 700 స్క్రీన్లలో సింగిల్ సినిమాను రిలీజ్ చేశారు.

Single Day 14 Box Office Collections Worldwide Sree Vishnu s film earns More Than 50 percent Profits

సింగిల్ 13 రోజుల వసూళ్లు

సింగిల్ మూవీకి తొలి రోజు ఇండియాలో రూ.2.5 కోట్లు, రెండో రోజు రూ.3.5 కోట్ల నెట్, మూడో రోజు రూ.3.55 కోట్ల నెట్, నాలుగో రోజు రూ.1.7 కోట్లు, ఐదో రోజు రూ.1.58 కోట్లు, ఆరో రోజు రూ.1.17 కోట్లు, ఏడో రోజు రూ.1.1 కోట్లు, ఎనిమిదో రోజు రూ.1.32 కోట్లు, తొమ్మిదో రోజు రూ.1.83 కోట్లు, పదవ రోజున రూ.2.09 కోట్లు, పదకొండవ రోజున రూ.77 లక్షలు, పన్నెండవ రోజున రూ.55 లక్షలు, పదమూడవ రోజున రూ.47 లక్షల చొప్పున 13 రోజుల్లో సింగిల్ మూవీ నికరంగా రూ.20.32 కోట్లు సాధించినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. అలాగే ఈ సినిమా ఓవర్సీస్‌లో రూ.4.5 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

సింగిల్ 12వ రోజు వసూళ్లు

వీకెండ్‌లోనూ కాదు వర్కింగ్ డేస్‌లోనూ సింగిల్ మంచి హోల్డ్ సాధిస్తోంది. గత వీకెండ్‌‌లో ఏకంగా రూ. 5 కోట్లు రాబట్టిన ఈ చిత్రానికి 14వ రోజైన గురువారం 16.61 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. హైదరాబాద్‌లో 293, బెంగళూరులో 53, విజయవాడలో 63, విశాఖటపట్నంలో 87 షోలు పడ్డాయి.

14వ రోజు సింగిల్ మూవీకి ఇండియా వైడ్ నికరంగా రూ.34 లక్షల కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. దీంతో 14 రోజుల వరకు శ్రీవిష్ణు సినిమాకు భారత్‌లో రూ.21.66 కోట్ల నెట్, రూ. 27.52 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ రూ.4.5 కోట్లు కలిపి 14 రోజుల వరకు ప్రపంచవ్యాప్తంగా సింగిల్ మూవీ రూ.35 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే పెట్టిన పెట్టుబడికి మించి దాదాపు 50 శాతానికి పైగా లాభాలను అందించింది సింగిల్. శుక్రవారం నుంచి వీకెండ్ ప్రారంభం కానుండటంతో శ్రీవిష్ణు చిత్రం మరోసారి గట్టిగా కొట్టే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. వీకెండ్‌లో స్క్రీన్ల సంఖ్య పెంచేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వీకెండ్ తర్వాత సింగిల్ మూవీ థియేట్రికల్ రన్‌పై ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి శ్రీవిష్ణు ఎలాంటి మేజిక్ చేస్తాడో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X