India
  For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సిరి హన్మంత్‌కు శ్రీహాన్ బ్రేకప్: బిగ్ బాస్ కంటెస్టెంట్‌ ఫ్యామిలీతో కలిసి కనిపించడంతో!

  |

  చాలా కాలంగా తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల షోలు వస్తున్నాయి. కానీ, అందులో చాలా తక్కువ కార్యక్రమాలు మాత్రమే సక్సెస్ అవుతున్నాయి. అందులో బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరొందిన బిగ్ బాస్ ఒకటి. అంచనాలు లేకుండానే వచ్చి.. చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకులకు చేరువ అయిన ఈ కార్యక్రమం.. తెలుగులో సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటోంది.

  ఇలా గత డిసెంబర్‌లోనే ఐదో దాన్ని సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుంది. ఇక, ఇందులో బాగా హైలైట్ అయిన కంటెస్టెంట్లలో సిరి హన్మంత్ ఒకరు. ఆమె హౌస్‌లో చేసిన రచ్చతో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆమె ప్రియుడు బ్రేకప్ చెప్పబోతున్నాడని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఫొటో బయటకు వచ్చింది. అసలేం జరిగిందో మీరూ చూడండి!

  టైటిల్ ఫేవరెట్‌గా వచ్చిన సిరి

  టైటిల్ ఫేవరెట్‌గా వచ్చిన సిరి

  కొద్ది రోజుల క్రితం ఐదో సీజన్‌లోకి ఎంతో మంది సెలెబ్రిటీలు ఎంట్రీ ఇచ్చారు. అందులో చాలా తక్కువ మంది మాత్రమే టైటిల్ ఫేవరెట్లుగా పేరు తెచ్చుకున్నారు. అందులో సీరియల్ నటిగా ఫేమస్ అయిన సిరి హన్మంత్ ఒకరు. ఆరంభంలోనే తనదైన ఆటతీరుతో కెప్టెన్‌గా ఎంపికైన ఈ బ్యూటీ.. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా గుర్తింపు తెచ్చుకుంది. దీంతో అందరి దృష్టిలో పడిపోయింది.

  మళ్లీ రెచ్చిపోయిన పాయల్ రాజ్‌పుత్: మేకప్ రూమ్‌లో ముందూ వెనకా చూపిస్తూ ఘోరంగా!

  అతడితో రొమాన్స్ చేయడంతో

  అతడితో రొమాన్స్ చేయడంతో

  బిగ్ బాస్ ఐదో సీజన్‌లో సిరి హన్మంత్ ఆట పరంగా ఆకట్టుకున్నప్పటికీ.. వ్యవహారశైలితో మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. మరీ ముఖ్యంగా షణ్ముఖ్ జస్వంత్‌తో ఆమె చేసిన రచ్చ మాత్రం హాట్ టాపిక్ అయిపోయింది. మరీ ముఖ్యంగా షన్నూతో రొమాన్స్ చేయడం.. హగ్గులు ముద్దులు ఇవ్వడం.. ఎప్పుడూ కలిసే ఉండడంతో ఆమెపై విమర్శలు కూడా వచ్చిన విషయం తెలిసిందే.

  బిగ్ బాస్ వల్ల ఇమేజ్ డ్యామేజ్

  బిగ్ బాస్ వల్ల ఇమేజ్ డ్యామేజ్

  బిగ్ బాస్ ఐదో సీజన్ చివరి వరకూ ఉండడంతో సిరి హన్మంత్ బాగానే సంపాదించిందని బుల్లితెర వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఆమె 15 వారాల పాటు హౌస్‌లో ఉన్నందుకు గానూ రూ. 30 లక్షల వరకూ రెమ్యూనరేషన్‌గా తీసుకుందని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో సిరి హన్మంత్ తన క్యారెక్టర్‌ను దిగజార్చుకుందని కూడా విమర్శలు వెల్లువెత్తుతూనే వచ్చాయి.

  Bheemla Nayak సంచలనం: 29 రోజులుగా నెంబర్ వన్.. టాలీవుడ్‌లో ఆల్‌టైం రికార్డు

  పెళ్లి గురించి సిరి వివరిస్తూనే

  పెళ్లి గురించి సిరి వివరిస్తూనే

  ఒక ఇంటర్వ్యూలో సిరి హన్మంత్ తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. ‘బిగ్ బాస్ హౌస్ నుంచి ఇప్పుడే కదా బయటకు వచ్చాను. పెళ్లి గురించి అప్పుడే చెప్పలేను. ముందు చోటూతో మాట్లాడాలి. అతడు ఇప్పుడు ఏమంటాడో తెలీదు. అందుకే ముందు నాకు క్లారిటీ వచ్చిన తర్వాతనే పెళ్లి ఎప్పుడనేది చెప్తాను. ఈ విషయాన్ని ఇద్దరం కలిసే ప్రకటిస్తాము' అంటూ చెప్పుకొచ్చింది.

  సిరికి శ్రీహాన్ బ్రేకప్ చెప్పాడని

  సిరికి శ్రీహాన్ బ్రేకప్ చెప్పాడని

  బిగ్ బాస్‌లోకి రాకముందే సిరి హన్మంత్.. శ్రీహాన్ చోటు అనే నటుడితో ప్రేమాయణం సాగించింది. అలాగే, అతడితో ఓ కార్యక్రమంలో నిశ్చితార్థం కూడా చేసుకుంది. అలా ఎంగేజ్‌డ్‌గా బిగ్ బాస్ షోలోకి వచ్చిన ఆమె.. ఇందులో మాత్రం షణ్ముఖ్‌తో రొమాన్స్‌ను పడించింది. అలాగే, అతడికి కనెక్ట్ అయ్యానంది. దీంతో శ్రీహాన్ ఆమెకు బ్రేకప్ చెబుతున్నాడన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

  యంగ్ క్రికెటర్‌తో బాలయ్య హీరోయిన్ నైట్ పార్టీ: ఇద్దరూ అలా దొరికిపోవడంతో కలకలం!

  ఇద్దరూ దూరంగా ఉండడంతో

  ఇద్దరూ దూరంగా ఉండడంతో

  బిగ్ బాస్ షోలో చేసిన రచ్చ కారణంగా షణ్ముఖ్ జస్వంత్‌కు దీప్తి సునైనా బ్రేకప్ చెప్పేసింది. దీంతో శ్రీహాన్ కూడా సిరి హన్మంత్‌కు దూరం కాబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే వీళ్లిద్దరూ చాలా రోజులుగా దూరం దూరంగా ఉంటున్నారు. దీంతో వీళ్లిద్దరూ విడిపోవడం నిజమేనన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. దీనిపై ఆమె ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు.

  Bigg Boss Telugu 5 : Shanmukh - Siri Hanmanth Track Never Ends || Filmibeat Telugu
  బ్రేకప్ వార్తలకు పుల్‌స్టాప్ పెట్టి

  బ్రేకప్ వార్తలకు పుల్‌స్టాప్ పెట్టి

  సిరి హన్మంత్‌కు శ్రీహాన్ బ్రేకప్ చెప్పేశాడని వార్తలు వస్తున్నా నేపథ్యంలో తాజాగా దీనిపై క్లారిటీ వచ్చేసింది. గత రాత్రి వీళ్లిద్దరూ కలిసి యాంకర్ రవి కుటుంబాన్ని కలిశారు. అక్కడే చాలా సేపు సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి బయటకు వచ్చింది. దీంతో వీళ్లిద్దరూ విడిపోవడం లేదని క్లారిటీ వచ్చేసింది. దీంతో ఈ బ్రేకప్ వార్తలకు పుల్‌స్టాప్ పడిపోయినట్లైంది.

  English summary
  Bigg Boss Fame Siri Hanmanth and Her Boyfriend Shrihan Chotu Recently Met Anchor Ravi Family. This Pic Stopped The News about Their Breakup.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X