For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  శ్రీహాన్‌ను మోసం చేసిన సిరి హన్మంత్: అడ్డంగా దొరికి బుక్కైపోయిన బ్యూటీ

  |

  తెలుగు బుల్లితెరపై సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తూ దేశ వ్యాప్తంగా టాప్ ప్లేస్‌లో కొనసాగుతోన్న షో బిగ్ బాస్. కనీవినీ ఎరుగని రీతిలో ప్రేక్షకాదరణను అందుకున్న ఇది ఇప్పటికే ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్‌ను పూర్తి చేసుకుంది. దీంతో ఎన్నో రికార్డులను కూడా క్రియేట్ చేసింది. అదే సమయంలో ఈ షో వల్ల ఎంతో మంది ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్నారు. అందులో కొందరు చెడ్డపేరును కూడా మూటగట్టుకున్నారు. అలాంటి వారిలో సోషల్ మీడియా సెన్సేషన్ సిరి హన్మంత్ ఒకరు. చక్కని ఆటతీరు కనబరిచినా.. షణ్ముఖ్ జస్వంత్ ట్రాక్ వల్ల ఆమె ఇమేజ్ డ్యామేజ్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా సిరి.. తన కాబోయే భర్త శ్రీహాన్‌ను మోసం చేసి దొరికిపోయింది. అసలేం జరిగిందో మీరే చూడండి!

  అలా పరిచయం.. ఆ సీరియళ్లు

  అలా పరిచయం.. ఆ సీరియళ్లు

  ఆరంభంలో సిరి హన్మంత్ రిపోర్టర్‌గా ఓ యూట్యూబ్‌ చానెల్‌లో పని చేసింది. ఆ తర్వాత కొన్ని న్యూస్‌ ఛానెళ్లలో సైతం న్యూస్ రీడర్‌గా చేసింది. అలా ఫేమస్ అయిన ఈ చిన్నది ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే 'ఎవరే నువ్వు మోహినీ', 'సావిత్రమ్మ గారి అబ్బాయి', 'అగ్ని సాక్షి' వంటి సీరియళ్లలో నటించింది. తద్వారా ఫుల్ పాపులర్ అయింది.

  శివాని రాజశేఖర్ అందాల ఆరబోత: తొలిసారి ఇంత హాట్‌గా కనిపించడంతో!

  సినిమాలు.. వెబ్ సిరీస్‌లు చేసి

  సినిమాలు.. వెబ్ సిరీస్‌లు చేసి

  బుల్లితెర నటిగా అప్పుడప్పుడే ఎదుగుతోన్న సమయంలోనే సిరి హన్మంత్ 'ఇద్దరి లోకం ఒక్కటే', 'ఒరేయ్ బుజ్జిగా' వంటి సినిమాల్లో నటించింది. అంతేకాదు, 'మరపురాని ప్రేమకథ', 'దట్', '4 డేస్ విత్ సిరి', 'లవ్ అండ్ డౌట్' వంటి వెబ్ సిరీస్‌లలో నటించింది. వీటితో పాటు కొన్ని స్పెషల్ మ్యూజిక్ ఆల్బమ్స్‌తో పాటు స్పెషల్ వీడియోలు చేసి క్రేజ్ పెంచుకుంది.

  బిగ్ బాస్ ఛాన్స్.. ఆటతో పేరు

  బిగ్ బాస్ ఛాన్స్.. ఆటతో పేరు

  గత ఏడాది వచ్చిన బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి ఎంతో మంది సెలెబ్రిటీలు ఎంట్రీ ఇచ్చారు. అందులో చాలా తక్కువ మంది మాత్రమే టైటిల్ ఫేవరెట్లుగా పేరు తెచ్చుకున్నారు. అందులో సీరియల్ నటిగా ఫేమస్ అయిన సిరి హన్మంత్ కూడా ఉంది. ఆరంభంలోనే తన ఆటతీరుతో కెప్టెన్‌గా ఎంపికైన ఈ బ్యూటీ.. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా గుర్తింపు తెచ్చుకుని తెగ హైలైట్ అయింది.

  యాంకర్ శ్రీముఖి గ్లామర్ షో: అబ్బో ఆమె అందాలు చూసి తట్టుకోగలరా!

  షణ్ముఖ్ వల్ల ఇమేజ్ డ్యామేజ్

  షణ్ముఖ్ వల్ల ఇమేజ్ డ్యామేజ్

  ఐదో సీజన్‌లో షణ్ముఖ్ జస్వంత్ కూడా ఉన్నాడు. సిరి హన్మంత్ ఆటతీరులో పర్వాలేదనిపించినా.. వ్యవహార శైలితో మాత్రం తరచూ వార్తల్లో నిలిస్తూ వచ్చింది. మరీ ముఖ్యంగా షన్నూతో రొమాన్స్ చేయడం.. హగ్గులు ఇవ్వడం.. ముద్దులు పెట్టడం.. పక్కనే పడుకోవడం.. అలగడం వంటివి చేస్తూ ఉండేది. దీంతో ఆమె ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయిన విషయం తెలిసిందే.

  శ్రీహాన్‌తో బ్రేకప్.. అలా క్లారిటీ

  శ్రీహాన్‌తో బ్రేకప్.. అలా క్లారిటీ

  బిగ్ బాస్‌లోకి రాకముందే సిరి హన్మంత్.. శ్రీహాన్ చోటు అనే నటుడితో ప్రేమాయణం సాగించింది. అతడితో ఓ కార్యక్రమంలో నిశ్చితార్థం కూడా చేసుకుంది. అలా ఎంగేజ్‌డ్‌గా బిగ్ బాస్ షోలోకి వచ్చిన ఆమె.. ఇందులో మాత్రం షణ్ముఖ్‌తో రొమాన్స్‌ను పడించింది. దీంతో శ్రీహాన్‌ ఆమెకు బ్రేకప్ చెప్తాడని అంతా అనుకున్నారు. కానీ, అలా జరగకుండా ఇద్దరూ జంటగా ఉంటున్నారు.

  విచిత్రమైన డ్రెస్‌లో జాన్వీ కపూర్ రచ్చ: వామ్మో మరీ ఇంత దారుణమా!

  సోషల్ మీడియాలో జంటగా

  సోషల్ మీడియాలో జంటగా


  కెరీర్ పరంగా ఫుల్ బిజీగానే ఉంటోన్న అటు శ్రీహాన్.. ఇటు సిరి హన్మంత్ ఇద్దరూ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరూ జంటగా దిగిన ఫొటోలు, తీసుకున్న వీడియోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తున్నారు. తద్వారా తమ తమ ఫాలోయింగ్ పెంచుకోవడంతో పాటు జంటగానే అంటూ అన్యోన్యతను చాటుకుంటూ నిత్యం హైలైట్ అవుతున్నారు.

  శ్రీహాన్‌ను మోసం చేసిన సిరి

  శ్రీహాన్‌ను మోసం చేసిన సిరి

  సిరి హన్మంత్ తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో శ్రీహాన్‌కు ఆమెకు మధ్య ఊపిరి తీసుకోకుండా ఎవరు ఎక్కువ సేపు నీటిలో ఉంటారు అన్న పోటీ జరిగింది. ఇందులో శ్రీహాన్ నీళ్లలోకి వెళ్లగా.. సిరి మాత్రం అలాగే ఉండి అతడిని మోసం చేసింది. అయితే, దీన్ని గ్రహించిన శ్రీహాన్.. ఆమె చీట్ చేసిందని చెప్పాడు. అంతేకాదు, సరదాగా నీటిలో ముంచి నాలుగు దెబ్బలు వేశాడు.

  English summary
  Bigg Boss Fame Siri Hanmanth Very Active in Social Media. Recently She Shares A Funny Video in Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X