twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss: ఫినాలే ముందు బిగ్ షాక్.. సిరి - శ్రీహాన్ బ్రేకప్.. పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అవడంతో!

    |

    తెలుగు బుల్లితెరపై సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తూ దేశ వ్యాప్తంగా టాప్ ప్లేస్‌లో కొనసాగుతోన్న షో బిగ్ బాస్. ఇప్పటికే ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్‌ను పూర్తి చేసుకుంది. దీంతో ఎన్నో రికార్డులను కూడా క్రియేట్ చేసింది. అదే సమయంలో ఈ షో వల్ల ఎంతో మంది ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో సిరి హన్మంత్ ఒకరు. ఐదో సీజన్‌లో ఆమె సందడి చేయగా.. ఇప్పుడు ఆరో దానిలో శ్రీహాన్ ఫినాలేకు చేరాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ షోలో పాల్గొన్న సిరి.. శ్రీహాన్‌తో బ్రేకప్, తల్లైన విషయాలపై స్పందించింది. ఆ వివరాలు మీకోసం!

    ఆరో సీజన్‌లో శ్రీహాన్... సిరి సపోర్ట్

    ఆరో సీజన్‌లో శ్రీహాన్... సిరి సపోర్ట్

    బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి ఎంతో మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. అందులో శ్రీహాన్ కూడా ఒకడు. ఈ సీజన్ ఆరంభంలోనే అతడు తనదైన ఆటతీరు, మాటతీరుతో అందరి దృష్టినీ ఆకర్షించి స్ట్రాంగ్ ప్లేయర్ అనిపించుకున్నాడు. మధ్యలో కొన్ని పొరపాట్లు చేసినా చివరి వరకూ నెగ్గుకొచ్చాడు. లోపల అతడు ఆడుతుంటే.. బయట మాత్రం గర్ల్‌ఫ్రెండ్ సిరి హన్మంత్ సపోర్ట్ చేస్తోంది.

    యాంకర్ వర్షిణి ఎద అందాల జాతర: ఘోరంగా చూపిస్తూ ఇలా తెగించిందేంటి!యాంకర్ వర్షిణి ఎద అందాల జాతర: ఘోరంగా చూపిస్తూ ఇలా తెగించిందేంటి!

    హౌస్‌లోకి సిరి రాక.. శ్రీహాన్ ఛేంజ్

    హౌస్‌లోకి సిరి రాక.. శ్రీహాన్ ఛేంజ్

    ఆరో సీజన్‌లో ఫ్యామిలీ వీక్‌లో భాగంగా శ్రీహాన్ కోసం అతడి ప్రేయసి సిరి హన్మంత్ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ ఎపిసోడ్ ఎంతో రొమాంటిక్‌గా, క్యూట్‌గా సాగింది. ఇక, ఆమె వెళ్లిన తర్వాత శ్రీహాన్‌లో చాలా మార్పులు వచ్చినట్లు కనిపిస్తోంది. ఇదే విషయాన్ని హౌస్‌మేట్స్‌తో పాటు హోస్ట్ నాగార్జున కూడా చెప్పాడు. దీంతో అతడు తరచూ దీనిపై బాధ పడుతున్నాడు.

    ఫినాలేలో శ్రీహాన్.. టైటిల్ రేసులో

    ఫినాలేలో శ్రీహాన్.. టైటిల్ రేసులో

    గత వారం జరిగిన టికెట్ టు ఫినాలే టాస్కులో శ్రీహాన్ విజయం సాధించాడు. తద్వారా నేరుగా ఫినాలేలోకి అడుగు పెట్టిన మొదటి కంటెస్టెంట్‌గా నిలిచాడు. దీంతో ఈ వారం అతడు నామినేషన్స్‌లో కూడా లేడు. ఇక, టాప్ 5కి చేరిన శ్రీహాన్ టైటిల్ రేసులో కూడా ఉన్నాడు. బయట ఫాలోయింగ్ ఉండడంతో అతడు కూడా ఈ సీజన్ గెలిచే ఛాన్స్‌లు కాస్త ఉన్నాయని చెప్పొచ్చు.

    క్లీవేజ్ షోతో కాకరేపుతోన్న శివాత్మిక: అబ్బో టాప్ అందాలతో అరాచకం!క్లీవేజ్ షోతో కాకరేపుతోన్న శివాత్మిక: అబ్బో టాప్ అందాలతో అరాచకం!

    ఆ షోలో సిరి.. అన్నీ చెప్పేసింది

    ఆ షోలో సిరి.. అన్నీ చెప్పేసింది

    శ్రీహాన్ బిగ్ బాస్ షోలో ఫినాలేకు చేరి టైటిల్ కోసం పోటీ పడుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడి ప్రేయసి సిరి హన్మంత్.. ఆరియానా గ్లోరీ నిర్వహిస్తోన్న బీబీ కేఫే షోలోకి గెస్టుగా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే శ్రీహాన్ ఆటతీరు, బయట వాళ్లద్దరి రిలేషన్, పెళ్లి, గొడవలు సహా ఎన్నో విషయాలను ఆమె బయట పెట్టింది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో తెగ వైరల్ అయిపోతోంది.

    శ్రీహాన్‌తో పెళ్లెప్పుడో చెప్పిన సిరి

    శ్రీహాన్‌తో పెళ్లెప్పుడో చెప్పిన సిరి

    ఆరియానా గ్లోరీ హోస్ట్ చేస్తోన్న 'బీబీ కేఫే' షోలో పాల్గొన్న సిరి హన్మంత్‌ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. ఇందులో భాగంగానే ఓ యూట్యూబ్ ఛానెల్‌ థంబ్‌నెయిల్ చూపించి 'మీ పెళ్లి నిజంగా ఎప్పుడు జరుగుతుంది' అని ఆరియానా ప్రశ్నించింది. దీనికి సిరి హన్మంత్ 'మా పెళ్లి నిజంగానే నెక్ట్స్ ఇయర్ జరుగుతుంది' అని చెప్పింది. దీంతో వాళ్ల ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

    పాయల్ బాత్రూం పిక్స్ వైరల్: అది కూడా లేకుంటే అంతే సంగతులు!పాయల్ బాత్రూం పిక్స్ వైరల్: అది కూడా లేకుంటే అంతే సంగతులు!

    పెళ్లి కాకుండానే తల్లైన బ్యూటీ

    ఈ షోలో భాగంగానే 'పెళ్లి కాకుండా తల్లైన బిగ్ బాస్ సిరి హన్మంత్' అనే యూట్యూబ్ థంబ్‌నెయిల్‌ను ఆరియానా గ్లోరీ.. సిరి హన్మంత్‌కు చూపించింది. దీనికామె ఒక్కసారిగా షాక్‌కు గురైంది. అంతేకాదు, ఆ తర్వాత 'ఓడియమ్మా.. ఏంటీ థంబ్‌నెయిల్' అని ఆరియానాను ప్రశ్నించింది. తర్వాత తన కడుపును చూసుకుంటూ 'హేయ్.. నేనేమీ అవలేదు' అని క్లారిటీ ఇచ్చింది.

    శ్రీహాన్‌తో బ్రేకప్.. చాలా జరిగాయి

    శ్రీహాన్‌తో బ్రేకప్.. చాలా జరిగాయి

    ఇక, చివర్లో 'సిరికి శ్రీహాన్ బ్రేకప్. తన లైఫ్ నుంచి సిరి జ్ఞాపకాలు తీసేసిన శ్రీహాన్' అనే థంబ్ నెయిల్‌ను కూడా ఆరియానా గ్లోరీ.. సిరి హన్మంత్‌కు చూపించింది. దీనికామె చాలా బాధ పడింది. అంతేకాదు, 'మా పర్సనల్ లైఫ్‌లో చాలా ఇష్యూస్ అయ్యాయి' అంటూ ఏదేదో చెప్పుకొచ్చింది. దీన్ని మాత్రం సస్పెన్స్‌గా ఉంచారు. దీంతో ఈ ఎపిసోడ్‌పై అందరిలో ఆసక్తి నెలకొంది.

    English summary
    Bigg Boss Fame Siri Hanmanth Participated in BB Cafe Show. She Gave Clarity about Breakup with Shrihan And Pregnancy News.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X