Bigg Boss 5 నుంచి కంటెస్టెంట్ పేరు లీక్: ఎంట్రీ ఇవ్వనున్న బుల్లితెర నటి.. ఆ కారణం వల్లే ఈమెకు ఆఫర్
ఏమాత్రం అంచనాలు లేకుండానే తెలుగులోకి వచ్చినా కనీవినీ ఎరుగని రితిలో ప్రేక్షకాదరణను అందుకుని.. నెంబర్ వన్ రియాలిటీ షోగా పేరొందింది బిగ్ బాస్. కొత్త కంటెంట్‌తో ప్రసారం అయిన ఈ షో ఇప్పటికే విజయవంతంగా నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే త్వరలో మరో దానిని కూడా ప్రారంభించబోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సీజన్ గురించిన వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఇందులో పాల్గొనబోయే ఓ కంటెస్టెంట్ పేరు లీక్ అయింది. ఇంతకీ ఎవరా కంటెస్టెంట్? బ్యాగ్రౌండ్ ఏంటి? ఆ పూర్తి వివరాలు మీకోసం!

తెలుగు షోకు జాతీయ స్థాయి గుర్తింపు
మిగిలిన భాషల కంటే బిగ్ బాస్ షో తెలుగులోనే ఎక్కువ సక్సెస్ అయింది. ఇప్పటి వరకూ నాలుగు సీజన్లు జరగగా.. అన్నింటికీ ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఏ ఏడాదికి ఆ ఏడాది టీఆర్పీ రికార్డులు క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే నాలుగో సీజన్ ప్రీమియర్ ఎపిసోడ్‌కు 18 పైచిలుకు రేటింగ్ దక్కింది. దీంతో టీఆర్పీలో నేషనల్ రికార్డులు కొట్టేసింది.

ఐదో సీజన్‌పై నీలినీడలు.. ఫ్యాన్స్ షాక్
నాలుగేళ్లుగా ప్రారంభం అయినప్పటి నుంచి ప్రతి ఏడాదీ బిగ్ బాస్ షో ప్రసారం అవుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఐదో సీజన్‌కు సమయం ఆసన్నమైంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ షో మొదలయ్యేది సందేహమే అని టాక్ వినిపించింది. అంతేకాదు, ఈ ఏడాది బిగ్ బాస్ షో ఉండదు అని కూడా పుకార్లు షికార్లు చేశాయి. దీంతో బిగ్ బాస్ అభిమానులు ఢీలా పడిపోయారు.

సీజన్ వివరాలు లీక్.. అప్పుడే ఆరంభం
పరిస్థితుల ప్రభావం ఎలా ఉన్నా ఐదో సీజన్ ఎట్టి పరిస్థితుల్లో ఈ సారి కూడా ఉంటుందని క్లారిటీ వచ్చేసింది. ఈ క్రమంలోనే దీని ప్రారంభ తేదీ కూడా ఆ మధ్య బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ సీజన్ సెప్టెంబర్ 5వ తేదీ ఆదివారం సాయంత్రం నుంచి ప్రారంభం కాబోతుందట. ఐదో సీజన్‌కు సంబంధించిన లోగో ఆగస్టులో.. అలాగే ప్రోమో ఆగస్టు 29న రిలీజ్ కానుందనే టాక్ వినిపిస్తోంది.

కంటెస్టెంట్ల గురించి టాక్... ఎంపిక ఇలా
బిగ్ బాస్ ఐదో సీజన్ ఎలాగైనా ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ మాత్రం కొనసాగుతూనే ఉందని మరో న్యూస్ వైరల్ అవుతోంది. దాదాపు వంద మంది ప్రముఖుల్లో ఇటీవలే షార్ట్ లిస్ట్ తయారు చేశారని అంటున్నారు. వీరితో జూమ్ కాల్ ద్వారా ఇంటర్వ్యూలు జరుపుతున్నారని తెలిసింది. ఈ క్రమంలోనే కొందరి పేర్లు కూడా ఒక్కక్కొటిగా బయటకొస్తున్నాయి.

Bigg Boss నుంచి కంటెస్టెంట్ పేరు లీక్
బిగ్ బాస్ ఐదో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చే వాళ్లు పేర్లు చాలా రోజులుగా వైరల్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఒక పేరు లీక్ అయింది. ఆమె ఎవరో కాదు.. సోషల్ మీడియాలో సెన్సేషన్ అవడంతో పాటు ఈ మధ్య కాలంలో వరుస ఆఫర్లతో దూసుకెళ్తోన్న సిరి హన్మంత్. అవును ఈమెతో బిగ్ బాస్ నిర్వహకులు ఇప్పటికే అగ్రిమెంట్ చేసుకున్నారని తెలిసింది.
Recommended Video

బుల్లితెర నటి ఎంట్రీ.. అందుకే షో ఆఫర్
యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయిన సిరి హన్మంత్.. ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే 'ఉయ్యాలా జంపాల', 'అగ్నిసాక్షి' సహా పలు ధారావాహికల్లో నటించింది. అలాగే, 'సాఫ్ట్ వేర్ బిచ్చగాళ్లు' అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. వీటితో పాటు 'రామ్ లీలా', 'మేడం సార్ మేడం అంతే' వంటి వెబ్ సిరీస్‌లు చేసింది. ఇలా ఫేమస్ అవడం వల్లే బిగ్ బాస్ ఛాన్స్ పట్టేసిందట.


Click it and Unblock the Notifications











