Don't Miss!
- Lifestyle
Today Rasi Phalalu : ఈ రోజు మీకు శుభమా లేదా అశుభమా ఎలా ఉంటుంది? ఏఏ రాశులకు ఎలా ఉంటుంది
- News
ఆపరేషన్ ఆకర్ష్: తెలంగాణ బీజేపీలో కీలక పాత్ర పోషించనున్న ఈటల రాజేందర్!
- Sports
IND vs ENG: ఇదెక్కడి పిచ్ రా అయ్యా.. ఇన్నింగ్స్ బ్రేక్‌లో రోలర్‌తో తొక్కించారా? వసీం జాఫర్ సెటైర్!
- Finance
20,000 డాలర్లకు దిగువనే బిట్ కాయిన్, క్రిప్టో మార్కెట్ ఇంకా ఆ స్థాయిలోనే
- Travel
అద్భుత కళాకృతుల నిలయం.. రఘురాజ్‌పూర్..
- Technology
భారత్‌లో 46 వేల ఖాతాలపై నిషేధం విధించిన Twitter!
- Automobiles
భారత మార్కెట్లో సుజుకి కటానా Suzuki Katana స్పోర్ట్స్ బైక్ విడుదల; ధర రూ.13.61 లక్షలు
బిగ్ బాస్ వల్ల రెండోదీ కోల్పోయిన సిరి హన్మంత్: ఈమెకే ఇలా ఉందంటే అతడి పరిస్థితి ఏంటో!
ఎన్నో అనుమానాలతో.. ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చినా ఐదేళ్లుగా తెలుగులో నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఈ మధ్యలో ఎన్నో షోలు మొదలైనా.. దీన్ని మాత్రం అస్సలు టచ్ చేయలేకపోయాయి. అంతలా ఈ షో బుల్లితెరపై హవాను చూపిస్తూ దూసుకెళ్తోంది. అందుకే తెలుగులో మొన్నటితో ఐదు సీజన్లను ఒకదానికి మించి ఒకటి రెస్పాన్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుంది.
ఇక, ఐదో సీజన్లో ప్రముఖ నటి సిరి హన్మంత్ ఓ టాస్కులో గాయపడిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆమెను ఆ గాయాలు వెంటాడుతూనే ఉన్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సిరి తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. ఇంతకీ ఏం జరిగింది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

అందరిలో స్పెషల్‌గా వచ్చింది
గత ఏడాది ప్రసారం అయిన ఐదో సీజన్లోకి ఎంతో మంది సెలెబ్రిటీలు వచ్చారు. అందులో చాలా తక్కువ మంది మాత్రమే టైటిల్ ఫేవరెట్లుగా పేరు తెచ్చుకున్నారు. అందులో సీరియల్ నటిగా ఫేమస్ అయిన సిరి హన్మంత్ ఒకరు. ఆరంభంలోనే తనదైన ఆటతీరుతో కెప్టెన్‌గా ఎంపికైన ఈ బ్యూటీ.. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా గుర్తింపు తెచ్చుకుంది. దీంతో అందరి దృష్టిలో పడింది.
Bigg Boss Non Stop: అతడిపై ఎదురు తిరిగిన కంటెస్టెంట్లు.. కంప్లైంట్ చేయడంతో ఇంట్లో నుంచి ఔట్

షన్నూతో కలిసి రచ్చ చేసింది
ఐదో సీజన్లో సిరి హన్మంత్ ఆట పరంగా అందరినీ ఆకట్టుకున్నప్పటికీ.. వ్యవహారశైలితో మాత్రం షాకుల మీద షాకులిచ్చింది. మరీ ముఖ్యంగా షణ్ముఖ్ జస్వంత్‌తో ఆమె చేసిన రచ్చ మాత్రం హాట్ టాపిక్ అయింది. మరీ ముఖ్యంగా అతడితో రొమాన్స్ చేయడం.. హగ్గులు ముద్దులు ఇవ్వడం.. ఎప్పుడూ కలిసే ఉండడంతో సిరి హన్మంత్‌పై విమర్శలు వెల్లువెత్తాయని తెలిసిందే.

టైటిలే కాదు.. ఇమేజ్ డ్యామేజ్
వ్యవహార శైలి విషయంలో ఎలా ఉన్నా బిగ్ బాస్ ఐదో సీజన్ చివరి వరకూ ఉండడంతో సిరి హన్మంత్ ఫినాలేలో కూడా అడుగు పెట్టింది. అప్పుడు కూడా ఆమె షణ్ముఖ్ జస్వంత్ విజయం సాధించాలని కోరుకుంది. ఇందుకోసం తన క్యారెక్టర్‌ను దిగజార్చుకుంది. దీంతో టైటిల్ పోవడంతో పాటు క్యారెక్టర్‌ను కూడా కోల్పోయిందని ఈమెపై భారీ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.
Rashmika Mandanna: గ్లామర్ కంచె తెంచేసిన శ్రీవల్లి.. బౌండరీ దాటేసి మరీ ఘాటుగా!

టాస్కులో గాయపడిన బ్యూటీ
'టికెట్ టు ఫినాలే' టాస్కులో భాగంగా జరిగిన ఐస్ ఛాలెంజ్ టాస్కులో కొందరు కంటెస్టెంట్లు గాయపడిన విషయం తెలిసిందే. ఇందులో సిరి హన్మంత్ కూడా ఉంది. దీంతో ఆమెను మెడికల్ రూమ్‌లోకి తీసుకుని వెళ్లారు. దీంతో డాక్టర్లు ఆమెకు వైద్యం చేశారు. కానీ, అంతకంతకూ అది తీవ్రం అయింది. దీంతో సిరి హన్మంత్ గాయాలు పెద్దవి అవడంతో సరిగా ఆడలేకపోయింది.

నడవడానికి లేకుండా కష్టాలు
పదిహేను వారాల పాటు బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సిరి హన్మంత్.. షో వల్ల ఏం సంపాదించిందో తెలియదు కానీ.. టాస్కులో కాళ్లకు అయిన గాయాలతోనే బయటకు వచ్చింది. అయితే, అందరిలా కాకుండా ఆమె చాలా రోజుల పాటు ఇంటికే పరిమితం అయిన విషయం కూడా తెలిసిందే. ఆ మధ్య వచ్చిన ఓ వీడియోలో ఆమె రెండు కాళ్లపై కొద్దిగా చర్మం లేచిపోయినట్లు కనిపించింది.
బ్రాతో యాంకర్ వర్షిణి అందాల విందు: ఆమెను ఈ ఘాటు ఫోజుల్లో చూశారంటే!

షో వల్ల రెండోదీ కోల్పోయింది
బిగ్ బాస్ షోలో ఐస్ చాలెంజ్ టాస్కులో కాళ్లకు గాయాల చేసుకున్న సిరి హన్మంత్.. ఆ బాధను ఇప్పటికీ అనుభవిస్తోంది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ వీడియోతో ఇది బయటకు వచ్చింది. ఇందులో ఆమె కాలి బొటన వేలికి గోరు లేకుండానే కనిపించింది. ఇక, ఇప్పుడు దాని పక్కనే ఉన్న వేలుకు సైతం గోరు ఊడిపోతోంది. దీనికి 'ఇంకోటి రెడీగా ఉంది' అని చెప్పింది.

అతడి పరిస్థితి ఎలా ఉందో
ఐదో సీజన్లో జరిగిన ఐస్ టాస్కులో అందరి కంటే శ్రీరామ చంద్రకే ఎక్కువగా గాయాలు అయిన విషయం తెలిసిందే. సిరి హన్మంత్ తక్కువ గాయాలతోనే బయటకు వచ్చింది. అయినప్పటికీ ఆమె ఇప్పటి వరకూ బాధ పడుతూనే ఉంది. అలాంటిది అస్సలు నడవలేని స్థితిలో వచ్చిన శ్రీరామ చంద్ర పరిస్థితి ఇంకెలా ఉందో అని అతడి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.